CITU Secretary
-
‘ఆ రెండు బిల్లులు ఉపసంహరించుకోవాలి’
సాక్షి, విజయవాడ : కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందంటూ ధర్నా చౌక్‌లో అల్ ట్రేడ్ యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫుర్ ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేలా పార్లమెంట్లో బిల్లులను ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. 17 కార్మిక చట్టాలను రెండు లేబర్ కోడ్లుగా మార్చిందని, దీని వల్ల 13 కార్మిక చట్టాలు రద్దవుతాయని తెలిపారు. ఇది కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా రెండో చట్టమైన వేతనాల చట్టం వల్ల నాలుగు కార్మిక చట్టాలు రద్దు అవుతాయని అన్నారు. ఈ రెండు బిల్లులు దేశంలోని 40 కోట్ల మంది కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. లోక్‌సభలో ప్రవేశ పెట్టిన ఈ రెండు బిల్లులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
'ఆయన మాత్రం 'సకల' సమ్మె చేయవచ్చా!'
హైదరాబాద్ : 'సీఎం కేసీఆర్ మాత్రం సకల జనుల సమ్మె చేయవచ్చు. ఆందోళన, పోరాటం, ఉద్యమం చేయవచ్చు. తెలంగాణ తెచ్చేందుకు కంకణం కట్టుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో కార్మిక సంఘాలకు అడిగే హక్కు, పోరాటం చేసే హక్కు వుండకూడదా? సమ్మెను అణచివేస్తరా? ఇదెక్కడి న్యాయం! ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది? తెలంగాణ అర్థమిదేనా?' అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ సోమవారం ధ్వజమెత్తారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తే మిలటరీని దింపిన చరిత్ర దేశంలో ఇప్పటి వరకూ లేదన్నారు. సీఎంను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు మార్గంలోనే వెళ్తే ఆయన్ను పారిశుద్ధ్య కార్మికులు గంగలో కలుపుతారని ఆయన హెచ్చరించారు.