నగరంలోని రామ్‌కోటిలో మ్యాన్‌హోల్‌ను సుభ్రంచేస్తూ ప్రమాదవశాత్తు మురుగునీటిలో పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు.
నగరంలోని రామ్‌కోటిలో మ్యాన్‌హోల్‌ను సుభ్రంచేస్తూ ప్రమాదవశాత్తు మురుగునీటిలో పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్ శుభ్రంచేసేందుకు దిగిన ఇద్దరు విషవాయులకు ఊపిరి ఆడక మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతుల వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నగరపాలక సంస్థ అధికారులు వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.