భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లపై అడుగులోతు నీళ్లు చేరడంతో ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ మ్యాన్‌హోల్ తెరుచుకొని ఉందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో బైకుపై వెళుతున్న ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపై అడుగులోతు నీళ్లలో నిదానంగా బైకు మీద వెళుతున్న అతను.. బైక్‌తో సహా తెరుచుకున్న మ్యాన్‌హోల్‌లోకి పడిపోయాడు.