విజయవాడ: నగరంలోని డీజీపీ ఆఫీసు సమీపంలో మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తుండగా ఓ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుడు ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్లో పడిపోయాడు.
దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన కార్మికుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నగరంలోని వాంబే కాలనీకి చెందిన ఏసు(38)గా గుర్తించారు. 18 సంవత్సరాలుగా విజయవాడ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. తమను ఆదుకోవాలని మృతుని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మ్యాన్హోల్లో పడి కార్మికుడి మృతి
Published Wed, Mar 23 2016 6:15 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement
Advertisement