
ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో మ్యాన్‌హోల్‌లో దిగి శుభ్రం చేస్తున్న సిబ్బంది..
ఖైరతాబాద్: ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలవుతున్నాయి. నిబంధనలు మురుగులో కొట్టుకుపోతున్నాయి. కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ఇటీవల నగరంలో మ్యాన్‌హోల్‌లో దిగి... కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటన నేపథ్యంలో 15 అడుగుల లోతు ఉన్న మ్యాన్‌హోల్స్‌ను యంత్రంతోనే శుభ్రం చేయాలని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. అధికారులూ ఆచరిస్తున్నట్టు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. మంగళవారం ఖైరతాబాద్ డివిజన్‌లో కాంట్రాక్టర్ మరోసారి మ్యాన్‌హోల్‌ను సిబ్బందితో శుభ్రం చేయించారు. యంత్రం మాట పక్కన పెట్టేశారు.