పవన్‌ను ఇరికించిన వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. మెగా హీరోలకు, పొగుడుతున్నట్టుగా చురకలంటించే వర్మ.. చెన్నై వరదలపై ఇంత వరకు స్పందించని పవన్ కల్యాణ్‌ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ చెన్నైలో సంభవించిన భారీ ప్రకృతి విపత్తుపై స్పందించలేదు. అయితే సంఘటనపై పవన్ తరపున వర్మ స్పందించాడు.
'పవన్ కల్యాణ్ చెన్నై వరద బాధితులకు 2 కోట్ల రూపాయల సాయం అందించటం ఎంతో ఆనందంగా ఉంది. పవర్ స్టార్ అంటే ఇదే. పవన్ ఇస్తున్న రెండు కోట్లు, రజనీకాంత్ ఇచ్చిన పది కోట్ల కన్నా చాలా ఎక్కువ. రజనీ తన ప్రాంత ప్రజల కోసం చేస్తున్నాడు. పవన్ మాత్రం మానవత్వంతో చేస్తున్నాడు. పవన్ తీసుకున్న నిర్ణయం ఆయన చేగువరా అభిమానిగా ప్రూవ్ చేస్తోంది. దీన్ని బట్టి పవర్ స్టార్‌కు సూపర్ స్టార్ కన్నా 20 రెట్లు ఎక్కువగా జాలీ ఉందని ప్రూవ్ అవుతోంది'. అంటూ ట్వీట్ చేశాడు.
కొద్ది రోజులుగా గుజరాత్ షూటింగ్లో ఉన్న పవన్, ఆ తరువాత షూటింగ్ ముగించుకొని హైదరబాద్ వచ్చినా, తమిళనాడులో పరిస్థితులపై మాత్రం స్పందించలేదు. దీంతో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు పవన్ వర్గాన్ని, ఆయన అభిమానులని ఇరకాటంలో పడేశాయి.
Extremely happy to hear that P K donated 2 cr to chennai victims..I salute this extraordinary gesture..This is what is the Power of a Star
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2015
P k gvng 2 cr is more than R K giving 10 cr becos R K doing to his people whereas P K is doing to different on humanitarian considerations
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2015
P K giving 2 cr to chennai tragedy is proof his concern is for human tragedy across states which justifies his adulation for Che Guevara
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2015
This just proves that Power Star has 20 times more sympathy towards human tragedy than the Super Star
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2015