Sanitary Workers
-
హైదరాబాద్ సచివాలయం ముందు కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల ధర్నా
-
గిగ్ వర్కర్స్ తో రాహుల్ గాంధీ భేటీ
-
అధికారుల తప్పిదంతోనే అంతయ్య గల్లంతు
-
నాలుగు రోజులైనా ఇంకా దొరకని అంతయ్య మృతదేహం
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల క్రితం డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన అంతయ్య మృతదేహం కోసం సాహెబ్ నగర్లో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతోంది.ఈ క్రమంలో అంతయ్య ఆచూకీ కోసం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతున్నారు. మృతదేహం కుంట్లూరు చెరువులో కొట్టుకు పోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొన్న మధ్యాహ్నం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మూడు రోజులు గడుస్తున్న అంతయ్య మృతదేహం వెలికి తీయకపోవడం పై కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల తప్పిదంతోనే అంతయ్య గల్లంతు అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ అవగాహన లోపం మూలంగానే ఇద్దరు వ్యక్తులు డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందారని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. గల్లంతైన అంతయ్య కోసం అదే రోజు రాత్రి 10గంటలకు అధికారులు స్పందించి ఉంటే అప్పుడే దొరికేవారని పేర్కొన్నారు. దీనికి అంతటికి కారణం అధికారుల అలసత్వమేనని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, రాగుల వెంకటేశ్వరరెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, కళ్లెం జీవన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు -
వారు మాతృమూర్తులతో సమానం..
సాక్షి, విశాఖ: పరిసారలను అనునిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నపారిశుధ్య కార్మికులపై మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్య నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. స్వచ్చభారత్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు వారు పేరుపేరునా ధన్యవాదాలుతెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా శుక్రవారం అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర చాలా కీలకమని ప్రశంసించారు. పారిశుధ్య కార్మికులు మాతృ మూర్తులతో సమానమని, వారి సేవలకు గుర్తుంపుగా అవార్డులు ప్రధానం చేయడం చాలా సంతోషకరమన్నారు. స్మార్ట్ సిటీ విశాఖను మరింత సుందర నగరంగా తీర్చి దిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ.. పారిశుద్యం అంటే కేవలం శానిటైజేషన్ మాత్రమే కాదని, పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచడమేని అభిప్రాయపడ్డారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి 25 మందికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీర్చిడిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని కోరారు. దేశంలో అత్యంత సుందర నగరాలలో విశాఖకు 9వ స్థానం లభించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. కాపులుప్పాడ బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్‌కి నిధులు విడుదల చేసి మరింత స్వచ్చత సాధిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆధారబాదరగా పనులు చేపట్టి మధ్యలో వదిలేసారని, తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. -
అలివేలు.. ఆణిముత్యమా!
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సాయంగా పలు వ్యక్తులు, సంస్థలు తమవంతుగా విరాళాలు అందజేస్తున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో రూ.12వేల వేతనం పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు అలివేలు రూ.10వేలు విరాళంగా ఇవ్వడం ద్వారా పెద్దమనసు చాటుకున్నారు. జియాగూడకు చెందిన పారిశుధ్య కార్మికురాలు అలివేలు జీహెచ్ఎంసీలో ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. కరోనాతో ప్రజలు పడుతున్న కష్టాలకు చలించి తన వేతనంలో నుంచి మంగళవారం రూ.10 వేలను చెక్కు రూపంలో మంత్రి కేటీ రామారావుకు అందజేశారు. కష్ట కాలంలో ఉపయోగపడాలనే..! ఈ సందర్భంగా కేటీఆర్ అలివేలుతో మాట్లాడి ఆమెకుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. తన భర్త శ్రీశైలం కూరగాయల మార్కెట్లో రోజువారీ కూలీ అని, పిల్లలు చ దువుకుంటున్నారని అలివేలు చెప్పారు. కుటుంబానికి అం డగా ఉంటా, ఏదైనా సాయం కావాలంటే చెప్పమని కేటీఆర్ అడగ్గా.. ‘లాభాపేక్ష, ప్రయోజనం కోసం ఈ సాయం చే యడం లేదు. నెల వేతనం విరాళం ఇస్తానంటే చాలా మంది ఈ కష్టకాలంలో ఎందుకు నీ దగ్గరే పెట్టుకో అన్నారు. కానీ నా భర్త శ్రీశైలం, పిల్లలు శివప్రసాద్, వందన మాత్రం అండగా నిలిచారు’ అని అలివేలు సమాధానం ఇచ్చారు. ఆమె పెద్ద మనసుకు కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ఆ విరాళం కరోనా పోరులో ముందు వరుసలో నిలిచిన ప్రతీ ఒక్కరికి గౌరవాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు. -
కరోనా: పాదపూజ చేసిన ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నివాణకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవల సిబ్బంది మాత్రం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వైద్య సిబ్బంది పాటు పారిశుధ్య కార్మికులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని సముచితంగా సత్కరిస్తున్నారు. (ఏపీలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు) ఘన సన్మానం.. పారిశుధ్య కార్మికుల సేవలకు ఫిదా అయిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారికి పాదపూజ చేశారు. పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం కార్మికుల కాళ్లు కడిగి, పూలతో అభిషేకం చేశారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. నోట్ల దండం.. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల ప్రజాప్రయోజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు పారిశుధ్య కార్మికులను స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం నోట్లదండలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు పాల్గొన్నారు. పోలీసులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. పూలవాన విజయనగరంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు గుజ్జల నారాయణరావుతో కలిసి పారిశుధ్య కార్మికులపై పూలు చల్లి అభినందించారు. రేషన్ కార్డు లేని 150 కుటుంబాలకు పది కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. -
పారిశుధ్య కార్మికుడికి చప్పట్లతో
-
ఊపిరాడని బతుకుకు..ఊపిరిపోశారు!
చంద్రశేఖర్ కాలనీ: వరద నీరు వెళ్లేందుకు నిర్మించిన డ్రైనేజీలో చెత్తను తొలగించేందుకు దిగిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు అందులో చిక్కుకు పోయాడు. సరిగా శ్వాస ఆడక గంటపాటు విలవిల్లాడాడు. స్థానికులు సకాలంలో స్పందించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన గురువారం నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని వర్ని రోడ్డులో దశాబ్దాల క్రితం స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మించారు. కోటగల్లి పరిసర ప్రాంతాలకు చెందిన మురుగునీరు ఈ డ్రైనేజీ ద్వారానే పూలాంగ్ వాగులోకి వెళుతోంది. అయితే, డ్రైనేజీలో చెత్త పేరుకు పోవడంతో మురుగు నీరు నిలిచి పోయింది. ఆ చెత్తను తొలగించేందుకు కార్పొరేషన్ సిబ్బంది గురువారం ప్రయత్నించారు. రోడ్డు కింద నిర్మించిన డ్రైనేజీ లోపలికి వెళ్లిన తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు గంగాధర్ (35) కర్ర సాయంతో చెత్తను తొలగిస్తుండగా, మురుగు నీరు ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ క్రమంలో గంగాధర్ కుడి చేయి కేబుల్ పైపులైన్లలో చిక్కుకోవడంతో అతడు డ్రైనేజీలో ఉండిపోయాడు. గంగాధర్‌కు పైపు ద్వారా గాలి అందిస్తున్న కార్మికులు శ్వాస సరిగా ఆడక విలవిల్లాడాడు. ఇది గమనించిన మరో కార్మికుడు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాడు. మరోవైపు గంగాధర్‌కు శ్వాస ఆడేందుకు ఇంట్లో వినియోగించే నీటి పైప్‌ను స్థానికులు అందించారు. అనంతరం జేసీబీతో రోడ్డును తవ్వి డ్రైనేజీ నీటిని వేరే వైపు మళ్లించారు. గంట పాటు డ్రైనేజీలో ఇరుక్కుని తల్లడిల్లిన గంగాధర్‌ను తోటి కార్మికులు బయటకు తీసి, జిల్లా ఆస్పత్రికి తరలించారు. గంగాధర్‌ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్ అలీ తెలిపారు. -
ఆ ఉద్యోగం కోసం వేలమంది ఇంజనీర్లు క్యూ
కోయంబత్తూరు : తమిళనాడు, కోయంబత్తూరు నగర కార్పొరేషన్లో వందల సంఖ్యలో ఉన్న శానిటరీ కార్మికుల పోస్టుల భర్తీకోసం ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు (బీఎస్సీ, ఎంఎస్సీ,ఎంకామ్,)వేలకొద్దీ ఎగబడిన వైనం నిరుద్యోగ భారతానికి అద్దం పట్టింది. కార్పొరేషన్‌లోని 549 శానిటరీ కార్మికుల పోస్టులకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో మొత్తం 7 వేల మంది ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు దరఖాస్తు చేసుకోవడం విశేషం. గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల కోసం పిలుపునివ్వగా వేల దరఖాస్తులు వచ్చి పడ్డాయని కార్పొరేషన్ అధికారులు స్వయంగా ప్రకటించారు. ఈ ఉద్యోగాల కోసం నిన్న(బుధవారం) ప్రారంభమైన మూడు రోజుల ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల ధృవీకరణ కార్యక్రమంలో 7వేల మంది దరఖాస్తుదారులు హాజరైనట్లు కార్పొరేషన్ అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 70 శాతం మంది అభ్యర్థులు ఎస్ఎస్ఎల్సి, కనీస అర్హత పూర్తి చేసినవారు కాగా, వీరిలో ఎక్కువ మంది ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారని వారు తెలిపారు. వీరిలో ఇప్పటికే ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు. అలాగే గత పదేళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారు కూడా ఈ శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిదీ ఒక వృత్తి కాబట్టి శానిటరీ వర్కర్‌గా పనిచేయడంలో పెద్దగా సిగ్గు లేదనీ బిఇ మెకానికల్ గ్రాడ్యుయేట్ ఎస్ విఘ్నేష్ అన్నారు. తల్లి, తమ్ముళ్లను పోషించుకోవాల్సి వుంది. అందుకే ఈ ఇంటర్వ్యూకి వచ్చానన్నారు. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన పూవిజి మీనా, ఎంకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె భర్త ఎస్ రాహుల్, ఇంటర్వ్యూలో ఎంపికైతే తాము శానిటరీ కార్మికులుగా పనిచేయడానికి అభ్యంతరం లేదని ఈ జంట తెలిపింది. అలాగే 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న పి ఈశ్వరి మాట్లాడుతూ, కార్పొరేషన్ చాలా సంవత్సరాల తరువాత ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున పర్మినెంట్ జాబ్ కోసం చూస్తున్నానని చెప్పారు. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10వ తరగతి. ప్రారంభ జీతం రూ .15,700. పొద్దున మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు పని గంటలు. ఈ మధ్యలో ఉన్న విశ్రాంతి సమయంలో ఇతర చిన్న పనులు చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇదే ఉద్యోగార్థులను ఆకర్షించినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా నగర కార్పొరేషన్లో 2,000 మంది పర్మినెంట్, 500 మంది కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులు పనిచేస్తున్నారు. -
జీతాలు చెల్లించండి బాబోయ్
సాక్షి, మైలవరం(కృష్ణా) : గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో పేదలు నరకయాతన పడుతున్నారు. ఉపాధి కోసం స్కూళ్లలో చేరిన పారిశుద్ధ్య కార్మికులను రెండేళ్లుగా జీతాలు చెల్లించకుండా ఆటలాడుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో స్వీపర్లును నియమించింది. నెలకు రూ.1500 చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. తొలి ఏడాది అరకొరగా జీతాలు చెల్లించి తరువాత రెండు, మూడు నెలలకు ఒకసారి ఒక నెల జీతం చెల్లిస్తూ కాలయాపన చేశారు. దీంతో స్వీపర్లు సంక్షోభంలో పడ్డారు. ప్రస్తుతం జీతాలు లేక పాఠశాల ప్రధానోపాధ్యాయుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 4500 పాఠశాలలు ఉండగా 1200 పాఠశాలల్లోనే స్వీపర్లును నియమించారు. కొన్ని పాఠశాలల్లో గతం నుంచి పనిచేస్తున్న అటెండర్లతోనే ఇతర పనులు కూడా చేయిస్తున్నారు. 23 నెలలుగా వారికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. స్వీపర్లు అనేక సార్లు వేతనాలు చెల్లించాలని పలు మార్లు నిరసన తెలిపినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. మైలవరం నియోజకవర్గంలో 120 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. నందిగామ మండలంలో జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు 56వరకు ఉన్నాయి. నూజివీడు మండలంలో 85 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. తిరువూరు మండలంలో 61 జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జగ్గయ్యపేట మండలంలో 59 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని 4,500 పాఠశాలల్లో కేవలం 1200 పాఠశాలల్లో మాత్రమే స్వీపర్ల నియామకం జరిగింది. మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కాని పట్టించుకున్న నాథుడే లేడు. -
మ్యాన్‌హోల్స్ శుద్ధికి రోబో
సాక్షి, హైదరాబాద్: మురుగునీటి పైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న పారిశుద్ధ్య కార్మికుల జీవితాలకు భద్రత, భరోసా నిచ్చేందుకు రోబోలు అందుబాటులోకి వచ్చాయి. కేరళలో ప్రయోగాత్మకంగా కొందరు యువ ఇంజనీర్లు తయారు చేసిన రోబోలు ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల జల బోర్డుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేరళ వాటర్ అథారిటీ ఇప్పటికే ఇలాంటి 50 రోబోలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిసింది. యువ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోన్న జెన్‌రోబోటిక్స్ అనే సంస్థ ఈ రోబోలను తయారు చేసింది. ఈ రోబోకు బ్యాండీకూట్ అనే పేరుపెట్టింది. ఈ అరుదైన రోబోకు పేటెంట్ హక్కులు పొందేందుకు సంస్థ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. దేశ వ్యాప్తంగా 2014–17 మధ్యకాలంలో మురుగునీటి పైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి సుమారు 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు మృత్యువాతపడ్డారు. దీంతో తమ ఇంజనీర్ల బృందం ఈ అధునాతన రోబో తయారీకి శ్రీకారం చుట్టి ్టనట్లు మెకానికల్ ఇంజనీర్, జెన్‌రోబోటిక్స్ సీఈఓ విమల్ గోవింద్ అన్నారు. తమ బృందంలో ఐటీ, మెకానికల్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ రోబో పని చేస్తుందిలా.. ఈ బ్యాండీకూట్ రోబో తయారీకి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. రోబో బరువు దాదాపు 80 కిలోలు. మ్యాన్‌హోళ్లలో మనుషులు దిగే అవసరం లేకుండా ఈ రోబో శుద్ధి ప్రక్రియ నిర్వహిస్తుంది. మ్యాన్హోల్లోకి వెళ్లే రోబో విడిభాగాల బరువు 30 కిలోలు. ముందుగా ఈ రోబోకున్న వైరును మురుగు ప్రవాహానికి అడ్డంకులున్న మ్యాన్హోల్లోకి పంపిస్తారు. దీనికున్న కెమెరా లోపలి పరిస్థితిని ఫొటోలు తీస్తుంది. ఈ ఫొటోలు బయట స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీంతో మురుగు ప్రవాహానికి ఎక్కడ ఆటంకాలున్నాయో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత జెట్పైప్ సాయంతో రోబో మ్యాన్హోల్లోకి వెళ్లి ప్రవాహానికి ఉన్న ఆటంకాలను నిమిషాల వ్యవధిలో తొలగిస్తుంది. మూడు గంటలపాటు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని ఈ రోబో 30 నిమిషాల్లోనే పూర్తిచేస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కూడా ఈ రోబోను ఆపరేట్ చేయవచ్చని చెప్పారు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి సైతం ఈ రోబోలు ఉపయుక్తంగా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రధాని కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామని, వీటి పనితీరుపై ప్రజెంటేషన్ సైతం ఇచ్చినట్లు వారు వివరించారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ రీసెర్చ్ సైతం ఈ బ్యాండీకూట్ రోబో ఉత్తమమైనదిగా అభివర్ణించిందన్నారు. తమ రోబో విశిష్టతలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ రోబోటిక్స్ రీసెర్చ్ జర్నల్‌లోనూ ప్రచురించారని నిర్వాహకులు తెలిపారు. -
‘పుర’ కార్మికులకు హెల్త్ కార్డులు
► ఇళ్లు లేనివారికి డబుల్బెడ్రూం ఇళ్లు ► పారిశుధ్య కార్మికులకు మంత్రి కేటీఆర్ హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు హెల్త్ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని అర్హులైన పారిశుధ్య కార్మికులకు డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్లు ఇస్తామని, అవసరమైతే ప్రత్యేక కోటాను సృష్టించే అంశాన్ని పరిశీలి స్తామని చెప్పారు. రాష్ట్రంలోని పురపాలికల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ వేతనాలు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని, డబుల్ బెడ్ రూంఇళ్లు మంజూరు చేయాలని, సమాన పనికి సమాన వేతనమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, రక్షణ పరికరాలు అందించాలని కార్మికులు తమ డిమాండ్లను మంత్రి ముందుంచారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ఆర్థిక పరిపుష్టి గల పురపాలికల్లో పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచితే ఎలాంటి ఇబ్బందీ లేదని, అయితే సరిపడా ఆదాయం లేని చిన్న మున్సిపాలిటీలు, నగర పంచాయ తీల్లో తీసుకోవాల్సిన శాఖాపరమైన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈఎస్ఐ, పీఎఫ్‌ను కార్మికులకు అందజేస్తామ ని హామీ ఇచ్చారు. సమాన పనికి సమాన వేతనం అమలుకు కొంత సమయం కావాలని కోరారు. కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలి వ్వని మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమా వేశం నిర్వహిస్తామని, వేతన బకాయిలు చెల్లిం చేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని శ్రామిక వర్గాలు, ఉద్యోగులందరీ జీతాలు ప్రభుత్వం పెంచిందని, పురపాలికల్లో పారిశుధ్యాన్ని పరిరక్షిస్తున్న కార్మికులను సీఎం కేసీఆర్ దేవుళ్లతో సమానమని పోల్చారని గుర్తుచేశారు. సీఎంకు కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన, సానుభూతి ఉందని, కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇళ్లలో పని చేయించుకుంటే సస్పెన్షన్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులతో తమ ఇళ్లల్లో పనిచేయించుకుంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనల గురించి నేరుగా తనకు, తన కార్యాలయానికి సమాచారమిస్తే తక్షణమే సంబంధిత మున్సిపల్ కమిషనర్లను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని, వారు నగరాలు, పట్టణాల కోసమే పని చేయాలని, ప్రజాప్రతినిధుల కోసం కాదన్నారు. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు ఇచ్చామని, ఇంకా అవసరమైతే సరఫరా చేస్తామని, వీటిని వినియోగించేలా కార్మికుల ను చైతన్యపరచాలని చెప్పారు. సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకులు, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విరమణ
నేటి నుంచి విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు 279 జీఓను 110 మున్సిపాలిటీల్లో అమలు చేసిన తరువాతే నెల్లూరు కార్పొరేషన్లో అమలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డిల హామీ నెల్లూరు, సిటీ : పారిశుద్ధ్య కార్మికులకు తాత్కాలిక ఊరట లభించింది. 279 జీఓను రద్దు చేయాలని గత వారం రోజులుగా సమ్మె చేస్తుండగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి రంగంలోకి దిగి కార్మికుల సమ్మె విరమింపచేశారు. నగరంలోని నవాబుపేట బీవీఎస్ పాఠశాల సమీపంలో గురువారం జనచైతన్యయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులు జనచైతన్య యాత్ర వద్దకు భారీగా చేరుకున్నారు. సీఐటీయూ. సీపీఎం నాయకులు టీడీపీ నాయకులతో ఆరగంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ 279 జీఓ అమలు చేయడం ద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిన 200 మంది కార్మికులను నియమించుకున్నారని, వారికి కేవలం రూ.5 వేలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లలోకి జీతాలు వస్తున్నాయని, జీఓ అమలు జరిగితే కార్మికులు జీతాల కోసం కాంట్రాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. కార్మికుల సమ్మెను దళితబాట పట్టిస్తున్నారని కొంత మంది టీడీపీ నాయకులు విమర్శించడం దుర్మార్గమని పేర్కొన్నారు. జీఓ అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం నాయకులు పెంచలయ్య, అల్లాడి గోపాల్, మస్దాన్బీ తదితరులు పాల్గొన్నారు. 279 జీఓ 109 మున్సిపాలిటీల్లో అమలు చేసిన తరువాతే నెల్లూరులో.. రాష్ట్రవ్యాప్తంగా 279 జీఓ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని, అయితే 110 మున్సిపాలిటీల్లో 109 మున్సిపాలిటీల్లో జీఓను అమలు చేసిన తరువాతే నెల్లూరు నగర పాలక సంస్థలో ఈ జీవో అమలు అవుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి కార్మికులకు హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలపై చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. మేయర్ అజీజ్‌కు బీద చురక.. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆ సంఘ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని బీద రవిచంద్ర మేయర్ అజజ్కు చురకలంటించారు. టీడీపీలో ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, అనురాధ, రమేష్‌రెడ్డి కౌన్సిల్లో పనిచేసిన వారేనని గుర్తుచేశారు. వాళ్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గత వారం రోజులుగా మేయర్ వ్యవహరించిన తీరుపై బీదా రవిచంద్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మేయర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై బీద రవిచంద్ర పార్టీ వర్గాల ముందు పరోక్షంగా హెచ్చరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
'ఆయన మాత్రం 'సకల' సమ్మె చేయవచ్చా!'
హైదరాబాద్ : 'సీఎం కేసీఆర్ మాత్రం సకల జనుల సమ్మె చేయవచ్చు. ఆందోళన, పోరాటం, ఉద్యమం చేయవచ్చు. తెలంగాణ తెచ్చేందుకు కంకణం కట్టుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో కార్మిక సంఘాలకు అడిగే హక్కు, పోరాటం చేసే హక్కు వుండకూడదా? సమ్మెను అణచివేస్తరా? ఇదెక్కడి న్యాయం! ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది? తెలంగాణ అర్థమిదేనా?' అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ సోమవారం ధ్వజమెత్తారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తే మిలటరీని దింపిన చరిత్ర దేశంలో ఇప్పటి వరకూ లేదన్నారు. సీఎంను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు మార్గంలోనే వెళ్తే ఆయన్ను పారిశుద్ధ్య కార్మికులు గంగలో కలుపుతారని ఆయన హెచ్చరించారు.