Shocking Video: రోడ్డుపై ఫోన్‌ మాట్లాడుతూ వెళ్తున్నారా.. ఈ వీడియో చూడండి | Woman Falls Into Open Manhole While Talking On Phone | Sakshi
Sakshi News home page

Shocking Video: రోడ్డుపై ఫోన్‌ మాట్లాడుతూ వెళ్తున్నారా.. ఈ వీడియో చూడండి

Published Sat, Apr 23 2022 8:01 PM | Last Updated on Sat, Apr 23 2022 8:04 PM

Woman Falls Into Open Manhole While Talking On Phone - Sakshi

Shocking Video: రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున‍్నప్పుడు ఫోన్‌ మాట్లాడటం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. రోడ్డుపై ఫోన్‌లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ తెరిచిఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. బీహార్‌ రాజధాని పట్నాలోని అలమ్​గంజ్‌లో ఓ మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్​హోల్‌లో పడిపోయింది. ఆమె మ్యాన్‌హోల్‌లో పడిపోవడం రోడ్డుపై ఉన్న కొందరు వ్యక్తులు గమనించి వెంటనే బయటకు తీశారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదంలో సదరు మహిళకు గాయలయ్యాయి. అయితే, ఈ ప్రమాదానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇది చదవండి: పోయే కాలం అంటే ఇదేనేమో.. అయ్యా అదేం పని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement