జార్జియానాకు అశ్రు నివాళి
Published Sun, Aug 11 2013 2:07 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
టీనగర్, న్యూస్‌లైన్: లండన్ నుంచి తీసుకొచ్చిన చెన్నై విద్యార్థిని జార్జియానా మృతదేహా నికి కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలు అశ్రు నివాళులర్పించారు. ఆమె మృతదేహానికి కీల్పాక్కంలోగల క్రైస్తవ స్మశానవాటికలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెం దిన విద్యార్థిని జార్జియానా మృతదేహం విమానంలో శనివారం ఉదయం చెన్నై చేరుకుంది. చెన్నై, ముగప్పేర్ వెస్ట్ పాడికుప్పం ప్రాంతానికి చెందిన నాంజి ల్ థామ్సన్(49). జేజే నగర్ సీఐగా ఉన్నారు.
ఇతని కుమార్తె జార్జియానా(18) లండన్ లివర్‌పూర్ యూనివర్సిటీ లో ఏరో నాటికల్ ఇంజినీరింగ్ చదివేది. జూలై నెల 12వ తేదీ లండన్‌లో జార్జియానా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన కుమార్తె మృతిపై అనుమానం ఉన్నట్లు థామ్సన్ లండన్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జార్జియానా మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేసేందుకు కోర్టు ఉత్తర్వులిచ్చింది. నాలుగవ తేదీ రీపోస్టుమార్టం చేయబడ్డ జార్జియానా మృతదేహం గురువారం కుటుంబసభ్యులకు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం లండన్ నుంచి బయలుదేరిన వారు శనివారం ఉద యం 8.30 గంటలకు చెన్నై విమానాశ్రయానికి మృతదేహంతో పాటు వచ్చారు.
ఉదయం 10.15 గంటలకు డి కుప్పానికి జార్జియానా మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు. అక్కడ బంధువులు, స్నేహితులు సహా పలువురు ఆమెకు నివాళులర్పించారు. తర్వాత మృతదేహాన్ని అన్నానగర్‌లో గల సెంట్‌లూక్స్ చర్చికి తీసుకువెళ్లి అక్కడ మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు నిర్వహించారు. మృతదేహాన్ని ఊరేగింపుగా కీల్పాక్కం క్రైస్తవ శశ్మాన వాటికకు తీసుకొచ్చి సాయంత్రం 5.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.
Advertisement
Advertisement