'మీ ఆస్తులు కాలిపోవద్దని కోరుకుంటున్నా' | ramgopal varma tweets on deepavali | Sakshi
Sakshi News home page

'మీ ఆస్తులు కాలిపోవద్దని కోరుకుంటున్నా'

Published Wed, Nov 11 2015 11:52 AM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

'మీ ఆస్తులు కాలిపోవద్దని కోరుకుంటున్నా' - Sakshi

'మీ ఆస్తులు కాలిపోవద్దని కోరుకుంటున్నా'

ప్రతి సందర్భాన్ని తన ట్వీట్లతో మరింత ఆసక్తికరంగా మార్చేసే రామ్గోపాల్ వర్మ దీపావళి పండుగ సందర్భంగా కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించాడు. తన మార్క్ స్టేట్మెంట్లతో ఫాలోవర్స్ని ఎంటర్టైన్ చేశాడు. గతంలో వర్మ ట్వీట్స్ను సీరియస్ గా తీసుకున్న జనాలు ఇప్పుడు మాత్రం చూసి నవ్వేసి ఊరుకుంటున్నారు.

దీపావళి సందర్భంగా 'కాలిన తరువాత ఆ పరిణామాలను ఎదుర్కొనే ధైర్యమున్న ప్రతీ ఒక్కరికి అన్ సేఫ్ హ్యాపీ దీవాళి. ఈ రోజు రాత్రి ఎలాంటి అనుకోని సంఘటనల వల్ల మీ ఆస్తులు, ఆనందం కాలిపోవద్దని నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నా. మనలో ఎవరికీ నరకాసుడు మనకు చేసిన అన్యాయం ఏంటో తెలీదు. అయినా అతని చావును ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం పండుగ చేసుకోవటానికి ఓ రీజన్ కావాలి కదా' అంటూ ట్విట్టర్ వేదికగా దీపావళి టపాసులు పేల్చాడు.

అంతేకాదు దీపావళి పండుగకు ఒక్క రోజు ముందు తన కొత్త సినిమా కిల్లింగ్ వీరప్పన్లోని కాల్పుల సన్నివేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ తన మార్క్ దీపావళి ఎలా ఉంటుందో అభిమానులకు పరిచయం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement