T. Nagar
-
మూగబోయిన టీ నగర్
చెన్నై: ముఖ్యమంత్రి జయలిలత మృతితో చెన్నైలోని ప్రధాన బిజినెస్ సెంటర్లు మూగబోయాయి. ముఖ్యంగా చెన్నైలో ప్రధాన షాపింగ్ కేంద్రంగా ప్రసిద్ది చెందిన టీ నగర్ లో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు.వీటితోపాటు ఉస్మాన్ రోడ్, పాండీ బజార్ సహా రంగనాధన్ వీధి లో అన్ని దుకాణాలను తమ అభిమాన ముఖ్యమంత్రి, ప్రియతమ అమ్మ మృతిపట్ల గౌరవ సూచకంగా మూసివేశారు. దీంతో కొనుగోలుదారులతో ఎంతో రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో తీరని విషాదంతో నిశ్శబ్దం అలుముకుంది.ఎపుడూ ఆటోరిక్షాలు, కార్లు, ద్విచక్రవాహనాలు సందడి ఉండే పలువాణిజ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారిపోయాయ. ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి ఉద్దేశించిన కొన్ని పోలీసు వాహనాలు మాత్రం దర్శనమిస్తున్నాయి కాగా తీవ్ర అనారోగ్యం సోమవారం తుదిశ్వాస విడిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్ధివ దేహానికి పూర్తి అధికార లాంఛనాలతో ఈ సాయంత్రం 4.30 ని.లకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు తుది నివాళులర్పించేందకు గాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చెన్నైలోని రాజాజీకి భవనకు చేరుకుని నివాళులర్పించారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. -
అన్నాడీఎంకే నేత హత్య
టీనగర్, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే నేత మంగళవారం హత్యకు గురయ్యాడు. చెంగల్పట్టు గుండూరు ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నేత రాజగోపాల్ (52). తిరుమణి పంచాయతీ అధ్యక్షునికిగా ఉంటూ వచ్చారు. ఇతని మొదటి భార్య జయ. చెంగల్పట్టు మున్సిపల్ మాజీ అధ్యక్షురాలు, రెండవ భార్య భువనేశ్వరి ప్రస్తుతం తిరుమణి పంచాయతీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఈమె కుమారుడు సెంథిల్. చెంగల్పట్టు 27వ వార్డు కౌన్సిలర్‌గాను, అన్నాడీఎంకే ఇలంజర్ పాసరై కాంచీపురం జిల్లా అధ్యక్షునిగానూ ఉన్నారు. రాజగోపాల్ పైన గత 2004లో మనపాక్కం పాలారులో ఇసుక అక్రమాలకు అడ్డుకునేందుకు వెళ్లిన తిరుకళికుండ్రం తహశీల్దార్ వెంకటేశన్‌పై లారీ ఎక్కించి హత్య చేసిన కేసు సహా పలు కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తుల ముఠా రాజగోపాల్‌పై పెట్రో బాంబు వేసి హత్య చేసింది. దీని గురించి చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలా ఉండగా బుధవారం ఉదయం రాజగోపాల్ భార్యలు జయ, భువనేశ్వరి, కుమారులు, కుమార్తెలు, బంధువులు, వంద మందికిపైగా అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రాస్తారోకో జరిపారు. దీంతో చెన్నై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఒక గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది. చెంగల్పట్టు పోలీసులు అక్కడికి చేరుకుని హంతకులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో చెంగల్పట్టులో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. హంతకులను అరెస్టు చేసేందుకు నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు అయ్యాయి. -
దీపావళి సందడే సందడి
వెలుగులు జిమ్మే దీపావళి రానే వచ్చింది. శుక్రవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. పండుగ సామగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లకు తరలివచ్చారు. ధరల మోత మోగినా బాణసంచా వ్యాపారం జోరుగా సాగింది. ప్రజలకు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, బీజేపీ జాతీయనేత వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షి, చెన్నై: దీపావళిని రాష్ర్ట వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకోనున్నారు. చెన్నై నగరంలోని టి.నగర్, పురసైవాక్కం, ప్యారిస్, రాయపేట పరిసరాల్లోని అన్ని వాణిజ్య కేంద్రాలు కొనుగోలుదారులతో శుక్రవారం కిటకిటలాడాయి. అన్ని ప్రాంతాలూ సందడి సందడిగా కనిపించాయి. పండుగకు ముందు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చా రు. కొత్త దుస్తులు, పండుగ సామగ్రి కొనుగోళ్లలో మునిగిపోయూరు. మరోవైపు బాణసంచా విక్రయూలు జోరందుకున్నా రుు. ఈ ఏడాది ధరలు అధికంగా ఉన్నా జనం వెనకాడలేదు. అలాగే స్వీట్ల దుకాణాలు వినియోగదారులతో కిక్కిరిసారుు. సొంతూళ్లకు పయనం నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో శుక్రవారం కాస్త ట్రాఫిక్ తగ్గింది. అయితే కోయంబేడు బస్టాండ్ పరిసరాల్లో మాత్రం బస్సులతో రోడ్లు కిక్కిరిశాయి. చివరిరోజు సీట్లు దొరికినా, దొరక్కునా స్వగ్రామాలకు జనం పరుగులు తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నడిపిన బస్సుల్లో, ప్రత్యేక రైళ్లలో లక్షలాది మంది తరలి వెళ్లారు. నిఘా కట్టుదిట్టం దీపావళి పర్వదినాన సంఘ విద్రోహశక్తులు రెచ్చిపోవచ్చన్న కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. వాహనాల తనిఖీ చేపట్టింది. అలాగే నగరాల్లోని ప్రధాన కూడళ్లలో 24 గంటలూ షిఫ్ట్‌ల పద్ధతిలో సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. చెన్నైలో 15 వేల మంది సిబ్బందిని భద్రతకు దించారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో వీరు విధుల్లో ఉంటారు. అవగాహన ప్రమాదరహితంగా బాణసంచా కాల్చే విషయమై అగ్నిమాపక శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానంగా గుడిసె ప్రాంతాల్లో రాకెట్లు, గాల్లో పేలే ఇతర రంగురంగుల బాణసంచా వినియోగించరాదని సూచించింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉన్నారుు. అలాగే అనుమతి లేని బాణసంచా దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. పర్యావరణ శాఖ వర్గాలు సైతం రోడ్డెక్కాయి. ఎక్కడెక్కడ కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందో పరిశీలించేందుకు పరికరాలను ఏర్పాటు చేశారుు. తొమ్మిది మంది మృతి అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తంజావూరు జిల్లాలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. తంజావూరు జిల్లా కుంబకోణం సమీపంలోని ఓ బాణసంచా పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యూరు. ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేపట్టారు. నేతల శుభాకాంక్షలు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, బీజేపీ జాతీయనేత వెంకయ్య నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్, ఇండియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకేవాసన్ తదితరులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి రాష్ర్ట ప్రజల జీవితాల్లో మరింత వెలుగు నింపాలని రోశయ్య ఆకాంక్షించారు. అందరిలోనూ ఈ పర్వదినాన ప్రేమానురాగాలు వికసించాలని, వెలుగుల దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు. దీపావళిని అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, నవ్యకాంతులు ప్రతి కుటుంబంలో నిండాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. -
వైభవంగా శ్రీనివాస కల్యాణం
టీ.నగర్, న్యూస్‌లైన్: చెన్నై పెరంబూరులోని శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శ్రీనివాస కల్యాణ వైభవంగా జరిగింది. చెన్నై మూలకడై జంక్షన్‌లోని వల్లి మహల్లో కల్యాణోత్సవం జరిగింది. కాంచీపురం వరదరాజ పెరుమాల్ ఆస్థాన పండితులు రంగన్ భట్టాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీనివాస కల్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎన్.కన్నయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరిం చారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం 21 ఏళ్లుగా శ్రీనివాస కల్యాణం నిర్వహిం చడం అభినందనీయమని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రెసిడెంట్ తమ్మినేని బాబు మాట్లాడుతూ శ్రీవారి కల్యాణం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. శనివారం రాత్రి పెరంబూరు ఆనంద నిలయం ఆధ్వర్యంలో గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరిగిందన్నారు. ఈ ఊరేగింపు నాలుగు వీధులు తిరిగి ఆనంద నిలయం చేరుకోగా రాత్రి 9.30 గంటలకు నిశ్చితార్థం కార్యక్రమం జరిగిందన్నారు. మూలకడై వల్లిమహల్ లో ఆదివారం ఉదయం జరిగిన కల్యాణోత్సవంలో స్వామి వారికి గణపతి హోమం, అభిషేకం, తిరుమంజనం, ఉయ్యాల సేవ, పూల దండల మార్పు, మహా దీపారాధన నిర్వహించినట్టు తెలిపారు. వరుడి తరపున శ్రీనివాసన్ దంపతులు, శ్రీదేవి, భూదేవి తరపున డి.జంబులింగం దంపతులు ఉభయదారులుగా పాల్గొని కల్యాణం జరిపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం కార్యదర్శి ఆర్ఎం శేషన్, కోశాధికారి డి.రామలింగం పాల్గొన్నారు. -
జార్జియానాకు అశ్రు నివాళి
టీనగర్, న్యూస్‌లైన్: లండన్ నుంచి తీసుకొచ్చిన చెన్నై విద్యార్థిని జార్జియానా మృతదేహా నికి కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలు అశ్రు నివాళులర్పించారు. ఆమె మృతదేహానికి కీల్పాక్కంలోగల క్రైస్తవ స్మశానవాటికలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెం దిన విద్యార్థిని జార్జియానా మృతదేహం విమానంలో శనివారం ఉదయం చెన్నై చేరుకుంది. చెన్నై, ముగప్పేర్ వెస్ట్ పాడికుప్పం ప్రాంతానికి చెందిన నాంజి ల్ థామ్సన్(49). జేజే నగర్ సీఐగా ఉన్నారు. ఇతని కుమార్తె జార్జియానా(18) లండన్ లివర్‌పూర్ యూనివర్సిటీ లో ఏరో నాటికల్ ఇంజినీరింగ్ చదివేది. జూలై నెల 12వ తేదీ లండన్‌లో జార్జియానా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన కుమార్తె మృతిపై అనుమానం ఉన్నట్లు థామ్సన్ లండన్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జార్జియానా మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేసేందుకు కోర్టు ఉత్తర్వులిచ్చింది. నాలుగవ తేదీ రీపోస్టుమార్టం చేయబడ్డ జార్జియానా మృతదేహం గురువారం కుటుంబసభ్యులకు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం లండన్ నుంచి బయలుదేరిన వారు శనివారం ఉద యం 8.30 గంటలకు చెన్నై విమానాశ్రయానికి మృతదేహంతో పాటు వచ్చారు. ఉదయం 10.15 గంటలకు డి కుప్పానికి జార్జియానా మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు. అక్కడ బంధువులు, స్నేహితులు సహా పలువురు ఆమెకు నివాళులర్పించారు. తర్వాత మృతదేహాన్ని అన్నానగర్‌లో గల సెంట్‌లూక్స్ చర్చికి తీసుకువెళ్లి అక్కడ మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు నిర్వహించారు. మృతదేహాన్ని ఊరేగింపుగా కీల్పాక్కం క్రైస్తవ శశ్మాన వాటికకు తీసుకొచ్చి సాయంత్రం 5.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.