
నంద్యాల అర్బన్: ‘మార్వాడీలకు పరిశుభ్రతంటే తెలియదు. ఇళ్లలోని చెత్తా చెదారాన్ని మురుగు కాలువల్లో వేస్తూ అపరిశుభ్రతకు కారణమవుతున్నారు’ అని శాసనమండలి చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్ వ్యాఖ్యానించారు. కాలువలు చెత్తతో నిండి మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, ఇందుకు కారణమైన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని 9వ వార్డులో జరిగిన ‘జన్మభూమి–మాఊరు’ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. పరిశుభ్రతకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు కొందరు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.బైర్మల్ వీధిలోని తన ఇంటి పరిసరాల్లో ఉంటున్న మార్వాడీలు చెత్తంతా మురుగు కాలువల్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.