'హే ట్రంప్ ఐ లవ్ యూ'!
ముంబై: డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అంటే అభిమానం అని వేరే చెప్పక్కర్లేదు. సందర్భం వచ్చిన ప్రతీసారీ ట్రంప్పై ఉన్న అభిమానాన్ని వర్మ ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఓర్లాండోలోని గే నైట్క్లబ్లో.. ఇస్లామిక్ ఉగ్రవాదిగా భావిస్తున్న ఒమర్ మతీన్ కాల్పులు జరిపి 50 మందిని హతమార్చిన నేపథ్యంలో రాము చూపు మరోసారి ట్రంప్పై పడింది. అమెరికన్లకు రెండే అవకాశాలున్నాయన్న వర్మ.. ఒకటి వారిని డొనాల్డ్ ట్రంప్ ఆశీర్వదించాలి, లేదా 'అల్లా' ఆశీర్వాదించాలన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి డొనాల్డ్ ట్రంప్ బెటర్ ఆప్షన్ అని రాము చెప్పకనే చెప్పారు.
'టెర్రరిస్టుల అతిపెద్ద ఆయుధం సర్ప్రైజ్, ఈ విషయం ఓర్లాండో దాడితో మరోసారి నిరూపితమైంది. సర్ప్రైజ్ను ఎవరూ ముందుగా ఊహించలేరు. ముందుగా ఊహిస్తే అది సర్ప్రైజ్ కాదు' అంటూ రాము తనదైన శైలిలో ట్వీట్ చేశారు. క్లబ్లో మనుషులను వరుసగా కూర్చున్న బాతులను కాల్చినట్లు కాల్చడం చూస్తుంటే.. బాధితుల చేతిలో కూడా ఆయుధాలుంటే ఈ ఘటన జరిగేది కాదన్న డొనాల్డ్ ట్రంప్ మాటలకు బలం చేకూరుతుందన్నారు. 'ఒకవేళ మంచి వారికి చెడు జరిగినట్లైతే.. నువ్వు చెడ్డవారికి చెడు చేయాల్సిందే' అన్న ట్రంప్ వ్యాఖ్యలకు గాను 'హే ట్రంప్ ఐ లవ్ యూ ఫర్ దిస్ కోట్' అంటూ రాము ట్వీట్ చేశారు.
Hey @realDonaldTrump ,I luv u for saying this...."If bad things happen to good people,you should do worse things to bad people"
— Ram Gopal Varma (@RGVzoomin) 12 June 2016
Americans have only two choices..Either let @realDonaldTrump bless them or @allah bless them
— Ram Gopal Varma (@RGVzoomin) 12 June 2016