నకిరేకల్, న్యూస్‌లైన్
కాళ్లపారాణి ఆరకముందే వరకట్న వేధింపులకు నవవధువు బలైంది. ఈ ఘటన నకిరేకల్ మండలం చందుపట్లలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కనగల్ మండలం యెడవెల్లి గ్రామానికి చెందిన సరస్వతి అలియస్ నాగ(20)కి చందుపట్లకు చెందిన పర్షబోయిన సురేష్‌తో గత నెల 23 తేదీన వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.70వేల నగదుతో పా టు ఇతర బంగారు ఆభరణాలు ముట్టచెప్పారు. అయి తే మరో రెండు లక్షలు అదనంగా తీసుకురావాలని భర్త సురేష్, ఇతర కుటుంబ సభ్యులు సరస్వతిని వేధించా రు.
దీపావళి పండగకు కూడా పుట్టింటికి పంపించలేదు. రెండు లక్షల కట్నం తీసుకు వస్తేనే ఇంట్లో ఉండాలం టూ బుధవారం సురేష్ భార్య సరస్వతిని చందుపట్లలో ఆటో ఎక్కించి పుట్టింటికి పంపించాడు. దీంతో అప్పటికే పురుగులమందు తాగిన సరస్వతి ఆటోలో కొద్ది దూరం వెళ్లగానే అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన ఆటోలోని ప్రయాణికులు, డ్రైవర్ విషయాన్ని ఆమె భర్త సురేష్‌కు చెప్పారు. సరస్వతిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రా త్రి మృతిచెందింది. భర్త, కుటుంబీకుల వేధింపుల కారణంగానే తన సోదరి మృతిచెందిందని సరస్వతి సోదరుడు వెంకన్నపోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.
వేధింపులకు నవ వధువు బలి
Published Fri, Nov 8 2013 2:25 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement