manhole
-
మృత్యు నాలాలు..! దడ పుట్టిస్తున్న మ్యాన్ హోల్స్
-
ఈ ఘటనతో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి
-
హైదరాబాద్ ప్రగతి నగర్ వద్ద నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
-
సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదం
-
సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరుపులు.. కాసేపటికే ముగ్గురూ..
గాంధీనగర్: సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి అందులోకి దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడాక ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గుజరాత్ భరూచ్ జిల్లాలోని దహేజ్‌లో జరిగింది. ఈ ముగ్గురు కార్మికులు స్థానిక పంచాయతీ కార్యాలయంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్లి చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులను గల్సిన్‌భాయ్ మునియా(30), పరేశ్ కతారా(31), అనిల్ పర్మార్(24)గా గుర్తించారు. వీరంతా దహేజ్ వాసులే కావడం గమనార్హం. సెప్టిక్‌ట్యాంకులోకి దిగిన వెంటనే తమకు ఊపిరాడటం లేదు సాయం చేయాలని ముగ్గురు కార్మికులు అరుపులు, కేకలు పెట్టినట్లు పోలీసులు వివరించారు. అక్కడున్నవారు వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ముగ్గురు కార్మికులను బయటకు తీశారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వీరు చనిపోయారని తెలిపారు. సెప్టిక్ ట్యాంక్‌లో విషవాయువు పీల్చడం వల్లే కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ముగ్గురూ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే సెప్టిక్ ట్యాంకులోకి దిగినట్లు స్థానికులు వెల్లడించారు. గుజరాత్లో పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం రెండు వారాల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 23న రాజ్‌కోట్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో గత రెండేళ్లలో మొత్తం 11 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం ఆందోళన కల్గిస్తోంది. చదవండి: హైదరాబాద్‌లో కాల్పులు.. ఒకరి మృతి -
Viral Video: మ్యాన్ హోల్ ను డంబెల్ లా ఎత్తేశాడు.. కానీ..!
-
Shocking Video: రోడ్డుపై ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారా.. ఈ వీడియో చూడండి
Shocking Video: రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. రోడ్డుపై ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ తెరిచిఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. బీహార్ రాజధాని పట్నాలోని అలమ్గంజ్లో ఓ మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. ఆమె మ్యాన్‌హోల్‌లో పడిపోవడం రోడ్డుపై ఉన్న కొందరు వ్యక్తులు గమనించి వెంటనే బయటకు తీశారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదంలో సదరు మహిళకు గాయలయ్యాయి. అయితే, ఈ ప్రమాదానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Is there anything in order in @NitishKumar 's Bihar? @jantadal govt has done anything for Janta? Hooch tragedies, crime against women r rampant. Opposition @yadavtejashwi @RJDforIndia r mute spectators? Concerned MC officials shud be terminated for this manhole travesty. pic.twitter.com/4Is5DmEOcM — TruBitter (@Pseudoidealist) April 23, 2022 ఇది చదవండి: పోయే కాలం అంటే ఇదేనేమో.. అయ్యా అదేం పని.. -
‘తవ్వి’పోదురుగాక!
సాక్షి, హైదరాబాద్: ప్రతియేటా జీహెచ్ఎంసీ రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. రహదారులు వేయడానికి ముందే అవసరమైన వరద కాల్వలు, క్యాచ్పిట్లు, డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు, కేబుళ్ల కోసం డక్ట్ వంటివి వేయాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. దాంతో ఆయా అవసరాల కోసం రోడ్డు వేసిన కొన్ని నెలలకే తిరిగి తవ్వుతున్నారు. దాంతో ప్రజాధనం పెద్దయెత్తున దుబారా అవుతోంది. అందుకు మచ్చుతునక ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం. దోమలగూడలో రోడ్డు వేసిన కొద్దినెలలకే ఇలా.. తవ్విపోస్తున్నారు. ముందస్తుగానే ఆయా విభాగాలు తాము చేయాల్సిన పనులు తెలియజేయడంతో ఇలాంటి పరిస్థితి రాకుండా చేస్తామని సిటీ కన్జర్వెన్స్ సమావేశాల్లో చెబుతున్నప్పటికీ, అమలులో లోపం కళ్లకు కడుతోంది.. ఇలా.. (క్లిక్: ట్యాంక్‌బండ్‌పై సరోజినీ నాయుడి జ్ఞాపకాలు) -
6 రోజుల నిరీక్షణ.. అంతయ్య మృతదేహం లభ్యం
సాక్షి, హైదరాబాద్: డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన అంతయ్య మృతదేహం ఎట్టికేలకు లభ్యమైంది. గల్లంతైన మృతదేహం కోసం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతూ గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 6 రోజుల తర్వాత అంతయ్య మృతదేహం బయటపడింది. కాగా గల్లంతైన ప్రాంతం నుంచి 350 మీటర్ల దూరంలో మృతదేహం దొరికినట్లు అధికారులు తెలిపారు. 6 రోజుల నిరీక్షణ అనంతరం.. బెంగుళూరుకు చెందిన అజంతా సొల్యూషన్స్ టెక్నాలజీ వారి నూతన టెక్నాలజీ కెమెరా పరికరాలతో మొదటగా ట్రంక్ లైన్ లో గుర్తించగా కొద్దిసేపటికే పక్కనే ఉన్న మ్యాన్ హోల్ వద్దకి మృతదేహాం వచ్చి ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే మృతదేహాన్ని బయటకు తీసే పనిలో పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందితో బయటకు తీయిస్తున్నారు. అంతయ్య కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని, మృతికి కారణమైన అధికారులని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఎల్బీ నగర్ పరిధిలోని సాహెబ్ నగర్లో డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్లో దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ప్రాణాలు విడిచారు. మొదట ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా గల్లంతయ్యాడు. శివ మృతదేహాన్ని రెస్క్యూ టీం వెలికితీసింది. అనంతయ్య మృతదేహాం కోసం ఆ రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా సోమవారం నాడు దొరికింది. -
మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి
కడప అర్బన్: వైఎస్సార్ కడపలో అనంతపురం జిల్లావాసి మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన బుక్కే శీనునాయక్ (45), బుక్కే నీలమ్మ దంపతులు. వీరికి ఇంటర్ చదివే కుమార్తె ఉంది. ఉపాధి కోసం వీరు కొన్నేళ్ల కిందట కడపకు వలస వెళ్లారు. శీనునాయక్ కోటిరెడ్డి సర్కిల్ సమీపంలోని బార్ అండ్ రెస్టారెంట్లో సప్లయర్‌గా పని చేస్తుండేవాడు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు భార్య నీలమ్మ నెలన్నర కిందట కదిరికి వెళ్లింది. కుమార్తె మదనపల్లెలో ఇంటర్ చదువుతోంది. శీనునాయక్ 20 రోజులుగా పనికి కూడా వెళ్లడం లేదు. రెండువారాల కిందట ఇంటి కరెంట్ బిల్లు తీసుకుని బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లలేదు. బీపీ షుగర్‌తో పాటు ఒక వైపు కన్ను కనిపించని శీనునాయక్ శుక్రవారం సూర్య ఆస్పత్రి సమీపాన మ్యాన్‌హోల్‌లో విగతజీవిగా కనిపించాడు. ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెంది ఉండవచ్చని బంధువులు భావిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సుధాకర్, ఏఎస్ఐ వలి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
అధికారుల తప్పిదంతోనే అంతయ్య గల్లంతు
-
నాలుగు రోజులైనా ఇంకా దొరకని అంతయ్య మృతదేహం
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల క్రితం డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన అంతయ్య మృతదేహం కోసం సాహెబ్ నగర్లో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతోంది.ఈ క్రమంలో అంతయ్య ఆచూకీ కోసం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతున్నారు. మృతదేహం కుంట్లూరు చెరువులో కొట్టుకు పోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొన్న మధ్యాహ్నం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మూడు రోజులు గడుస్తున్న అంతయ్య మృతదేహం వెలికి తీయకపోవడం పై కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల తప్పిదంతోనే అంతయ్య గల్లంతు అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ అవగాహన లోపం మూలంగానే ఇద్దరు వ్యక్తులు డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందారని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. గల్లంతైన అంతయ్య కోసం అదే రోజు రాత్రి 10గంటలకు అధికారులు స్పందించి ఉంటే అప్పుడే దొరికేవారని పేర్కొన్నారు. దీనికి అంతటికి కారణం అధికారుల అలసత్వమేనని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, రాగుల వెంకటేశ్వరరెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, కళ్లెం జీవన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు -
ఇద్దరి ప్రాణం తీసిన మ్యాన్ హోల్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ పరిధిలోని సాహెబ్ నగర్లో డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ప్రాణాలు విడిచారు. వాస్తవానికి రాత్రిపూట డ్రైనేజీ క్లీన్ చేసేందుకు అనుమతి లేదు. కాంట్రాక్టర్ బలవంతం చేయడంతో నలుగురు మ్యాన్హోల్లోకి దిగారు. ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా గల్లంతయ్యాడు. శివ మృతదేహాన్ని రెస్క్యూ టీం వెలికితీసింది. అనంతయ్య మృతదేహాం కోసం రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమవారి ప్రాణాలు గాల్లో కలిశాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం ఈ ఘటనపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో డ్రైనేజి క్లీన్ చేసేందుకు అనుమతి లేదనే స్పష్టమైన నిబంధనలు జీహెచ్ఎంసీలో ఉన్నాయన్నారు. అయితే ఉదయం వేళల్లో వాటర్ ప్రవాహం ఎక్కువగా ఉంటుదని.. రాత్రి ప్రవాహం తక్కువ ఉంటుందనే ఉద్ధేశ్యంతోనే ఈ పనికి పూనుకున్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సాహెబ్‌నగర్‌లో ఉద్రిక్తత ఇదిలా ఉండగా వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ కార్మికుల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది. -
వైరల్ వీడియో: చావు నుంచి తప్పించుకున్న మహిళలు
-
వైరల్: చావు నుంచి తప్పించుకున్న మహిళలు
ముంబై: వర్షాకాలం ఇంకా పూర్తిగా ప్రవేశించనేలేదు.. అప్పుడే వరుణుడు దేశ ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేస్తున్నాడు. ఎడతెరపి లేని వర్షాలతో ముంబై నగరం చిగురుటాకులా వణికిపోతుంది. ఇంత భారీ వర్షాలు పడితే.. నగరాల్లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మ్యాన్‌హోళ్లు నోరు తెరుచుకుని ఉంటాయి. ప్రతి ఏటా కొందరినైనా తమలోకి లాగేసుకుంటాయి ఈ మృత్యుకుహరాలు. తాజాగా ముంబైలో ఇద్దరు మహిళలు మ్యాన్‌హోల్‌లో పడ్డారు అదృష్టం కొద్ది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు.. ముంబైలోని భండప్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం పడుతుండగా.. కొందరు వ్యక్తులు పేవ్మెంట్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తుంటారు. అలా వెళ్తుండగా ఓ మహిళ తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోతుంది. అదృష్టం కొద్ది వెంటనే బయటపడుతుంది. కొద్ది క్షణాల అనంతరం మరో మహిళ కూడా అలానే మ్యాన్‌హోల్‌లో పడుతుంది.. తాను కూడా క్షేమంగా బయటకు వచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ముంబై సివిక్ బాడీ, బీఎంసీ మీద విమర్శల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో ‘‘రుతుపవనాలకు ముందే నగరంలోని మ్యాన్‌హోల్స్‌ని తనిఖీ చేసి మరమత్తులు చేస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కార్పొరేషన్ మరోసారి అన్ని నగరంలోని అన్ని రోడ్లు, మ్యాన్‌హోల్స్‌ను పరిశీలిస్తోంది” అని పౌరసంఘం ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాన్‌హోల్స్‌కు అవసరమైన రీప్లేస్మెంట్ చేయాల్సిందిగా.. మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు మునిసిపల్ కమిషనర్ (ప్రాజెక్టులు) పి వెలారసు సంబంధిత విభాగాలకు కఠినమైన సూచనలు ఇచ్చారు. చదవండి: పాలకోసం తండ్రి.. మందులకోసం కొడుకు..ఇద్దరూ సేఫ్! -
ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్
దొడ్డబళ్లాపురం: సురక్షిత పరికరాలు లేకుండా భూగర్భ డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన రామనగర పట్టణంలో చోటుచేసుకుంది. హరీష్ అనే కాంట్రాక్టర్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్వహణను చూస్తుంటాడు. పట్టణ పరిధిలోని న్యూ నేతాజీ స్కూల్ వెనుక డ్రెనేజీలో సమస్య ఏర్పడింది. దీంతో మంజునాథ్ అనే వ్యక్తి ఇద్దరు కార్మి కులు, రాకేశ్‌లను బెంగళూరు నుంచి పిలిపించారు. శుక్రవారం మధ్యాహ్నం మ్యాన్‌హోల్‌లో దిగి పనులు చేస్తుండగా ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. అగి్నమాపక సిబ్బంది, రామనగర పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తాళ్లతో బాధితులను బయటకు తీసి రామనగర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మాటలు రావడం లేదు : మంచు లక్ష్మి
ముంబై : గజిబిజి పరుగుల జీవితంలో మన కోసం మనం కేటాయించే సమయమే తక్కువ. ఇక పక్కవారి గురించి ఏం ఆలోచిస్తాం? కానీ ఓ మహిళ మాత్రం మానవత్వం, సాటివారిని పట్టించుకునే తత్వం ఇంకా ఉన్నాయనే నిరూపించారు. భారీ వర్షంలోనూ దాదాపు 5గంటల పాటు రోడ్డుపై నిలబడి వాహనదారులు మ్యాన్‌హోల్ ప్రమాదానికి గురికాకుండా కాపాడారు. ట్రాఫిక్ పోలీసు మాదిరి సంజ్ఞలు చేస్తూ మ్యాన్‌హోల్ గురించి వాహనదారులను హెచ్చరించింది. ప్రస్తుతం ఆ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. (చదవండి : లాప్టాప్ లాక్కెళ్లిన పంది.. నగ్నంగా అడవంతా..) 5గంటలు వర్షంలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరపిలేని వర్షాలతో ముంబై చిగురుటాకులా వణుకుతోంది. జనజీవనం స్తంభించింది. పశ్చిమ ముంబైలోని రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై ఓ మ్యాన్‌హోల్ తెరచి ఉండడం ఓ మహిళ గమనించింది. ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనాదారులకు చెప్పాలనుకుంది. వెంటనే మ్యాన్‌హోల్ దగ్గర నిలబడి అటువైపుగా వస్తున్న వాహనదారులను హెచ్చరించింది. ట్రాఫిక్ పోలీసు మాదిరి సంజ్ఞలు చేస్తూ వాహనాలను మళ్లించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై హీరోయిన్ మంచు లక్ష్మి సైతం స్పందించారు. ఈ వీడియో చూశాక మాటలు రావడం లేదంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి నిస్వార్థ, దయగల మహిళను ఇంతవరకు చూడలేదని, మానవత్వం, దయాగుణం ఇంకా బతికే ఉన్నాయని ఆ మహిళ నిరూపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
మహిళా మానవత్వం.. 5గంటలు రోడ్డుపై నిలబడి..
-
‘ఎవరూ ముందుకు రాలేదు.. నేనే దిగాను’
బెంగళూరు: మ్యాన్‌హోల్ లాంటి వాటిలో అడ్డంకులు ఏర్పడితే.. అధికారులకో.. ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేస్తాం. వారు పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయించి సమస్యను పరిష్కరిస్తారు. అయితే స్వయంగా ఓ ప్రజాప్రతినిధే మ్యాన్హోల్లోకి దిగి శుభ్రం చేసిన సంఘటన గురించి ఇంతవరకు ఎప్పుడు వినలేదు. కానీ బీజేపీ కార్పొరేటర్ మనోహర్ శెట్టి ఈ సంఘటనను నిజం చేసి చూపారు. మనోహర్ శెట్టి స్వయంగా మ్యాన్హోల్లోకి దిగి.. శుభ్రం చేశారు. ఆయనను అనుసరించి మరో నలుగురు బీజేపీ కార్యకర్తలు మ్యాన్హోల్లోకి దిగారు. అందరూ కలిసి ఆ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసి నీరు సాఫీగా పోయేలా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. మంగళూరు సిటీ కార్పొరేషన్ పరిధిలోని కద్రీ-కంబాలా వార్డు వద్ద చెత్త కుప్పలుగా బయట వేయడంతో ఆ పక్కనే ఉన్న మ్యాన్‌హోల్‌లో చెత్త అడ్డుపడి.. నీరు బయటకు పొంగిపోయింది. రహదారిపై నీరు ప్రవహిస్తూ ట్రాఫిక్‌కు, రోడ్డు మీద నడిచేవారికి ఇబ్బంది కలిగించింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మనోహర్ శెట్టి అక్కడికి చేరుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పిలిచి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయాలని కోరారు. అయితే రుతుపవనాల సమయంలో ఇది చాలా ప్రమాదకరమని, మ్యాన్‌హోల్ లోపలికి వెళ్లడానికి వారు నిరాకరించారు. దాంతో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు హై స్పీడ్ వాటర్ జెట్ అమర్చిన వాహనాన్ని పంపాలని మనోహర్ శెట్టి నగర కార్పొరేషన్‌ను ఆదేశించారు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇక లాభం లేదనుకున్న మనోహర్ శెట్టి తానే స్వయంగా 8 అడుగుల లోతులో ఉన్న మ్యాన్హోల్లోకి దిగి నీటి ప్రవాహానికి అడ్డుపడిన చెత్తను తొలగించారు. (పిండికొద్దీ ప్లేటు) ఈ సందర్బంగా కార్పొరేటర్ మనోహర్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ.. ‘మ్యాన్‌హోల్‌లో ఏదో అడ్డుపడి నీరు బయటకు పొంగిపొర్లుతుంది. పారిశుద్ధ్య కార్మికులను శుభ్రం చేయమని అడిగితే.. ప్రస్తుత పరిస్థితుల్లో దిగలేమని చెప్పారు. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక లాభం లేదనుకుని.. నేనే మ్యాన్హోల్లోకి ప్రవేశించి.. పైపుకు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించాను. ఇది చూసి బీజేపీ పార్టీ కార్యకర్తలు నలుగురు నన్ను అనుసరించారు. ఆ మ్యాన్‌హోల్ ఎనిమిది అడుగుల లోతులో ఉంది.లోపలంతా చీకటిగా ఉంది. టార్చ్ లైట్లు వేసుకుని శుభ్రం చేశాము’ అని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. మరో సారి మ్యాన్హోల్లోకి దిగడానికి కూడా తాను వెనకాడనని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరలవ్వడమే కాక.. మనోహర్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. (నిప్పుల గుండంలో యోగా చేసిన ఎంపీ) -
ముందుంది మునక!
సాక్షి, సిటీబ్యూరో: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహానగరంలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాలు, నాలాలు, చెరువులు, కుంటలనుఆనుకొని ఉన్న కాలనీలు, బస్తీల మునక తప్పదనే ప్రమాదకర సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. ఈసారి జూన్–సెప్టెంబర్ (నైరుతి రుతుపవనాలు) మధ్యకాలంలో నగరంలో సాధారణం కంటే 2 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్– సెప్టెంబర్ మధ్యకాలంలో నగరంలో 755 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఈసారి 770 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు చెబుతోంది. మొత్తంగా నాలుగు నెలల్లో సుమారు 80 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బుధవారం నగరంలో కురిసిన జడివానతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై వరదనీరు, మురుగు సుడులు తిరిగింది. భారీ వర్షం కురిసిన సందర్భాల్లో నదీం కాలనీ, భండారీ లేఅవుట్, బతుకమ్మకుంట.. ఇలా గ్రేటర్ పరిధిలో సుమారు వందకుపైగా కాలనీలు, బస్తీలకు ముంపు ప్రమాదం పొంచి ఉంటుంది. దశాబ్దాలుగా నాలాలు విస్తరణకు నోచుకోకపోవడం, ఆక్రమణలు, చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధిలో వేలాదిగా కాలనీలు, బస్తీలు వెలియడం, మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ కాగితాలకే పరిమితం కావడంతో ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పరిస్థితి తప్పదా? ఈ ఏడాది కొన్నిసార్లు 10– 20 సెంటీమీటర్ల మేర భారీ, అతిభారీ వర్షాలు ఒకటి రెండు రోజులపాటు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీల వాసులకు కంటిమీద కునుకు కరువయ్యే దుస్థితి ఎదురుకానుంది. ఏళ్లుగా కిర్లోస్కర్ కమిటీ సిఫారసులు అమలు కాకపోవడం, నగరంలో సుమారు 1500 కి.మీ మార్గంలో విస్తరించిన నాలాలు విస్తరణకు నోచుకోకపోవడం, వీటిపై వెలసిన సుమారు పదివేల అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడంతో.. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ ప్రధాన రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారుతున్నాయి. సంసిద్ధత ఇలా... ఈ సీజన్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగినపుడు తీసుకోవాల్సిన చర్యలపై బల్దియా యంత్రాంగం రూ.25 కోట్ల అంచనా వ్యయంతో సుమారు వంద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాన్సూన్ యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. భారీ వర్షం కురిసే అవకాశాలున్న ప్రాంతాల ప్రజలను, అధికార యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడంతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను ఆయా ప్రాంతాల్లో మోహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రత్యేక బృందాలకు అవసరమైన వాహనాలు, యంత్ర పరికరాలను సమకూర్చింది. వానాకాలంలోనే హడావుడి.. గంటకు సెంటీమీటరు చొప్పున సుమారు 24 గంటలపాటు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే నగరం మునక తప్పదు. గతంలో భండారీ లేఅవుట్, రామంతాపూర్, నదీం కాలనీ తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న అనుభవాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వర్షాకాలంలోనే హడావుడి చేస్తున్న యంత్రాంగం వరద పరిస్థితికి శాశ్వత పరిష్కార చర్యలను తీసుకోవడంలో విఫలమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు వీలుగా పెద్ద విస్తీర్ణంలో.. అధిక సంఖ్యలో ఇంకుడు కొలనులను ఏర్పాటు చేయడం, నాలాలను విస్తరించడం, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలసిన నిర్మాణాలను తొలగించడం వంటి చర్యలు చేపడితేనే ఈ పరిస్థితికి శాశ్వతంగా చరమగీతం పాడే అవకాశాలుంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈసారి 102 శాతం వర్షపాతం.. ఈసారి సాధారణం కంటే 2 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. అంటే సాధారణ వర్షపాతం 100 శాతం అనుకుంటే.. ఈసారి 102 శాతం వర్షపాతం నమోదవుతుంది. జూన్– సెప్టెంబర్ మధ్యలో 80 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. ఆయా రోజుల్లో ఒకటి రెండుసార్లు భారీ, అతిభారీ వానలు పడతాయి. ఎల్‌నినో, లానినో ప్రభావాలు అంతగా లేకపోవడంతో నైరుతి సీజన్లో వర్షాలకు ఢోకాలేదు. – రాజారావు, వాతావరణ శాఖ శాస్త్రవేత్త, బేగంపేట్ -
మ్యాన్‌హోల్‌లో మద్యం నిల్వ
విశాఖ సిటీ: మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వ్యాపారులు విచిత్ర విన్యాసాలతో ఎక్సైజ్ అధికారులకు చుక్కలు చూపుతున్నారు. గాజువాక ఎక్సైజ్ సర్కిల్ పెందుర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదురవాడలో ఓ వ్యక్తి ఎక్సైజ్ సిబ్బందిని ముచ్చెమటలు పట్టించాడు. మ్యాన్‌హోల్‌లో మద్యం నిల్వ చేసి ఎంచక్కా విక్రయిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... స్థానిక వాంబే కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లోనే మద్యం బెల్ట్ దుకాణం నడుపుతున్నాడు. దీనిపై స్థానిక వలంటీర్ షేక్ సుధా, మహిళా రక్షణ కార్యదర్శి కన్యాకుమారి సమాచారం మేరకు మంగళవారం గాజువాక ఎౖMð్సజ్ సహాయ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ ఆదేశాల మేరకు పెందుర్తి ఎక్సైజ్ ఎస్ఐ జి.బాబూరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. అయితే ఎంత వెతికినా ఆ ఇంట్లో మద్యం దొరకలేదు. దీంతో ఎక్సైజ్ అధికారులు గట్టిగా ప్రశ్నించే సరికి కాలనీ వీధిలోని మ్యాన్‌హోల్‌లో మద్యం నిల్వ చేసినట్లు చెప్పాడు. అక్కడకు వెళ్లి పరిశీలించగా ఒక ట్రేలో 26 మద్యం సీసాలు లభించాయి. దీంతో మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడును అరెస్ట్ చేశారు. 5 ఫుల్ బాటిళ్లు స్వాధీనం సీతమ్మధార (విశాఖ ఉత్తర): ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మాధవధార చివరి బస్టాప్ సమీపంలో కె.నాగార్జున అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో టాస్క్ఫోర్సు ఏసీపీ త్రినాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐదు ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు. -
అయ్యో..పాపం
చిత్తూరు, తిరుపతి తుడా : తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ప్రాంగణంలోని మ్యాన్‌హోల్‌లో బుధవారం నవజాత శిశువు మృతదేహం కలకలం రేపింది. వివరాలు..ఆస్పత్రిలోని మరుగుదొడ్ల నీళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ఎక్కడైనా బ్లాక్ అయ్యింటుందని భావించిన పారిశుధ్య కార్మికులు బుధవారం ఉదయం మ్యాన్‌హోల్స్‌పై దృష్టి సారించారు. ఒక్కొటొక్కటే శుభ్రం చేస్తూ ఆస్పత్రి వెలుపల ఓ మ్యాన్‌హోల్‌లో శుభ్రం చేసేందుకు పూనుకున్నారు. ఇంతలో అక్కడ శిశువు మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది మ్యాన్‌హోల్‌లోని శిశువు మృతదేహాన్ని వెలికి తీశారు. సమాచారం చేరవేయడంతో అధికారులు అలిపిరి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అనుమానిత వ్యక్తులెవరైనా మ్యాన్‌హోల్‌లో బిడ్డను పడేశారా? లేదా మృతి చెందిన శిశువును ఇంటికి తీసుకెళ్లలేక మ్యాన్‌హోల్‌లో పడేశారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మంగళవారం ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవ సమయంలో ముగ్గురు శిశువులు మృతి చెందినట్లు అధికారులు ఆధారాలు వెలికితీశారు. ఇందులో ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఓ ఆడశిశువును ఇంటికి తీసుకెళ్లకుండా మంగళవారం రాత్రి మ్యాన్‌హోల్‌లో వేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు విచారణలో నిజానిజాలు తేలాల్సింది. మొత్తానికి ఇది చర్చకు దారితీసింది. -
వర్షాకాలంలోగా మిగతావి పూర్తయ్యేనా?
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రహదారులకు ఎక్కువ/తక్కువ ఎత్తులో ఉన్న క్యాచ్పిట్లు, మ్యాన్‌హోళ్లతో తరచూ ప్రమదాలు జరుగుతున్నాయి. ఈ సంఘటనల్లో ఎంతోమంది గాయపడుతున్నా రు. మరికొంత మంది మరణించిన ఘటనలూ ఉన్నాయి. దీన్ని నివారించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 9,000 కి.మీ రహదారులకు గాను 2,000 కి.మీ పరిధిలోని ప్రధాన మార్గాల్లో క్యాచ్పిట్లు, మ్యాన్‌హోళ్ల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ దానకిశోర్ భావించారు. రహదారులకు సమాంతరంగా ఉండేలా సరిదిద్దాలని ఫిబ్రవరిలో సంబంధిత అధికారులను ఆదేశించారు. దాదాపు రూ.8.31 కోట్లతో 50 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. మే లోపు మరమ్మతులన్నీ పూర్తి చేయాలని, వర్షాకాలం వచ్చేలోగా రహదారులపై క్యాచ్పిట్ల సమస్యలతో పాటు నీరు నిలిచే ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్ సూచించారు. కానీ ఇప్పటివరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. కేవలం 32 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ నెలాఖరులోగా మిగతా 69 శాతం పనులు పూర్తికానిపక్షంలో వర్షాకాలంలో మరిన్ని ఇబ్బందులు తలెత్తనున్నాయి. అయితే పనులు నత్తనడకన సాగేందుకు పలు కారణాలున్నాయి. లోక్‌సభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పనులను పర్యవేక్షించే అధికారులంతా విధుల్లో పాలుపంచుకోవడం ఒక కారణమైతే, పనులు చేపట్టే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తదితర మరో కారణం. ఇప్పటికైనా అధికారులు పనుల్లో వేగం పెంచి వర్షాకాలం లోగా మరమ్మతులు పూర్తి చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. -
ఎరక్కపోయి ఇరుక్కుని!
అనగనగా ఒక ఎలుక. ఎలుకంటే ఎలుకలా ఉండదు. బాగా బలిసిన పందికొక్కులా కనిపిస్తుంది. చలికాలం వస్తే చాలు ఇలాంటి జంతువులన్నీ కొవ్వెక్కి బాగా లావెక్కిపోతాయి. జర్మనీలోని బెన్షీమ్ పట్టణం దాని నివాసం. ఓ రోజు బాగా తిన్న ఆ ఎలుక కాసేపు వాకింగ్‌కు బయల్దేరింది. రోడ్డు మీద ఉన్న మ్యాన్ హోల్ పైకప్పు కన్నంలో ఎరక్కపోయి ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా పైకి రాలేక.. మ్యాన్హోల్లోకి దిగలేక అవస్థలు పడింది. ఎటూ కదల్లేక అరవసాగింది. అదే సమయంలో అటు వైపు నుంచి వెళ్తున్న స్థానికుడైన నాట్, అతని భార్య జూలియానాలు.. ఆ ఎలుక పడుతున్న అవస్థలు చూసి ఆగారు.. ఆ ఎలుకను నెమ్మదిగా పైకి లాగడానికి జూలియానా ప్రయత్నించింది. అసలే ఇరుక్కుపోయిన బాధలో ఉన్న ఆ ఎలుక గట్టిగా అరుస్తూ ఆమె చేతికున్న లెదర్ గ్లౌజులను కొరికేసిందట. ఇక లాభం లేదనుకుని ఎలుకల్ని పట్టే నిపుణులకు వాళ్లు ఫోన్ చేశారు. అగ్నిమాపక దళ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఆ ఎలుకను రక్షించేందుకు ఏకంగా 9 మంది అధికారులు వచ్చారు. జంతువుల్ని కాపాడే నిపుణుడు షేర్ కూడా వారికి సాయం చేశారు. తమ దగ్గరున్న పరికరాల సాయంతో ఎలుకను గట్టిగా కిందకి నెట్టారు. ఆ మూత నుంచి బయటపడిన ఎలుక.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. మమూలుగా అయితే ఇలాంటి రక్షణ చర్యలకు అగ్నిమాపక సిబ్బంది 120 జర్మనీ యూరోల డబ్బు వసూలు చేస్తారు. కానీ ఆ ఎలుక ఎవరికీ చెందదు కాబట్టి జంతు ప్రేమతోనే ఉచితంగానే కాపాడారు. నాట్ ఇద్దరు కుమార్తెలు మ్యాన్‌హోల్‌ను తవ్వి ఈ ఎలుకను పట్టే ప్రక్రియ అంతా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి అవి వైరల్‌గా మారాయి. -
సాఫీగా.. సేఫ్‌గా..
సాక్షి, సిటీబ్యూరో: ఎగుడుదిగుడు మ్యాన్‌హోళ్లను సరిచేసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి నడుం బిగించాయి. ప్రమాదాలకు కారణమవుతున్న వీటిని రహదారులకు సమాంతరంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. సిటీజనులు రోడ్లపై సాఫీగా, సేఫ్‌గా వెళ్లేందుకు చర్యలు తీసుకోనున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులపైనున్న మ్యాన్‌హోళ్లను అంతర్జాతీయ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాల మేరకు నిర్మించాలని, ఇందుకు ఒక్కో విభాగం రూ.10 కోట్ల చొప్పున వెచ్చించాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. మరో 15 రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మ్యాన్‘హెల్స్’... కోటి జనాభా దాటిన మహానగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. దీని పరిధిలో సుమారు 9వేల కిలోమీటర్ల మార్గంలో రహదారులు ఉన్నాయి. వీటి కింద దాదాపు10వేల కిలోమీటర్ల మార్గంలో మంచినీరు, మురుగు, వరదనీటి పైప్లైన్లు, కాల్వలున్నాయి. ఈ రహదారులపై సరాసరి ప్రతి 30మీటర్లకు ఒకటి చొప్పున బల్దియా, జలమండలి విభాగాలకు చెందిన సుమారు 2.85లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా రెండు వేల కిలోమీటర్ల మార్గంలో ప్రధాన రహదారులపైనున్న మ్యాన్‌హోళ్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. కొన్ని చోట్ల రహదారి స్థాయి కంటే ఎత్తయిన మ్యాన్‌హోళ్లు ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతేడాది గ్రేటర్ పరిధిలో ఇలాంటి అపసవ్య, అస్తవ్యస్త మ్యాన్‌హోల్స్ కారణంగా వందకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు ట్రాఫిక్ విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా సంఘటనల్లో 150 మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. ప్రధాన నగరం, శివార్లు అన్న తేడా లేకుండా ఇదే దుస్థితి నెలకొంది. ప్రధానంగా ఖైరతాబాద్, నాంపల్లి, బంజారాహిల్స్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మలక్‌పేట్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఎగుడుదిగుడు మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బల్దియా, జలమండలి విభాగాలు సంయుక్తంగా మ్యాన్‌హోళ్లను ఆయా ప్రాంతాల్లోని రహదారులకు సమాంతరంగా తక్షణం పునరుద్ధరించడం, అపసవ్యంగా ఉన్న వాటిని సరిచేయడం, మిస్సింగ్ మ్యాన్‌హోళ్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అత్యంత లోతుగా ఉన్న వాటికి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం తదితర చర్యలు చేపట్టనున్నాయి. ఇవీ అనర్థాలు.. ♦ ప్రధాన రహదారులపై ఎగుడుదిగుడు మ్యాన్‌హోళ్లతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ♦ అపసవ్య మ్యాన్‌హోళ్లతో ఆయా రహదారులపై ప్రయాణించినప్పుడు కుదుపులకు వాహనదారుల వెన్నెముక దెబ్బతింటోంది. ♦ డ్రైనేజీ ఉప్పొంగినప్పుడు, వరద ప్రవాహం వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లోని రహదారులను ముంచెత్తుతున్నాయి. ♦ తరచూ మ్యాన్‌హోళ్ల మూతలు మిస్సవుతుండడంతో స్థానికులు భయంభయంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. సేఫ్ జర్నీ సాకారానికి... నగరంలోని ప్రధాన రహదారులపై సేఫ్ జర్నీని సాకారం చేసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తక్షణమే మ్యాన్‌హోళ్లను సరిచేయనున్నాం. దాదాపు 2వేల కిలోమీటర్ల మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, సాఫీ ప్రయాణానికి అంతర్జాతీయ రోడ్ కాంగ్రెస్ నిబంధనల మేరకు ఈ పనులు చేపట్టనున్నాం. ఇందుకయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు రూ.10 కోట్ల చొప్పున వ్యయం చేయనున్నాయి. – ఎం.దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ -
మ్యాన్‌హోల్ మూత లేదా?
సాక్షి,సిటీబ్యూరో:‘ మీ వీధిలో కానీ, మీరు నడిచే మార్గాల్లోని రోడ్లపై కానీ మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌లకు మూతలు లేకుండా కనిపిస్తే వెంటనే వాటిని ఫొటో తీయండి. సెల్ నెంబర్ 88974 77250 కు వాట్సప్ చేయండి. 5 గంటల్లో కొత్త మూత వేస్తాం. అంతేకాదు, మ్యాన్‌హోళ్లు, క్యాచ్పిట్ల మూతలు ధ్వంసమైన ఫొటోలను కూడా ఇదే నెంబర్‌కు వాట్సప్ చేయండి. 24 గంటల్లోగా బాగుచేసి వేస్తాం’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్పిట్ల పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ఆయన...అందులో భాగంగా పై ప్రకటన చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2,96,329 సీవరేజ్ మ్యాన్‌హోళ్లు, 1,22,461 క్యాచ్పిట్లు ఉన్నాయి. వీటిల్లో చాలావాటికి మూతల్లేవని, పాడయ్యాయని తరచూ ఫిర్యాదులందుతున్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం బుధవారం నిర్వహణ విభాగం ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘నో ఓపెన్ మ్యాన్‌హోల్’ పాలసీని అమలు చేయాలని నిర్ణయించారు. అందే ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత వ్యవధిలోగా సమస్యను పరిష్కరించాలని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశారు. గరిష్టంగా వారం రోజుల్లో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి వాట్సప్ ద్వారా అందే ఫిర్యాదులకు ప్రత్యేకంగా టోకెన్ నెంబర్‌ను కేటాయించి, సంబంధిత అధికారికి తగు చర్యల నిమిత్తం పంపించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. చేపట్టిన చర్యలకు సంబంధించిన ఫిర్యాదు దారుకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించడంతో పాటు జీహెచ్ఎంసీ వెబ్సైట్ https://www.ghmc.gov.in లోకూడా వివరాలు ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు ప్రజలు చేయాల్సింది.. ♦ మ్యాన్హోల్ఫొటో లేదా వీడియో తీయడం ♦ ఎక్కడున్నదీ లొకేషన్‌ను తెలపడం ♦ సమీపంలోని ప్రముఖ ప్రాంతం లేదా ఇంటి నెంబర్ వేయడం ♦ 88974 77250 నెంబర్‌కు వాట్సప్ చేయడం.. -
మ్యాన్ హోల్లోకి దిగి ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
-
ఉప్పల్ స్టేడియం వద్ద విషాదం
సాక్షి, హైదరాబాద్: భావి విశ్వనగరం.. భాగ్యనగరం మరో ఇద్దరు పారిశుధ్య కార్మికులను పొట్టనపెట్టుకుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియం గేట్ నంబర్ 1 వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. మ్యాన్ హోల్ లోపలికి దిగిన కార్మికులు ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మ్యాన్‌హోల్ నుంచి మృతదేహాలను బయటికి తీశారు. మృతులు సంతోష్(28), విజయ్(25)లు హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి స్వస్థలం ఒడిశా అని పోలీసులు తెలిపారు. జలమండలి వాటర్ పైప్ లైన్ నిర్మాణం నిమిత్తం సెంట్రింగ్ కర్రలు తొలగించే క్రమంలో దిగిన కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తప్పు ఎవరిది?: రెండేళ్ల కిందట హైటెక్ సిటీ సమీపంలో మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికులు మృతి చెందడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పెద్ద ఎత్తున మినీ ఎయిర్‌టెక్ మిషన్లను అందుబాటులోకి తెచ్చిన సందర్భంలో ‘‘ఇక నుంచి కార్మికులు మ్యాన్ హోల్స్‌లో దిగే పరిస్థితి ఉండదు’’ అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, బుధవారం ఉప్పల్ స్టేడియం వద్ద చోటుచేసుకున్న ఘటనలో తప్పు జలమండలిదా, ఎల్ అండ్ టీ సంస్థదా అన్నది తేలాల్సిఉంది. తోటి కార్మికుల మరణవార్త ఆ సంస్థలో పనిచేస్తోన్న మిగతావారిని కలవరపాటుకు గురిచేసంది. -
మ్యాన్‌హోల్‌లో పడి ముగ్గురు కార్మికులు మృతి
-
ఇక కను‘మరుగు’
►జలమండలి ప్రీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ రెడీ ►రూ.3.03 కోట్లతో మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళన రూ.13 కోట్లతో 170 ►‘హాట్‌స్పాట్స్’కు మరమ్మతులు జూన్ తొలివారం లోగా పనుల పూర్తి సిటీబ్యూరో: గ్రేటర్లో చినుకుపడితే చాలు.. ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు..మురుగు, వరద నీరు సుడులు తిరుగుతూ రహదారులు చెరువులను తలపిస్తాయి. వాహనదారులకు నరకం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వర్షాకాలం అవస్థలను తొలగించేందుకు జలమండలి ‘ప్రీ మాన్సూన్ యాక్షన్‌ప్లాన్’ (వర్షాకాల ముందస్తు ప్రణాళిక)కు శ్రీకారం చుట్టింది. జూన్ తొలివారంలోగా మురుగునీటి పైపులైన్లు, మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన పూడిక తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన వాటి ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది. ఇరుకైన కాలనీలు, బస్తీల్లో ఈ ప్రక్షాళన పనులు చేపట్టేందుకు 37 మినీ ఎయిర్‌టెక్ యంత్రాలను రంగంలోకి దించనుంది. గ్రేటర్లో సుమారు ఐదువేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మురుగునీటి పారుదల వ్యవస్థలో.. సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు తరచూ మురుగు నీరు ఉప్పొంగి సమీపబస్తీలు, కాలనీలు, రహదారులను ముంచెత్తే పరిస్థితులున్నాయి. వీటికి తక్షణం ప్రక్షాళన చేపట్టనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఇందుకవసరమైన రూ.16 కోట్ల నిధులను సైతం కేటాయించామని పేర్కొన్నాయి. ముందస్తు ప్రణాళిక అమలు ఇలా.. మహానగరంలో జలమండలికి 5 వేల కిలోమీటర్ల పరిధిలో విభిన్న పరిమాణం గల మురుగునీటి పైపులైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై ప్రతి 30 మీటర్లకు ఒకటిచొప్పున 1.85 లక్షల మ్యాన్‌హోళ్లున్నాయి. వీటిలో ప్రధానంగా వెయ్యి కిలోమీటర్ల పైపులైన్లు, మరో 50 వేల వరకు మ్యాన్‌హోళ్లలో ప్రస్తుతం చెత్తా, చెదారం, కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్ కవర్లు వంటి వ్యర్థాల చేరికతో మురుగునీరు సాఫీగా వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ప్రీమాన్సూన్ యాక్షన్‌ప్లాన్‌ను జలమండలి అమలుచేయనుంది. మరోవైపు మెస్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఫంక్షన్‌హాళ్లు, డెయిరీ ఫారాలు, సినిమాహాళ్ల నుంచి వెలువడుతోన్న మురుగునీటిలో ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అధిక మొత్తంలో వెలువడుతోన్న నేపథ్యంలో ఆయా వాణిజ్య భవనాల ముందు విధిగా సిల్ట్ఛాంబర్లు(ఘనవ్యర్థాలను నిలువరించేవి)నిర్మించుకునేలా క్షేత్రస్థాయి మేనేజర్లు, డీజీఎంలు చర్యలు తీసుకోవాలని ఎండీ దానకిశోర్ ఆదేశాలిచ్చారు. ఏ పనులకు ఎంత వ్యయం అంటే.. ► గ్రేటర్ పరిధిలో తరచూ మురుగునీరు ఉప్పొంగే 170 హాట్‌స్పాట్స్ వద్ద రూ.13 కోట్లతో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ► అసాధారణ స్థాయిలో మురుగు ఉప్పొంగే ప్రభావిత ప్రాంతాల్లో రూ.88 లక్షల అంచనా వ్యయంతో పైపులైన్లు, మ్యాన్‌హోళ్లను సమూలంగా ప్రక్షాళన చేస్తారు. ► ఇతర ప్రాంతాల్లో సుమారు రూ.22 లక్షలతో 37 మినీ ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోళ్లు, మురుగునీటి పైపులైన్లను శుద్ధి చేయనుంది. ►చిన్నపాటి వర్షం కురిస్తే చాలు వరద, మురుగునీరు ఉప్పొంగి బస్తీలు, కాలనీలను ముంచెత్తే ప్రాంతాల్లో రూ.2.03 కోట్లతో అత్యవసర బృందాలను రంగంలోకి దించి వారి ఆధ్వర్యంలో ప్రక్షాళన, నష్టనివారణ చర్యలను చేపట్టనుంది. సమస్యలకు తక్షణ పరిష్కారం ప్రీ మాన్సూన్ యాక్షన్‌ప్లాన్‌లో ప్రధానంగా ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు, మురుగునీటి పైపులైన్లలో తక్షణం ప్రక్షాళన పనులు చేపట్టాలని నిర్ణయించాం. తరచూ సమస్యలు తలెత్తే ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ, ప్రక్షాళన పనులు చేపడతాం. వినియోగదారుల నుంచి జలమండలి టోల్‌ఫ్రీ నెంబరు 155313తోపాటు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం ప్రతి సెక్షన్ పరిధిలో సిల్ట్ ఛాంబర్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధచూపాలని అధికారులను ఆదేశించాం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
ఇద్దరిని మింగిన మ్యాన్‌హోల్
విజయవాడ: విజయవాడ నగరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఇద్దరు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భవానిపురం హౌసింగ్ బోర్డు కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మ్యాన్ హోల్ పూడిక తీసేందుకు బుధవారం ఇద్దరు కార్మికులు దిగారు. పూడిక తీసే సమయంలో ఊపిరాడక వారు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముగ్గురిని మింగేసిన మ్యాన్‌హోల్
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు మ్యాన్హోల్లోకి దిగి ప్రమాదవశాత్తూ మరణించారు. మృతులు ముగ్గురూ ఏపీకి చెందిన వలస కార్మికులు కావటం గమనార్హం. సోమవారం రాత్రి కృష్ణరాజపురం పరిధిలోని కగ్గదాసపురంలో ఈ ఘటన జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం కార్మికులైన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రామచంద్రాపురానికి చెందిన ఆంజనేయరెడ్డి (34), శ్రీకాకుళ జిల్లా చెంగేడిపేట మండలం కలవలుస గ్రామానికి చెందిన యర్రయ్య(35), శ్రీకాకుళానికి చెందిన దవితానాయుడు అలియాస్ డీబీ నాయుడు(40) పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వచ్చారు. వీరిలో ఆంజనేయరెడ్డి సైట్ ఇంజినీర్‌గా, మిగతా ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కగ్గదాసపురలో మ్యాన్‌హోల్‌లో మురుగు ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ఆంజనేయరెడ్డి, యర్రయ్య, దవితా నాయుడు మ్యాన్‌హోల్ వద్దకు చేరుకున్నారు. ఎలాంటి రక్షణ కవచాలు లేకుండానే యర్రయ్య, దవితా నాయుడు 15 అడుగుల లోతున్న మ్యాన్హోల్లోకి దిగి మరమ్మతు ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత ఆక్సిజన్ అందక గట్టిగా కేకలు వేశారు. దీంతో పైన ఉన్న ఆంజినేయరెడ్డి తాడు సాయంతో లోపలికి దిగాడు. ఈ క్రమంలోనే ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కాంట్రాక్టర్లు, జలమండలి అధికారులు సరైన జాగ్రత్త చర్యలను పాటించకకుండా నిర్లక్ష్యం వహించడంతోనే కార్మికులు తనవు చాలించారని స్థానికులు ఆరోపించారు. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కె.జె.జార్జ్, పాలికె మేయర్ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతదేహాలను బోరింగ్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బయపనహళ్లి పోలీసులు తెలిపారు. -
అడుగులోతు నీళ్లలో బైకుపై వెళుతూ..!
హైదరాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లపై అడుగులోతు నీళ్లు చేరడంతో ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ మ్యాన్‌హోల్ తెరుచుకొని ఉందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో బైకుపై వెళుతున్న ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపై అడుగులోతు నీళ్లలో నిదానంగా బైకు మీద వెళుతున్న అతను.. బైక్‌తో సహా తెరుచుకున్న మ్యాన్హోల్లోకి పడిపోయాడు. అదృష్టం బావుండి అక్కడ స్థానికులు అప్రమత్తంగా ఉండటంతో ఆ యువకుడిని వారు కాపాడారు. చిన్న గాయాలతో అతను బయటపడ్డాడు. అతని బైకు మాత్రం నాలాలోకి కొట్టుకుపోయింది. నిజాంపేటలోని శ్రీనివాసనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. వర్షాలు తగ్గకపోవడంతో రోడ్ల మీద ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. అడుగులోతు నీళ్లు.. అడుగడుగునా గుంతలు.. తెరచుకున్న మ్యాన్‌హోళ్లు.. వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు తగ్గేవరకు చాలా అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని నీళ్లు చేరిన రోడ్డుపై వేగంగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
అడుగులోతు నీళ్లలో బైకుపై వెళుతూ..!
-
ప్రాణాలు పోయినా మారరా?
ఖైరతాబాద్: ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలవుతున్నాయి. నిబంధనలు మురుగులో కొట్టుకుపోతున్నాయి. కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ఇటీవల నగరంలో మ్యాన్‌హోల్‌లో దిగి... కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటన నేపథ్యంలో 15 అడుగుల లోతు ఉన్న మ్యాన్‌హోల్స్‌ను యంత్రంతోనే శుభ్రం చేయాలని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. అధికారులూ ఆచరిస్తున్నట్టు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. మంగళవారం ఖైరతాబాద్ డివిజన్లో కాంట్రాక్టర్ మరోసారి మ్యాన్‌హోల్‌ను సిబ్బందితో శుభ్రం చేయించారు. యంత్రం మాట పక్కన పెట్టేశారు. -
కార్మికులకు కన్నీటి వీడ్కోలు
ఉస్మానియా యూనివర్సిటీ: అయ్యప్ప సొసై టీ ప్రాంతంలో మ్యాన్‌హోల్‌లో పడి ఈ నెల 13న మృతి చెందిన మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన కార్మికులు సత్యనారాయణ, శ్రీనివాస్, నాగేష్ మృతదేహాలకు సోమవా రం అంత్యక్రియలు జరిగాయి. అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బస్తీవాసులు కన్నీరు మున్నీరు గా విలపించారు. అంత్యక్రియలకు హోమంత్రి నాయిని నర్సింహరెడ్డి, స్థానిక కార్పోరేటర్ సరస్వతి హాజరయ్యారు. -
నలుగుర్ని మింగిన మ్యాన్‌హోల్
-
నలుగుర్ని మింగిన మ్యాన్‌హోల్
► డ్రైనేజీ పనులు చేస్తూ ముగ్గురు, ► కాపాడబోయి మరొకరు మృతి ► జలమండలి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బలి ► మృతుల కుటుంబాలకు రూ.2.5 లక్షల చొప్పున నష్టపరిహారం సాక్షి, హైదరాబాద్: మృత్యు కుహరాల్లా మారిన మ్యాన్‌హోల్‌లు నలుగురిని మింగేశాయి. జలమండలి అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని ముగ్గురు కార్మికులతోపాటు వారిని కాపాడబోయిన మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. మాదాపూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఒకరి వెనుక ఒకరు.. జీఎస్కే-విశ్వ ఇన్ఫ్రా కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ శనివారం మాదాపూర్ ప్రాంతంలో డ్రైనేజీ పనులు చేసేందుకు మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన ఆరుగురు కార్మికులను తీసుకువచ్చాడు. ఉదయం నుంచి పలు చోట్ల డ్రైనేజీ పూడికతీశారు. సాయంత్రం పనులు ముగిసే సమయంలో అక్కడే ఉన్న ఓ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు.. అందులోకి దిగారు. తొలుత ఓ.నాగేశ్ (32), పి.సత్యనారాయణ (38) లోపలికి దిగారు. అయితే లోపలి నుంచి ఎలాంటి అలికిడి రాకపోవడంతో మేస్త్రీ పి.శ్రీనివాస్ (38) కూడా మ్యాన్హోల్లోకి వెళ్లాడు. ఆ ముగ్గురిలో ఎవరూ పైకి తిరిగి రాకపోవడంతో.. పైన ఉన్న మిగతా కార్మికులు అటువైపు వెళుతున్నవారికి విషయం చెప్పారు. వారిలో కొందరు 108కు సమాచారం ఇచ్చారు. అయితే బైక్‌పై ఆ దారిలో వెళుతున్న గంగాధర్ (35) అనే వ్యక్తి విషయం తెలుసుకుని తాడు సహాయంతో మ్యాన్హోల్లోకి దిగాడు. కానీ ఆయన కూడా పైకి రాలేదు. కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రాగా.. దాని డ్రైవర్ చంద్రశేఖరాచారి తాడు సహాయంతో లోపలికి దిగాడు. ఆయనా అందులోనే పడిపోయాడు. కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జేసీబీలతో మ్యాన్‌హోల్ పైభాగాన్ని పగలగొట్టి, మాస్కులతో లోపలికి దిగి.. అందరినీ పైకి తీశారు. అయితే అప్పటికే నాగేశ్, పి.సత్యనారాయణ, పి.శ్రీనివాస్, గంగాధర్ మరణించారు. అపస్మారక స్థితిలో ఉన్న 108 డ్రైవర్ చంద్రశేఖరాచారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విష వాయువుల కారణంగానే.. వంద అడుగుల వెడల్పు రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ దాదాపు 20 అడుగుల లోతు ఉంది. ఉదయం నుంచి డ్రైనేజీ పనులు చేస్తున్న కార్మికులు... పైపులోని పూడికను తీసేందుకు వీలుగా మురుగునీటిని అడ్డుకునేందుకు అక్కడక్కడా బస్తాలు, సిమెంట్‌తో తాత్కాలికంగా గోడ కట్టారు. మాదాపూర్ ప్రధాన రహదారి నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. చివరగా మ్యాన్‌హోల్ వద్ద పనులు చేస్తున్నారు. ఆ సమయంలో పైపులో అడ్డుగా పెట్టిన బస్తాలు, సిమెంట్ గోడను తొలగించడంతో ఒక్కసారిగా మురుగు నీరు వచ్చింది. అప్పటికే పైప్‌లైన్‌లో నిండిపోయి ఉన్న విష వాయువులన్నీ మ్యాన్హోల్లోకి చేరి.. కార్మికులు ఊపిరాడక మృతి చెందారని భావిస్తున్నారు. కాగా ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2.5 లక్షల వంతున నష్ట పరిహారం అందజేస్తామని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి నలుగురి మరణానికి కారణమైన జీఎస్కే సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు జల మండలి వర్గాలు తెలిపాయి. దుర్ఘటనపై విచారణకు జలమండలి ఈడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. పనిముగిశాక మళ్లీ రమ్మన్నారు ఉదయం పది గంటల నుంచి డ్రైనేజీ పనులు చేస్తున్నామని కార్మికులు కె.శ్రీనివాస్, యాదయ్య, రాములు చెప్పారు. సాయంత్రం 5 గంటలకు పని ముగించుకుని వెళ్తుండగా కాంట్రాక్టర్ నుంచి ఫోన్ రావడంతో.. సూపర్వైజర్ మళ్లీ మ్యాన్‌హోల్ వద్దకు తీసుకెళ్లాడని తెలిపారు. అదొక్కటీ శుభ్రం చేసి రమ్మంటూ లోపలికి పంపించాడన్నారు. ఆ మ్యాన్‌హోల్‌కి దిగకపోతే అందరూ బతికేవారని వాపోయారు. కాపాడబోయి.. ప్రమాదంలో మరణించిన గంగాధర్ స్వస్థలం కర్నూలు జిల్లా మద్దిగార మండలం పత్తికొండ గ్రామం. హైదరాబాద్‌లో అల్లాపూర్‌లోని వివేకానంద్‌నగర్‌లో నివాసం ఉంటూ.. ఓ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ దారిలో బైక్‌పై వెళుతూ ప్రమాదం విషయం తెలిసి, తాడుతో మ్యాన్హోల్లోకి దిగాడు. విష వాయువుల కారణంగా ఊపిరాడక మరణించాడు. గంగాధర్‌కు భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బ్లాక్‌లిస్టులో పెట్టాం.. అయినా ఇటీవలే మాదాపూర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో ఒక కార్మికుడు మృతిచెందడంతో అక్కడ పనులు చేపట్టిన జీఎస్కె-విశ్వ ఇన్ఫ్రా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాం. ఆ సంస్థ చేపట్టిన పనులన్నీ నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చాం. అయినా ఆ కంపెనీ క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి మిగిలిపోయిన పనులను చేపట్టినట్లు మా దృష్టికి వచ్చింది. ఇప్పడు జరిగిన దుర్ఘటనకు ఆ కంపెనీ నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నాం. నైపుణ్యం లేని కార్మికులను మ్యాన్హోల్లోకి దించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తాం. కాంట్రాక్టు సంస్థ గుర్తింపును రద్దు చేస్తాం..’’ - దానకిశోర్, హైదరాబాద్ జల మండలి ఎండీ -
యూజీడీ... ట్రాజెడీ
– ప్రమాదకరంగా మ్యాన్‌హోళ్లు – నిధుల విడుదలకు ఆసక్తి చూపని ప్రభుత్వం – పట్టించుకోని పబ్లిక్ హెల్త్ అధికారులు – అవస్థలు పడుతున్న జనం కడప కార్పొరేషన్: కడప నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా మారాయి.యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనుల్లో ఏర్పడిన లోపాలు, అసంపూర్తి నిర్మాణాల వల్ల నగర వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. యూజీడీ పథకం డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)లో పగులగొట్టిన రోడ్లను మరమ్మతులు చేసేందుకు వ్యయం కనబరచకపోవడంతో ఈ పథకం తీవ్ర విమర్శలపాలైంది. అధికారుల పర్యవేక్షణ లేక చాలా చోట్ల పైపులకు మధ్య కనెక్షన్లు లేవు. ఈ నేపథ్యంలో ప్రజలు అక్కడక్కడా యూజీడీకి ఇండ్లనుంచి కనెక్షన్లు ఇచ్చుకోవడంతో పనులు అసంపూర్తిగా ఉన్నచోట ఆ మురికినీరంతా మ్యాన్‌హోల్స్ ద్వారా ఉప్పొంగి రహదారులపైకి వస్తోంది. రూ.108 కోట్లకు పరిపాలనా అనుమతులు వచ్చినా... రూ.72 కోట్లతో యూజీడీ పనులు మొదలుపెట్టినప్పటికీ ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం మొత్తం రూ.108 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఈమేరకు ఇంకా రూ.36 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే అన్ని నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. 1,2 జోన్లలో ఎస్టీపీ, ట్రంప్మైన్స్ నిర్మాణం, 19 కీ.మీల మేర రోడ్లను పునరుద్ధరించడానికి పబ్లిక్ హెల్త్ అధికారులు రూ.29.20కోట్లతో అంచనాలు పంపారు. అలాగే 3,4జోన్లలో 9.56 కీ.మీలు ఉన్న అంతరాలు(గ్యాప్స్)ను సరిదిద్దడానికి రూ.4.80 కోట్లతో అంచనాలు రూపొందించారు. వీటికి కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ పబ్లిక్ హెల్త్ ఎస్ఈ అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. కొత్త ఏజెన్సీ వచ్చేదెప్పుడు... ఇక్కట్లు తీరేదెప్పుడు..? భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలో కడపను 4 జోన్లుగా విభజించారు. మొత్తం 312కీ.మీల మేర యూజీడీ పనులు చేయాలని నిర్ణయించగా ప్రస్తుతం 286కీ.మీలు పూర్తి అయ్యింది. ఇందులో 3,4 జోన్లలో యూజీడీ పనులు దాదాపు పూర్తి అయి 16 ఎకరాలలో మురుగునీటి శుద్ది కేంద్రం (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)కూడా పూర్తయ్యింది. 1,2 జోన్లలో పనులు జరిగినా అక్కడ ఎస్టీపీకి స్థల సేకరణ సమస్య రావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బుగ్గవంక చివర గూడూరు గ్రామపొలంలో 2.47ఎకరాలలో ఎస్టీపీ నిర్మాణానికి స్థలసేకరణ పూర్తయింది. ఈ ఫైల్ ఆర్డీఓ వద్ద ఈ పెండింగులో ఉన్నట్లు తెలిసింది. యూజీడీ పనులు నిర్వహించి ఐదేళ్లు పూర్తి కావడంతో పనులు చేసిన సంస్థను పబ్లిక్ హెల్త్ అధికారులు టెర్మినేట్ చేశారు. ప్రస్తుతం పనుల నిర్వహణకు పబ్లిక్ హెల్త్ అధికారుల వద్ద ఏ ఏజెన్సీ లేదు. మ్యాన్‌హోళ్లపై వేయడానికి మూతలుగానీ, వేయడానికి సిబ్బందిగానీ వారి వద్ద లేనట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పబ్లిక్ హెల్త్ అధికారులు పంపిన అంచానాలకు అనుమతులు వచ్చి కొత్త ఏజెన్సీని నియమిస్తే తప్పా నగరవాసులకు ఈ అవస్థలు తప్పేట్లు కనిపించడం లేదు. – కడపలో నాలుగు జోన్లు కలిపి 11,450 మ్యాన్‌హోళ్లు, 13,350 ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించాల్సి ఉండగా 10,195 మ్యాన్‌హోళ్లు, 12,495 ఇన్స్పెక్షన్ ఛాంబర్లు పూర్తి అయ్యాయి. కాగా సిమెంటు మూతలు నాణ్యత సరిగా లేక 40 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. మరికొన్నింటిపై మూతలే లేకపోవడంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆర్టీసీరీజనల్ మేనేజర్ కార్యాలయం సమీపంలో మ్యాన్‌హోళ్లు దెబ్బతిని ఏడాదిపైనే అయ్యింది. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం తటాకాన్ని తలపించే రీతిలో ఉంటుంది. వాననీటిని బయటికి పంపేందుకు ఇక్కడి మ్యాన్‌హోళ్లను తెరవడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో మ్యాన్‌హోల్ తెరిచి ఉందనే విషయం తెలియక వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. – ఎన్జీఓ కాలనీలోని రత్న సభాపతి వీధిలో ఇటీవల సిమెంటు రోడ్డు నిర్మించారు. కానీ యూజీడీ ఇన్స్పెక్షన్ ఛాంబర్లను మాత్రం అలాగే వదిలేయడంతో అవి ప్రమాదకరంగా ఉన్నాయి. ఓంశాంతినగర్‌లో ఇటీవల నగరపాలక అధికారులు వేసిన పైపులు నెలరోజులైనా కాకమునుపే పగిలిపోయి బొరియలు ఏర్పడ్డాయి. ఇక్కడ పలు మ్యాన్హోళ్లనుంచి మురికినీరు ఉబికి వస్తోంది. నగర శివార్లలోని ఆర్టీసీ కాలనీ వెనుక ఉన్న బహుజన నగర్లో ఇదే పరిస్థితి. రెండు నెలల్లో పూర్తి చేస్తాం : పబ్లిక్ హెల్త్ ఈఈ భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి తాము పంపిన ప్రతిపాదనలకు ఎస్ఈ అభ్యంతరాలు లేవనెత్తగా వాటిని నివృత్తి చేశామని పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివనాగేంద్ర తెలిపారు. అనుమతులు రాగానే పనులు మొదలుపెట్టి అన్ని గ్యాప్స్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇందుకు రెండు నెలలు సమయం పట్టవచ్చని తెలపారు. -
కూలీల మృతిపై పూర్తి వివరాలు మా ముందుంచండి
* మీరు స్పందించకపోతుండటం వల్లే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు * చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందిందా.. లేదాని ప్రశ్న * కౌంటర్ల దాఖలుకు జీహెచ్ఎంసీ, సీవరేజీ బోర్డులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మ్యాన్‌హోల్‌లో దిగి ఊపిరాడక ఇద్దరు వలస కూలీలు మృతిచెందిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), సీవరేజీ బోర్డు అధికారులను ఆదేశించింది. డ్రైనేజీ శుభ్రత విషయంలో మీరు సక్రమంగా స్పందించకపోతుండటం వల్లే ప్రజలు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందని ఈ రెండు సంస్థల అధికారులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. చనిపోయిన కార్మికులకు పరిహారం అందిందో లేదో తెలియచేయాలని, అసలు డ్రైనేజీల శుభ్రత విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయో స్పష్టం చేయాలని సూచించింది. డ్రైనేజీలను శుభ్రపరచాలంటూ ప్రజల నుంచి ఎన్ని అభ్యర్థనలు వచ్చాయి.. వాటిలో ఎన్నింటిని పరిష్కరించారు.. తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తాన్‌బజార్‌లోని కపాడియాలేన్లో డ్రైనేజీని శుభ్రపరిచేందుకు దిగిన కార్మికులు వీరాస్వామి, కోటయ్య ఈ నెల 1న విషవాయువుల వల్ల మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యాన్ని గురువారం విచారించింది. ఈ సందర్భంగా సీవరేజీ బోర్డు తరఫు న్యాయవాది టి.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏ మ్యాన్‌హోల్‌లో అయితే వీరాస్వామి, కోటయ్య దిగి మృతిచెందారో దానిని శుభ్రపరచాలని తమకు ఎటువంటి అభ్యర్థనలు రాలేదని, ఆ ప్రాంతవాసులు ప్రైవేటు వ్యక్తులను డ్రైనేజీ శుభ్రత కోసం వినియోగించుకున్నారని వివరించారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం విడుదల చేశామని తెలిపారు. అయితే ఈ వాదన పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిహారం బాధిత కుటుంబాలకు అందిందో లేదో చెప్పాలని ఆదేశించింది. డ్రైనేజీల శుభ్రత విషయంలో ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలపై సకాలంలో స్పందించకపోతుండటం వల్లే వారు విధిలేక ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. డ్రైనేజీలను శుభ్రపరచాలంటూ ప్రజల నుంచి ఎన్ని అభ్యర్థనలు వచ్చాయి.. ఎన్నింటిని పరిష్కరించారు.. తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోం శాఖ, జీహెచ్ఎంసీ, సీవరేజీ బోర్డు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. -
ప్రాణాలు తీసిన డ్రైనేజీ
► పనుల కోసం దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన అడ్డాకూలీలు ► రెండు గంటల పాటు డ్రైనేజీలోనే శవాలు ► సుల్తాన్‌బజార్ కపాడియాలైన్‌లో కనిపించని మానవత్వం ► కార్మికుల దినోత్సవం రోజునే విషాద ఘటన హైదరాబాద్: నగరంలో కార్మిక దినోత్సవం రోజునే ఇద్దరు అడ్డా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పనుల కోసం డ్రైనేజీలోకి దిగిన అడ్డా కూలీలు ఊపిరాడక మృత్యువాత పడిన విషాదకర సంఘటన ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లికి చెందిన బి.వీరాస్వామి(35) కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి రాంకోఠి గణేష్టెంపుల్ వద్ద నివసిస్తున్నాడు. వీరాస్వామికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఊయలవాడ గ్రామానికి చెందిన కోటయ్య(34) కుటుంబం కొంత కాలం క్రితం నగరానికి వచ్చి బడి చౌడిలో నివాసం ఉంటోంది. కోటయ్యకు భార్య, ఇద్దరు కూమారులు, ఒక కూమార్తె ఉన్నారు. వీరాస్వామి, కోటయ్య రాంకోఠిలో అడ్డాపై ప్రతిరోజు పని కోసం వస్తుంటారు. ఆదివారం ఉదయం సుల్తాన్‌బజార్ కపాడియాలైన్కు చెందిన ఓ వ్యక్తి వీరిని డ్రైనేజీ శుభ్రం చేసేందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కపాడియాలైన్‌లో పనుల నిమిత్తం కోటయ్య, వీరాస్వామి డ్రైనేజీలోకి దిగారు. సుమారు 12 గంటల ప్రాంతంలో ఇరువురు డ్రైనేజీలో ఊపిరి ఆడక మృతిచెందారు. స్థానికుల సమాచారంతో మధ్యాహ్నం 2 గంటలకు సుల్తాన్‌బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు విప్పిపెట్టిన బట్టల్లో సెల్‌ఫోన్ లభించడంతో అందులోని నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు వారి బంధువులతోనే శవాలను బయటికి తీయించి రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తండ్రి మృతదేహాన్ని చూసిన వీరాస్వామి ఆరేళ్ల, మూడేళ్ల కుమారులు వెక్కివెక్కి ఏడవడం అందరినీ కలచి వేసింది. తన భర్త చనిపోవడంతో తమను పోషించేవారు ఎవరని వీరాస్వామి భార్య భోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. కాగా, వీరాస్వామి, కోటయ్యలను అసలు పనికి ఎవరు పిలిచారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కనుమరుగైన మానవత్వం.. సుల్తాన్‌బజార్ కపాడియాలైన్‌లో అధిక శాతం సంపన్న వర్గాల వారే నివసిస్తుంటారు. అయితే మృతులు వీరాస్వామి, కోటయ్య మధ్యాహ్నం 12 గంటల సమయంలో డ్రైనేజీలో ఊపిరి ఆడక మృతిచెందితే.. రెండు గంటలకు పోలీసులు వచ్చే వరకూ అక్కడ ఏమైంది అని చూసే నాథుడు లేడు. కనీసం వీరిని పనికి పిలిపించిన వ్యక్తులు సైతం ఆ పక్కకు రాలేదు. -
మ్యాన్‌హోల్ శుభ్రంచేస్తూ ఇద్దరు కార్మికుల మృతి
నగరంలోని రామ్‌కోటిలో మ్యాన్‌హోల్‌ను సుభ్రంచేస్తూ ప్రమాదవశాత్తు మురుగునీటిలో పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్ శుభ్రంచేసేందుకు దిగిన ఇద్దరు విషవాయులకు ఊపిరి ఆడక మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతుల వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నగరపాలక సంస్థ అధికారులు వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మ్యాన్‌హోల్‌లో పడి కార్మికుడి మృతి
విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన కార్మికుడు మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందాడు. విశాఖపట్టణంలోని సిరిపురం రోడ్డులో డ్రైనేజి వ్యవస్థ స్తంభించింది. డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దడానికి కార్మికుడు లోపలికి దిగాడు. లోపల ఎక్కువ ఉధృతి ఉండటం వల్ల మురుగులోకి మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. -
మ్యాన్‌హోల్‌లో పడి కార్మికుడి మృతి
విజయవాడ: నగరంలోని డీజీపీ ఆఫీసు సమీపంలో మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తుండగా ఓ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుడు ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన కార్మికుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నగరంలోని వాంబే కాలనీకి చెందిన ఏసు(38)గా గుర్తించారు. 18 సంవత్సరాలుగా విజయవాడ కార్పొరేషన్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. తమను ఆదుకోవాలని మృతుని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
మ్యాన్‌హోల్ తెరిచి పెట్టారు.. కోటిన్నర ఇవ్వండి!
ముంబై: మ్యాన్‌హోల్‌ను పాక్షికంగా తెరిచిఉంచినందుకు 51 ఏళ్ల వ్యక్తి గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీఎం)పై దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. మ్యాన్‌హోల్ తెరిచి ఉంచడం వల్ల తాను అందులో పడి.. కాలు విరిగిందని, ఇందుకు పరిహారంగా రూ. కోటిన్నర చెల్లించాలని ఆయన లీగల్ నోటీసులు జారీచేశారు. 51 ఏళ్ల విజయ్ హింగొరానీ వ్యాపారవేత్త. వ్యాపారాభివృద్ధి వ్యూహాలు రూపొదించి ఇవ్వడం ఆయన పని. గత ఏడాది నవంబర్ 29న బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఒట్టెర్స్ క్లబ్ సమీపంలో పాక్షికంగా తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఆయన కాలు విరిగింది. ఈ హఠాత్ పరిణామంతో బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో పనిచేసే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. మంచి వేతనం, బోనస్, వసతితో ఉద్యోగం కల్పిస్తామని, ఈ ఏడాది జనవరి 1 నుంచి చేరమని ఆ సంస్థ ఆఫర్ ఇచ్చింది. కాలు విరిగి మంచాన పడటంతో ఆయన ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోయారు. కాలు విరగడంతో హోలీ ఫామిటీ ఆస్పత్రిలో ఆయన నాలుగు వారాల చికిత్స పొందారు. ఇప్పుడు ఇంటివద్ద కోలుకుంటున్నారు. ముంబై మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా తన క్లయింట్ హింగోరానీ భౌతికంగా గాయపడి, జీవనోపాధిని కోల్పోయారని, కాబట్టి చికిత్స ఖర్చులు, జీవనోపాధికి సంబంధించి రూ. కోటిన్నర పరిహారం చెల్లించాలని ఆయన లాయర్ తెలిపారు. తన క్లయింట్‌కు ముంబై మున్సిపాలిటీ పరిహారం చెల్లించకుంటే.. దానిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
మ్యాన్‌హోల్‌లో మృతదేహం
-
'గాంధీ'లో దారుణం: మ్యాన్‌హోల్‌లో మృతదేహం
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక గాంధీ ఆసుపత్రి ఆవరణలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి నుంచి మురుగు నీరు పారే డ్రైనేజీ మ్యాన్ హోల్ లో మృతదేహం పడిఉంది. ఒక వ్యక్తి అందించిన సమాచారంతో సాక్షి ప్రతినిధులు ఈ సంఘటనను ముందుగా వెలుగులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. నిత్యం వేల మంది సంచరించే గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఓ వ్యక్తి ఇలా మ్యాన్ హోల్ లో శవమై కనిపించడం రాష్ట్రంలోని వైద్యశాలల దుస్థితికి అద్దం పడుతున్నదని అక్కడివారు భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి హత్యకుగురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని, మృతదేహం విషయం తెలియగానే తాము కూడా ఆశ్చర్యానికి లోనయ్యామని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
చంపి మ్యాన్‌హోల్‌లో పడేశారు
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తూప్ర శివారులో దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వ్యక్తిని హత్యచేసి దుండగులు మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి పైన రాళ్లు పెట్టి వెళ్లారు. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వర్షానికి తేలిన కంకర
హైదరాబాద్: నగరంలో ఆదివారం రాత్రి పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి రోడ్లు గుల్లయ్యాయి. బంజారా హిల్స్, అమీర్‌పేట ప్రాంతాల్లో కంకరపైకి తేలడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు జారిపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి తోడు అక్కడక్కడా ఉన్న మ్యాన్‌హోల్‌లు ద్విచక్రవాహనదారులను భయపెడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేసేటప్పుడు మ్యాన్‌హోల్ సమానంగా రోడ్లు వేయటం లేదు. అలా చేయటం వల్ల అవి గుంతలుగా మారి వర్షం పడినపుడు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏ గుంత ఎక్కడ ఉందో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. -
డ్రెయినేజీలో కొట్టుకుపోయిన బాలిక
సోమవారం రాత్రి బెంగళూరులో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై నడుస్తున్న ఓ చిన్నారి డ్రెయినేజీలో కొట్టుకుని పోయింది. గుంతలమయమైన రోడ్లలో నిలిచిన నీటిపై నడుస్తున్న చిన్నారి మ్యాన్‌హోల్ ప్రమాదవశాత్తు పడిపోయింది. బాలిక కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. బెంగళూరు : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై నడుస్తున్న ఓ చిన్నారి డ్రెయినేజీలో కొట్టుకుని పోయిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. గుంతలమయమైన రోడ్లలో నిలిచిన నీటిపై నడుస్తూ అది మ్యాన్‌హోల్ అని తెలియక ఓ చిన్నారి తన అత్త చేయి పట్టుకుని వస్తూ ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడి పోయింది. తమిళనాడుకు చెందిన గీతాలక్ష్మి (9) అనే బాలిక డ్రెయినేజీలో కొట్టుకుని పోయింది. ఇక్కడి మైకోలేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు... తమిళనాడుకు చెందిన గీతా లక్ష్మి (9) దసరా సెలవుల సందర్భంగా బెంగళూరు బన్నేరుఘట్ట రోడ్డులో పుట్టేనహళ్లిలోని దొరస్వామిపాళ్యలో ఉన్న అత్త ఇంటికి వచ్చింది. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో అత్తతో కలిసి గీతా లక్ష్మి మైకో లేఔట్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి అత్తతో కలిసి ఇంటికి బయలుదేరింది. అంతకు ముందే నగరంలో భారీ వర్షం కురిసింది. మార్గం మధ్యలో మైకోలేఔట్లోని పైహోటల్ ముందు భాగంలో అత్త చెయ్యి పట్టుకుని వస్తున్న గీత ఒక్కసారిగా మ్యాన్‌హోల్‌లో పడిపోయి కొట్టుకుపోయింది. అత్త లక్ష్మి గట్టిగా కేక వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసిన ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలిక కోసం గాలించారు. మంగళవారం ఉదయం వరకు బాలిక ఆచూకీ లభించలేదు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు వర్ణణాతీతం. -
మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడి మృతి
హైదరాబాద్ : మూతలేని మ్యాన్‌హోల్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలిచిన ఈ సంఘటన శనివారం రాత్రి హిమాయత్ నగర్లో చోటు చేసుకోగా ఆదివారం ఉదయం వెలుగు చూసింది. హిమాయత్‌నగర్ 6వ వీధిలోని సద్గుణ అపార్ట్మెంట్ 403వ నంబర్ ఫ్లాట్‌లో హేమంత్‌కుమార్ సహాయి (60) కుటుంబం నివాసముంటోంది. విజయదశమి వేడుకల్లో పాల్గొనేందుకు హేమంత్‌కుమార్ సహాయి శనివారం సాయంత్రం భార్యతో కలిసి గచ్చిబౌలిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. వేడుకలు పూర్తయిన తర్వాత భార్యను అక్కడే ఉంచి తమ్ముడు పియూష్ కుమార్ సహాయి వాహనంపై ఇంటికి బయలుదేరారు. రాత్రి 10.30 సమయంలో హివూయత్ నగర్ 6వ వీధి ప్రధాన రహదారిపై దిగిపోయూరు. 30 అడుగుల దూరం నడిచిన తర్వాత 8 అడుగుల లోతున్న మూతలేని మ్యాన్‌హోల్‌లో పడి హేమంత్ ప్రాణాలొదిలారు. ఆదివారం ఉదయం మ్యాన్‌హోల్‌లో హేమంత్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నారాయణగూడ డీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై జగన్నాథ్ అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ 174 పీఆర్సీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధి దీపాలు వెలగకపోవడం, మ్యాన్‌హోల్‌పై మూతలేకపోవడం వల్లే నిండు ప్రాణం బలైపోయిందని, జీహెచ్ఎంసీ అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హేమంత్‌కుమార్ (60) మృతికి బాధ్యులుగా పేర్కొంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి
-
జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం: నిండు ప్రాణం బలి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసీ) సిబ్బంది నిర్లక్ష్యంతో మరో నిండు ప్రాణం బలైంది. మ్యాన్‌హోల్‌లో పడి సాయి అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ ఘటన గత అర్థరాత్రి హిమాయత్‌నగర్‌లోని 6వ నెంబర్లో విధిలో చోటు చేసుకుంది. శనివారం ఆ వీధిలోని మ్యాన్‌హోల్ మూత తీసి సిబ్బంది పని చేపట్టారు. అనంతరం ఆ మ్యాన్ హోల్‌కు మూత అమర్చకుండా వెళ్లిపోయారు. దీంతో గత అర్థరాత్రి ఇంటికి వెళ్తున్న సాయి ఆ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వీధి నెం 6కు చేరుకుని మ్యాన్ హోల్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ప్రాణాలు హరీ...!
న్యూఢిల్లీ: నగరంలోని మ్యాన్‌హోళ్లు మత్యువుకు చిరునామాగా మారాయి. వీటివల్ల ప్రతి ఏడాది వందమంది పారిశుధ్య సిబ్బంది చనిపోతున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రత, కాలుపెడితే సర్రున జారిపోయేవిధంగా ఉండే గోడలు, విషవాయువులు ఇందుకు కారణమవుతున్నాయి. నగరంలోని మురుగుకాల్వలపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. మరమతు పనులకోసం వీటిలో దిగుతున్న సిబ్బంది అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. మరికొంతమంది ఏకంగా చనిపోతున్నారు. నేషనల్ క్యాంపెయిన్ ఫర్ డిగ్నిటీ అండ్ రైట్స్ ఫర్ సీవరేజ్ అల్లైడ్ వర్కర్స్ (ఎన్‌సీడీఏఆర్‌ఎస్‌ఏడబ్ల్యూ)తోపాటు ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఓహెచ్‌ఎస్‌ఎంసీఎస్) అనే రెండు సంస్థల సహకారంతో ప్రాక్సిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ పార్టిసిపేటరీ ప్రాక్టీసెస్ అనే మరో సంస్థ ఈ అంశంపై అధ్యయనం చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం నగరంలో ప్రతిరోజూ 2,871 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. దాదాపు ఐదువేల మంది పారిశుధ్య సిబ్బంది వీటిని తరచూ శుభ్రం చేస్తుంటారు. అయితే వారికి కల్పిస్తున్న వైద్యసదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతోపాటు వారి భద్రతకు ఆయా కార్పొరేషన్లు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమనే విమర్శలు లేకపోలేదు.ఈ కారణంగా వారు అనేకమైన భీకర వ్యాధులబారినపడుతున్నారని సదరు నివేదిక పేర్కొంది. ఇదిలాఉంచితే వారికి ఇస్తున్న వేతనాలు కూడా అంతంతే. దీనికితోడు కులవివక్ష, పక్షపాతం, వత్తిపరమైన భద్రత లేమి తదితర సమస్యలు వారిని నీడమాదిరిగా వెన్నాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పారి శుధ్య సిబ్బంది జీవన ప్రమాణాలపై అందరికీ అవగాహన కల్పించి వారి జీవితాలు మెరుగుపడేందుకు ఆయా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసేందుకే తాము ఈ అధ్యయనం నిర్వహించామని ప్రాక్సిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ పార్టిసిపేటరీ ప్రాక్టీసెస్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) కార్మిక సంఘం సభ్యుడు వేద్‌ప్రకాశ్ మాట్లాడుతూ రహదారిపైగల మ్యాన్‌హోళ్లలో దిగి వీరంతా మరమ్మతు పనులు నిర్వర్తిస్తుంటారని, దీంతో వీరిని మత్యుభయం వెన్నాడుతుందన్నారు. పారిశుధ్య సిబ్బందికి మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. రహదారులపై రాకపోకలు సాగించేవారు వారిని దుర్భాషలాడుతుంటారన్నారు. రోడ్డుపై మురుగు పోస్తున్నావంటూ మండిపడుతుంటారన్నారు. -
చైనాలో యువతిని చంపేందుకు విఫలయత్నం