
చంపి మ్యాన్‌హోల్‌లో పడేశారు
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తూప్ర శివారులో దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వ్యక్తిని హత్యచేసి దుండగులు మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి పైన రాళ్లు పెట్టి వెళ్లారు. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.