
డ్రైనేజీలో దిగి పూడిక తీస్తున్న మంత్రి కమలకన్నన్
తూర్పు గోదావరి, యానాం: బనియన్.. మోకాలు వరకు నిక్కరు వేసుకుని డ్రైన్‌లో సిల్టు తీయిస్తున్న ఈయనెవరో తెలుసా..పుదుచ్ఛేరి విద్యాశాఖ మంత్రి కమలకన్నన్.. కారైకల్ ప్రాంతానికి చెందిన ఈయన శుక్రవారం తన సొంత నియోజకవర్గం తిరునాళ్లార్‌కు వెళ్లి పారిశుద్ధ్య కార్మికులతో పాటు డ్రైన్‌లోకి దిగి ఇదిగో ఇలా పూడిక తీత పనులు చేపట్టారు. మంత్రిననే గర్వం, బేషజాలు లేకుండా ఆయన చేసిన పనిని చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
Comments
Please login to add a commentAdd a comment