Andhra Pradesh: ఆ ఊరి పేరే దీపావళి.. ఎక్కడ ఉందంటే..? | Village Named After Deepavali In Srikakulam District | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఆ ఊరి పేరే దీపావళి.. ఎక్కడ ఉందంటే..?

Published Thu, Nov 4 2021 8:14 AM | Last Updated on Thu, Nov 4 2021 3:49 PM

Village Named After Deepavali In Srikakulam District - Sakshi

గార: పండగల పేర్లతో ఊర్లు ఉండడం చాలా అరుదు. జిల్లాలో మాత్రం దీపావళి పేరుతో ఓ ఊరుంది. శ్రీకాకుళం నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఈ ఊరు ఉంది. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు స్థానికులు చెబుతుంటారు. దీనిపై చుట్టుపక్క గ్రామాల్లో ఓ కథ చెబుతుంటారు. ఆ కథ ప్రకారం.. శ్రీకాకుళాన్ని పాలించిన రాజు కళింగపట్నం ప్రాంతానికి అప్పుడప్పుడు గుర్రంపై ఇదే ప్రాంతం మీదుగా వెళ్లేవారు.

(చదవండి: మెరిసే తీరం సూర్యలంక బీచ్‌

ఒక రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు రాజును గుర్తించి సపర్యలు చేశారు. రాజు కోలుకున్న తర్వాత వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ గ్రామానికి దీపావళిగానే నామకరణం చేశారు. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ ఊరి పేరు దీపావళిగానే నమోదై ఉంది. గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు.

చదవండి: Diwali: ఈ టపాసులు తినెయ్యొచ్చు

పండగ పేరు.. మా ఊరు
మా ఊరికి హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరు ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి గ్రామంలో జన్మించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దీపావళిని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటాం. 
– శ్రీ రంగం మధుసూదనరావు, విశ్వహిందూపరిషత్‌ కార్యదర్శి, దీపావళి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement