సాక్షి, హైదరాబాద్: ప్రతియేటా జీహెచ్‌ఎంసీ రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. రహదారులు వేయడానికి ముందే అవసరమైన వరద కాల్వలు, క్యాచ్‌పిట్లు, డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు, కేబుళ్ల కోసం డక్ట్ వంటివి వేయాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. దాంతో ఆయా అవసరాల కోసం రోడ్డు వేసిన కొన్ని నెలలకే తిరిగి తవ్వుతున్నారు. దాంతో ప్రజాధనం పెద్దయెత్తున దుబారా అవుతోంది.
అందుకు మచ్చుతునక ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం. దోమలగూడలో రోడ్డు వేసిన కొద్దినెలలకే ఇలా.. తవ్విపోస్తున్నారు. ముందస్తుగానే ఆయా విభాగాలు తాము చేయాల్సిన పనులు తెలియజేయడంతో ఇలాంటి పరిస్థితి రాకుండా చేస్తామని సిటీ కన్జర్వెన్స్ సమావేశాల్లో చెబుతున్నప్పటికీ, అమలులో లోపం కళ్లకు కడుతోంది.. ఇలా.. (క్లిక్: ట్యాంక్‌బండ్‌పై సరోజినీ నాయుడి జ్ఞాపకాలు)
Comments
Please login to add a commentAdd a comment