వర్షానికి తేలిన కంకర | Rain damages roads in hyderabad | Sakshi
Sakshi News home page

వర్షానికి తేలిన కంకర

Published Mon, Mar 2 2015 7:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

Rain damages roads in hyderabad

హైదరాబాద్: నగరంలో ఆదివారం రాత్రి పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి రోడ్లు గుల్లయ్యాయి. బంజారా హిల్స్, అమీర్‌పేట ప్రాంతాల్లో కంకరపైకి తేలడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు జారిపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.

దీనికి తోడు అక్కడక్కడా ఉన్న మ్యాన్‌హోల్‌లు ద్విచక్రవాహనదారులను భయపెడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేసేటప్పుడు మ్యాన్‌హోల్ సమానంగా రోడ్లు వేయటం లేదు. అలా చేయటం వల్ల అవి గుంతలుగా మారి వర్షం పడినపుడు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏ గుంత ఎక్కడ ఉందో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement