సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల క్రితం డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన అంతయ్య మృతదేహం కోసం సాహెబ్ నగర్‌లో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతోంది.ఈ క్రమంలో అంతయ్య ఆచూకీ కోసం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతున్నారు. మృతదేహం కుంట్లూరు చెరువులో కొట్టుకు పోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొన్న మధ్యాహ్నం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మూడు రోజులు గడుస్తున్న అంతయ్య మృతదేహం వెలికి తీయకపోవడం పై కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అధికారుల తప్పిదంతోనే అంతయ్య గల్లంతు
అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ అవగాహన లోపం మూలంగానే ఇద్దరు వ్యక్తులు డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందారని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. గల్లంతైన అంతయ్య కోసం అదే రోజు రాత్రి 10గంటలకు అధికారులు స్పందించి ఉంటే అప్పుడే దొరికేవారని పేర్కొన్నారు. దీనికి అంతటికి కారణం అధికారుల అలసత్వమేనని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, రాగుల వెంకటేశ్వరరెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, కళ్లెం జీవన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment