వెలుగులు జిమ్మే దీపావళి రానే వచ్చింది. శుక్రవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. పండుగ సామగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లకు తరలివచ్చారు. ధరల మోత మోగినా బాణసంచా వ్యాపారం జోరుగా సాగింది. ప్రజలకు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, బీజేపీ జాతీయనేత వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సాక్షి, చెన్నై:
దీపావళిని రాష్ర్ట వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకోనున్నారు. చెన్నై నగరంలోని టి.నగర్, పురసైవాక్కం, ప్యారిస్, రాయపేట పరిసరాల్లోని అన్ని వాణిజ్య కేంద్రాలు కొనుగోలుదారులతో శుక్రవారం కిటకిటలాడాయి. అన్ని ప్రాంతాలూ సందడి సందడిగా కనిపించాయి. పండుగకు ముందు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చా రు. కొత్త దుస్తులు, పండుగ సామగ్రి కొనుగోళ్లలో మునిగిపోయూరు. మరోవైపు బాణసంచా విక్రయూలు జోరందుకున్నా రుు. ఈ ఏడాది ధరలు అధికంగా ఉన్నా జనం వెనకాడలేదు. అలాగే స్వీట్ల దుకాణాలు వినియోగదారులతో కిక్కిరిసారుు.
సొంతూళ్లకు పయనం నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో శుక్రవారం కాస్త ట్రాఫిక్ తగ్గింది. అయితే కోయంబేడు బస్టాండ్ పరిసరాల్లో మాత్రం బస్సులతో రోడ్లు కిక్కిరిశాయి. చివరిరోజు సీట్లు దొరికినా, దొరక్కునా స్వగ్రామాలకు జనం పరుగులు తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నడిపిన బస్సుల్లో, ప్రత్యేక రైళ్లలో లక్షలాది మంది తరలి వెళ్లారు.
నిఘా కట్టుదిట్టం
దీపావళి పర్వదినాన సంఘ విద్రోహశక్తులు రెచ్చిపోవచ్చన్న కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. వాహనాల తనిఖీ చేపట్టింది. అలాగే నగరాల్లోని ప్రధాన కూడళ్లలో 24 గంటలూ షిఫ్ట్‌ల పద్ధతిలో సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. చెన్నైలో 15 వేల మంది సిబ్బందిని భద్రతకు దించారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో వీరు విధుల్లో ఉంటారు.
అవగాహన
ప్రమాదరహితంగా బాణసంచా కాల్చే విషయమై అగ్నిమాపక శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానంగా గుడిసె ప్రాంతాల్లో రాకెట్లు, గాల్లో పేలే ఇతర రంగురంగుల బాణసంచా వినియోగించరాదని సూచించింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉన్నారుు. అలాగే అనుమతి లేని బాణసంచా దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. పర్యావరణ శాఖ వర్గాలు సైతం రోడ్డెక్కాయి. ఎక్కడెక్కడ కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందో పరిశీలించేందుకు పరికరాలను ఏర్పాటు చేశారుు.
తొమ్మిది మంది మృతి
అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తంజావూరు జిల్లాలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. తంజావూరు జిల్లా కుంబకోణం సమీపంలోని ఓ బాణసంచా పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యూరు. ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేపట్టారు.
నేతల శుభాకాంక్షలు
గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, బీజేపీ జాతీయనేత వెంకయ్య నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్, ఇండియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకేవాసన్ తదితరులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి రాష్ర్ట ప్రజల జీవితాల్లో మరింత వెలుగు నింపాలని రోశయ్య ఆకాంక్షించారు. అందరిలోనూ ఈ పర్వదినాన ప్రేమానురాగాలు వికసించాలని, వెలుగుల దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు. దీపావళిని అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, నవ్యకాంతులు ప్రతి కుటుంబంలో నిండాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
దీపావళి సందడే సందడి
Published Sat, Nov 2 2013 6:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 AM
Advertisement
Advertisement