ముంబై: దీపావళి ముందు వారం జరిగిన కొనుగోళ్లలో డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులు 20% పెరి గాయి. సాధారణ వారాంతంతో పోలిస్తే దీపావళి ముందు వారాంతంలో దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో 20% వృద్ధి నమోదైందని ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలందిస్తున్న వరల్డ్‌లైన్ ఇండియా తన నివేదికలో తెలిపింది. దీపావళి వారాంతానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. సౌందర్య సాధనాలు, కళ్లజోళ్లు, పుస్తక విక్రయశాలలు, సెలూన్లలో కార్డు ద్వారా చెల్లింపుల్లో 20 శాతం వృద్ధి కనపడింది. ఇక గృహోపకరణాలు, ఫర్నీషింగ్స్ విభాగాల్లో 30%, దుస్తులు, ఫ్యాషన్ రిటైల్‌లు 22% వృద్ధి కనబర్చాయి. అక్టోబర్ 25-27 మధ్య కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాలు 15-25 శాతం వృద్ధి నమోదు కాగా, ఢిల్లీ ప్రాంతంలో ఇది 24 శాతంగా ఉంది. ఆ తర్వాతి స్థానాలు ముంబై, బెంగళూరు కైవసం చేసుకున్నాయి. లావాదేవీల సంఖ ్య 25 లక్షలుంది.