ఐదురోజుల దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ధన్‌తేరాస్ రోజు భారత్‌లో బంగారం, వెండిపై జరిగే లావాదేవీలు సుమారు రూ.30వేల కోట్లు జరుగుతుందని అంచనా. అదే సమయంలో ఆటోమొబైల్స్, కిచెన్‌లో వినియోగించే వస్తువులు, చీపుర్ల వ్యాపారం సైతం భారీగా జరిగే అవకాశం ఉందని సమాచారం.
ధన్‌తేరాస్‌తో (నవంబర్ 10తో) దేశంలో దీపావళి ఉత్సవాలు ప్రారంభమై..రూపచతుర్ధశి, దీపావళి, గోవర్ధన్ పూజ, అన్నాచెల్లెళ్ల (భయ్యా దూజ్) ముగుస్తాయి. ఈ ఐదు రోజుల సమయంలో పైన పేర్కొన్న పరిశ్రమల్లో వ్యాపారం జోరుగా సాగుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
రూ.50వేల కోట్లు దాటింది
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం.. నవంబర్ 10న దేశం అంతటా జరిగిన వ్యాపారం రూ.50 వేల కోట్లు దాటినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఢిల్లీలో బిజినెస్ రూ. 5,000 కోట్లు జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా సీఏఐటీ అధ్యక్షుడు బీసీ భారతియా, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ధన్‌తేరాస్ రోజు గణేష్,లక్ష్మి, కుబేరుల విగ్రహాలతో పాటు, వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలు, అలాగే పాత్రలు, వంటగది ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, చీపుర్లు వంటి వస్తువులు ఈ రోజున కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు మంచిదని భావిస్తారని అన్నారు. అంతేకాకుండా, మట్టి దీపాలు, ఇల్లు, ఆఫీసుల అలంకరణ కోసం వినియోగించే వస్తువులు, ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్, దీపావళి పూజ సామగ్రి కొనుగోలు కూడా ధన్‌తేరాస్ రోజున కొనుగోలు చేస్తారని చెప్పారు
బంగారం, వెండి విక్రయ లావాదేవీలు
దేశవ్యాప్తంగా బంగారం, వెండి తదితర వస్తువులకు సంబంధించి రూ.30,000 కోట్ల టర్నోవర్ దాటిందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా తెలిపారు. ఈ వ్యాపారంలో సుమారు రూ. 27,000 కోట్ల విలువైన బంగారు వస్తువులు, రూ. 3,000 కోట్ల వెండి లావాదేవీలు ఉన్నాయి.
ఇప్పటి వరకు ఎంత బంగారం అమ్ముడు పోయిందంటే
ధన్‌తేరాస్‌లో ఇప్పటి వరకు సుమారుగా 41 టన్నుల బంగారం, 400 టన్నుల వెండి ఆభరణాలు, నాణేలు అమ్ముడుపోయాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) క్రింద నమోదైన 1,85,000 రిజిస్టర్ చేసుకోగా.. దాదాపు నాలుగు లక్షల చిన్న, పెద్ద ఆభరణాలు విక్రయించే వ‍్యాపారులు ఉన్నట్లు తేలింది. బీఐఎస్ ప్రమాణాలు ఇంకా అమలు చేయని ప్రాంతాల్లో అదనంగా 2,25,000 చిన్న ఆభరణాల షాపులు విక్రయాలు నిర్వహిస్తున్నాయి. ఐదురోజుల దీపావళికి భారత్ ఏటా విదేశాల నుంచి దాదాపు 800 టన్నుల బంగారం, 4,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment