హైదరాబాద్ : 'సీఎం కేసీఆర్ మాత్రం సకల జనుల సమ్మె చేయవచ్చు. ఆందోళన, పోరాటం, ఉద్యమం చేయవచ్చు. తెలంగాణ తెచ్చేందుకు కంకణం కట్టుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో కార్మిక సంఘాలకు అడిగే హక్కు, పోరాటం చేసే హక్కు వుండకూడదా? సమ్మెను అణచివేస్తరా? ఇదెక్కడి న్యాయం! ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది? తెలంగాణ అర్థమిదేనా?' అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ సోమవారం ధ్వజమెత్తారు.
పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తే మిలటరీని దింపిన చరిత్ర దేశంలో ఇప్పటి వరకూ లేదన్నారు. సీఎంను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు మార్గంలోనే వెళ్తే ఆయన్ను పారిశుద్ధ్య కార్మికులు గంగలో కలుపుతారని ఆయన హెచ్చరించారు.
'ఆయన మాత్రం 'సకల' సమ్మె చేయవచ్చా!'
Published Mon, Jul 13 2015 7:55 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement