దీపావళి దందాలో ఫైరాఫీసర్‌ అవుట్‌! | Fire Officer Suspended | Sakshi
Sakshi News home page

దీపావళి దందాలో ఫైరాఫీసర్‌ అవుట్‌!

Published Wed, Nov 2 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

దీపావళి దందాలో ఫైరాఫీసర్‌ అవుట్‌!

దీపావళి దందాలో ఫైరాఫీసర్‌ అవుట్‌!

రాజంపేట ఫైర్‌ ఆఫీసర్‌ సస్పెన్షన్‌
పోలీసులపై కూడా పిర్యాదులవెల్లువ

రాజంపేటః  దీపావళి సందర్భంగా పలు టపాసులు దుకాణాల వద్ద టపాసులు కలెక్షన్‌ ఓ అధికారిపై వేటు పడేలా చేసింది. వివరాల్లోకి వెళితే...రాజంపేట అగ్నిమాపకశాఖ అధికారి బాలపిచ్చయ్యను సస్పెండ్‌ చేశారు. దీపావళి సందర్భంగా భారీగా టపాసులు వసూళ్ళు చేశారంటూ ఆరోపణలు వెలువెత్తిన క్రమంలో ఈ సస్పెండ్‌కు గురైనట్లు సమాచారం. రాజంపేట, నందలూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో బహిరంగంగానే టపాసులు దందా చేయడంపై సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీంతో జిల్లా అగ్నిమాపకశాఖ నుంచి మంగళవారం సాయంత్రం బాలపిచ్చయ్యను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి విజయకుమార్‌ సాక్షికి ధృవీకరించారు. బాలపిచ్చయ్యపై సిబ్బంది నుంచి కూడా పిర్యాదులు ఉన్నతాధికారులకు వెళ్లినట్లు తెలిసింది. కాగా గతంలో పత్తికొండ, రైల్వేకోడూరులో పనిచేసిన హయాంలో పలు ఆరోపణలు బాలపిచ్చయ్య ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
బాలపిచ్చయ్య బాటలో సివిల్‌పోలీసులు!
బాలపిచ్చయ్య బాటలో మరికొంతమంది సివిల్‌పోలీసులు దీపావళి దందా నిర్వహించారు. రాజంపేట సబ్‌డివిజన్‌ పరిధిలో కొందరు కింది స్ధాయి నుంచి సర్కిల్‌ స్ధాయి వరకు అధికారులు దీపావళి దందా నిర్వహించినట్లుగా ఉన్నతాధికారులకు పిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. తనిఖీల పేరుతో బాణసంచాల దుకాణాల వద్దకు వెళ్లి మరీ బెదరించి తమ తమ స్ధాయిలో పటాసులను తమ వాహనాల్లో ఎక్కించుకొని పంచుకున్నట్లుగా ఆరోపణలు వెలువడ్డాయి.పోలీసు సబ్‌డివిజన్‌ కేంద్రమైన రాజంపేట పట్టణంలో వ్యాపారులకు టపాసులు మాముళ్ల తాకిడిని తట్టుకోలేకపోయారు. ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా శనివారం రోజున పోలీసులు, పైర్‌ పోలీసులు  తమ దైనశైలిలో వ్యాపారుల నుంచి బాణసంచాలను రాబట్టారు. ఇదంతా ఓపెన్‌ స్రీకెట్టే. సాధారణ కానిస్టేబల్‌ నుంచి పై స్ధాయి వరకు పోలీసులు టపాసుల విక్రయాలపైన్నే దృష్టి సారించారు. ముందుగానే వ్యాపారులు లేకుంటే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది తాకిడి అధికమైంది. దీంతో పోలీసులు, ఫైర్‌ పోలీసులు వ్యవహారంపై విలవిలలాడారు. దుకాణం వద్ద వచ్చే పోలీసులు, పైర్‌ సిబ్బందికి చెప్పలేక..మింగలేక బాణసంచాలను ఇవ్వడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాస్ధితి.
ప్యామిలీప్యాకెట్ల పంచుకున్నారు..
పోలీసు డిపార్టుమెంటుకు స్టేషన్‌ స్టేషన్‌కు బాణసంచాల దుకాణాల నుంచి తీసుకొచ్చిన ఫ్యామిలీప్యాకెట్లను పంచుకున్నారు. ఏ కానిస్టేబుల్‌ చేతిలో చూసిన ప్యామిలీప్యాకెట్‌ కనిపించడం బహిరంగమే.. ఇక ఫైర్‌ విభాగానికి చెందిన ఓ అధికారి స్వయంగా బైకు మీదు తిరుగుతూ దుకాణాల వద్ద టపాసులు ప్యాకెట్లను కలెక్ట్‌ చేయడం బహిరంగగానే కనిపించింది. అంతకముందుగా లైసెన్స్‌లు, నిబంధనలు పేరుతో దుకాణాదారులు నుంచి మాముళ్లు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. రాజంపేట సబ్‌డివిజన్‌ పరిధిలో ఏయే ప్రాంతాల్లో టపాసులు దుకాణాలు ఉన్నాయని, వాటన్నింటి వద్దకు ఫైర్‌ పోలీసులు,పోలీసులు వెళ్లి సవాలక్ష బెదిరింపులు చేసి మరీ అందినకాడికి టపాసులు వసూలు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement