
సంగారెడ్డిలో జోరువాన
సంగారెడ్డి పట్టణంలో బుధవారం మధ్యాహ్నం గంటపాటు భారీ వర్షం కురిసింది. పట్టణంలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నిన్నమొన్నటి వరకు ఎండలు దంచి కొట్టడంతో ఇబ్బంది పడ్డ జనం ఈ వర్షంతో వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు.- సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి