గాంధీనగర్: సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి అందులోకి దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడాక ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గుజరాత్ భరూచ్ జిల్లాలోని దహేజ్‌లో జరిగింది. ఈ ముగ్గురు కార్మికులు స్థానిక పంచాయతీ కార్యాలయంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్లి చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులను గల్సిన్‌భాయ్ మునియా(30), పరేశ్ కతారా(31), అనిల్ పర్మార్(24)గా గుర్తించారు. వీరంతా దహేజ్ వాసులే కావడం గమనార్హం.
సెప్టిక్‌ట్యాంకులోకి దిగిన వెంటనే తమకు ఊపిరాడటం లేదు సాయం చేయాలని ముగ్గురు కార్మికులు అరుపులు, కేకలు పెట్టినట్లు పోలీసులు వివరించారు. అక్కడున్నవారు వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ముగ్గురు కార్మికులను బయటకు తీశారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వీరు చనిపోయారని తెలిపారు.
సెప్టిక్ ట్యాంక్‌లో విషవాయువు పీల్చడం వల్లే కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ముగ్గురూ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే సెప్టిక్ ట్యాంకులోకి దిగినట్లు స్థానికులు వెల్లడించారు.
గుజరాత్‌లో పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం రెండు వారాల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 23న రాజ్‌కోట్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో గత రెండేళ్లలో మొత్తం 11 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం ఆందోళన కల్గిస్తోంది.
చదవండి: హైదరాబాద్‌లో కాల్పులు.. ఒకరి మృతి
Comments
Please login to add a commentAdd a comment