సాక్షి,సిటీబ్యూరో:‘ మీ వీధిలో కానీ, మీరు నడిచే మార్గాల్లోని రోడ్లపై కానీ మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్లకు మూతలు లేకుండా కనిపిస్తే వెంటనే వాటిని ఫొటో తీయండి. సెల్ నెంబర్ 88974 77250 కు వాట్సప్ చేయండి. 5 గంటల్లో కొత్త మూత వేస్తాం. అంతేకాదు, మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్ల మూతలు ధ్వంసమైన ఫొటోలను కూడా ఇదే నెంబర్‌కు వాట్సప్ చేయండి. 24 గంటల్లోగా బాగుచేసి వేస్తాం’ అని జీహెచ్‌ఎంసీ
కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్ల పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ఆయన...అందులో భాగంగా పై ప్రకటన చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,96,329 సీవరేజ్ మ్యాన్‌హోళ్లు, 1,22,461 క్యాచ్‌పిట్‌లు ఉన్నాయి.
వీటిల్లో చాలావాటికి మూతల్లేవని, పాడయ్యాయని తరచూ ఫిర్యాదులందుతున్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం బుధవారం నిర్వహణ విభాగం ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘నో ఓపెన్ మ్యాన్‌హోల్’ పాలసీని అమలు చేయాలని నిర్ణయించారు. అందే ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత వ్యవధిలోగా సమస్యను పరిష్కరించాలని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశారు. గరిష్టంగా వారం రోజుల్లో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి వాట్సప్ ద్వారా అందే ఫిర్యాదులకు ప్రత్యేకంగా టోకెన్ నెంబర్‌ను కేటాయించి, సంబంధిత అధికారికి తగు చర్యల నిమిత్తం పంపించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. చేపట్టిన చర్యలకు సంబంధించిన ఫిర్యాదు దారుకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించడంతో పాటు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ https://www.ghmc.gov.in లోకూడా వివరాలు ఉంచడం జరుగుతుందని తెలిపారు.
ఇందుకు ప్రజలు చేయాల్సింది..
♦ మ్యాన్‌హోల్‌ఫొటో లేదా వీడియో తీయడం
♦ ఎక్కడున్నదీ లొకేషన్‌ను తెలపడం
♦ సమీపంలోని ప్రముఖ ప్రాంతం లేదా ఇంటి నెంబర్ వేయడం
♦ 88974 77250 నెంబర్‌కు వాట్సప్ చేయడం..
Comments
Please login to add a commentAdd a comment