Septic Tank Cleaners
-
సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరుపులు.. కాసేపటికే ముగ్గురూ..
గాంధీనగర్: సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి అందులోకి దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడాక ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గుజరాత్ భరూచ్ జిల్లాలోని దహేజ్‌లో జరిగింది. ఈ ముగ్గురు కార్మికులు స్థానిక పంచాయతీ కార్యాలయంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్లి చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులను గల్సిన్‌భాయ్ మునియా(30), పరేశ్ కతారా(31), అనిల్ పర్మార్(24)గా గుర్తించారు. వీరంతా దహేజ్ వాసులే కావడం గమనార్హం. సెప్టిక్‌ట్యాంకులోకి దిగిన వెంటనే తమకు ఊపిరాడటం లేదు సాయం చేయాలని ముగ్గురు కార్మికులు అరుపులు, కేకలు పెట్టినట్లు పోలీసులు వివరించారు. అక్కడున్నవారు వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ముగ్గురు కార్మికులను బయటకు తీశారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వీరు చనిపోయారని తెలిపారు. సెప్టిక్ ట్యాంక్‌లో విషవాయువు పీల్చడం వల్లే కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ముగ్గురూ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే సెప్టిక్ ట్యాంకులోకి దిగినట్లు స్థానికులు వెల్లడించారు. గుజరాత్లో పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం రెండు వారాల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 23న రాజ్‌కోట్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో గత రెండేళ్లలో మొత్తం 11 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం ఆందోళన కల్గిస్తోంది. చదవండి: హైదరాబాద్‌లో కాల్పులు.. ఒకరి మృతి -
Divanshu Kumar: గొప్ప ఆవిష్కరణ.. సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేసే రోబో! ఇకపై
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది....అంటారు. చాలామంది ఐడియాను మాత్రమే నమ్ముకొని కష్టాన్ని మరిచిపోతారు. ‘ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం అవుతుంది’ అని నమ్మే దివాన్షు కుమార్ దివ్యమైన ఆవిష్కరణకు తొలి బీజం వేశాడు... అవసరాల నుంచి మాత్రమే కాదు విషాదాల నుంచి కూడా ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ‘హోమో సెప్’ రెండో కోవకు చెందిన ఆవిష్కరణ. మనదేశంలో ప్రతిసంవత్సరం సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే క్రమంలో అందులోని విషపూరితాల వల్ల ఎంతోమంది చనిపోయారు. చనిపోతున్నారు. అనేక రంగాలలో రోబోలను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడంలో ఎందుకు ఉపయోగించకూడదు! అని ఆలోచించాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ విద్యార్థి దివాన్షు కుమార్. ఫైనల్ ఇయర్ మాస్టర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే మానవరహిత రోబోకు రూపకల్పన చేశాడు. దీనికి ప్రొ.ప్రభురాజగోపాల్ మార్గదర్శకం వహించారు. రోబోను మరింత అభివృద్ధి పరిచే క్రమంలో ఒక డైనమిక్ టీమ్ తయారైంది. ఈ టీమ్ రాత్రనకా పగలనకా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఎన్నో మాక్–అప్ ట్రయల్స్ చేసింది. అనుకున్నది సాధించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఎంతోమంది సీఎస్ఆర్ డోనర్స్ అండగా నిలిచారు. దివాన్షు ఆలోచనలో నుంచి పుట్టిన రోబోకు ‘హోమో సెప్’ అని నామకరణం చేశారు. తొలిసారిగా ఈ రోబోలు తమిళనాడులో పనిలోకి దిగబోతున్నాయి. ఒక ఐడియా రాగానే ‘ఆహా! ఎంత గొప్పగా ఉంది’ అనుకుంటాం. ఉద్వేగంలో ఒక నిర్ణయానికి రాకుండా, అది ఏ రకంగా గొప్పదో ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్నప్పుడే, అందులో గొప్పదనం ఎంతో తెలుస్తుంది. అందుకే ‘ఐడియాలు గొప్పవే అయినప్పటికీ, ఉత్తుత్తి ఐడియాలు, సాధారణ ఐడియాలపై శ్రమ వృథా చేయవద్దు’ అనే మంచిమాటను నమ్ముతున్న దివాన్షు నుంచి భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ఆశించవచ్చు. చదవండి: Mamta Tiwari: ఐఏఎస్ అనుకుంది కానీ... పదిహేనేళ్ల తరువాత... -
ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం..
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది... అంటారు. చాలామంది ఐడియాను మాత్రమే నమ్ముకొని కష్టాన్ని మరిచిపోతారు. ‘ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం అవుతుంది’ అని నమ్మే దివాన్షు కుమార్ దివ్యమైన ఆవిష్కరణకు తొలి బీజం వేశాడు... అవసరాల నుంచి మాత్రమే కాదు విషాదాల నుంచి కూడా ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ‘హోమో సెప్’ రెండో కోవకు చెందిన ఆవిష్కరణ. మనదేశంలో ప్రతిసంవత్సరం సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే క్రమంలో అందులోని విషపూరితాల వల్ల ఎంతోమంది చనిపోయారు. చనిపోతున్నారు. అనేక రంగాలలో రోబోలను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడంలో ఎందుకు ఉపయోగించకూడదు! అని ఆలోచించాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ విద్యార్థి దివాన్షు కుమార్. ఫైనల్ ఇయర్ మాస్టర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే మానవరహిత రోబోకు రూపకల్పన చేశాడు. దీనికి ప్రొ.ప్రభురాజగోపాల్ మార్గదర్శకం వహించారు. రోబోను మరింత అభివృద్ధి పరిచే క్రమంలో ఒక డైనమిక్ టీమ్ తయారైంది. ఈ టీమ్ రాత్రనకా పగలనకా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఎన్నో మాక్–అప్ ట్రయల్స్ చేసింది. అనుకున్నది సాధించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఎంతోమంది సీఎస్ఆర్ డోనర్స్ అండగా నిలిచారు. దివాన్షు ఆలోచనలో నుంచి పుట్టిన రోబోకు ‘హోమో సెప్’ అని నామకరణం చేశారు. తొలిసారిగా ఈ రోబోలు తమిళనాడులో పనిలోకి దిగబోతున్నాయి. ఒక ఐడియా రాగానే ‘ఆహా! ఎంత గొప్పగా ఉంది’ అనుకుంటాం. ఉద్వేగంలో ఒక నిర్ణయానికి రాకుండా, అది ఏ రకంగా గొప్పదో ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్నప్పుడే, అందులో గొప్పదనం ఎంతో తెలుస్తుంది. అందుకే ‘ఐడియాలు గొప్పవే అయినప్పటికీ, ఉత్తుత్తి ఐడియాలు, సాధారణ ఐడియాలపై శ్రమ వృథా చేయవద్దు’ అనే మంచిమాటను నమ్ముతున్న దివాన్షు నుంచి భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ఆశించవచ్చు. (క్లిక్: పురుషులకు అండగా స్త్రీ గొంతుక) -
గ్రామాల్లో టాయిలెట్ వేస్ట్ శుద్ధి కేంద్రాలు
సాక్షి, అమరావతి: సెప్టిక్ ట్యాంకులు నిండి ఇబ్బందిపడుతున్న గ్రామాల్లో.. టాయిలెట్ వేస్ట్ శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. సెప్టిక్ ట్యాంకుల నుంచి శుద్ధి కేంద్రాలకు టాయిలెట్ వేస్ట్‌ను తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది. సబ్సిడీ కమ్ లోన్ విధానంలో నిరుద్యోగ యువతకు ఈ వాహనాలను అందజేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అధికారుల అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనే రోజూ 5,940 కిలోలీటర్ల టాయిలెట్ వేస్ట్.. సెప్టిక్ ట్యాంకులకు చేరుతుంది. కానీ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో కేవలం రోజుకు 1,145 కిలోలీటర్ల టాయిలెట్ వేస్ట్‌ను శుద్ధి చేసే కేంద్రాలు మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో టాయిలెట్ వేస్ట్‌ను శుద్ధి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్‌కి ఒకటి చొప్పున గ్రామాల్లో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుద్ధి చేసిన టాయిలెట్ వేస్ట్‌ను.. సేంద్రియ ఎరువుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. తొలిదశలో 23 గ్రామాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 46 గ్రామాల్లో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 23 గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కొక్క చోట కనీసం అర ఎకరా స్థలంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క శుద్ధి కేంద్రం నిర్మాణం కోసం గరిష్టంగా రూ.1.80 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మిగిలిన గ్రామాల్లో రెండో దశలో చేపడతారు. -
సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడుగురు మృతి
గాంధీనగర్ : గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్లోని సెప్టిక్‌ట్యాంక్‌ను క్లీన్ చేస్తుండగా.. ఆ హోటల్‌కు సంబంధించి ముగ్గురు సిబ్బందితో పాటు మరో నలుగురు కార్మికులు చనిపోయారు. అందులో అజయ్ వాసవ్(24), విజయ్ చౌహాన్(22), సహదేవ్ వాసవ(22)లను హోటల్ సిబ్బందిగా గుర్తించగా.. మిగిలిన నలుగురు పారిశుద్ద్య కార్మికులు ధబోయ్ ప్రాంతంలోని థువావికి చెందినవారుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ధబోయ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే హోటల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. ఏదైనా గ్యాస్ లీకై మరణించి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
ఈ ఐదుగురు చావుకు ఎవరు బాధ్యులు?
సాక్షి, ఢిల్లీ : వీధుల్లోని, కాలనీల్లోని, గహ సముదాయాల్లోని మురుగునీరు కాల్వలను శుభ్రం చేయడం కోసం మ్యాన్ హోల్లోకి దిగి అర్ధంతరంగా మరణిస్తున్నా పారిశుద్ధ్య పనివాళ్ల ప్రాణాలకు ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. వీరి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసి దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నా వాటిని ప్రభుత్వ పాలకులుగానీ, కాంట్రాక్టర్లుగానీ పట్టించుకుంటున్న పాపన పోవడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఆదివారం రాత్రి మురుగు నీరు ట్యాంక్‌ను శుభ్రం చేయడం కోసం మ్యాన్ హోల్లోకి దిగి ఐదుగురు కూలీలు మరణించడం పట్ల ఢిల్లీ బీజేపీ, ఆప్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయిగానీ జరిగిన ఘోరం పట్ల ఏ పార్టీ అంత చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. అయితే జరిగిన దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తానని హామీ ఇచ్చిన అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కేసులో ఓ సూపర్వైజర్ను మాత్రమే అరెస్ట్ చేసింది. ఇదేమీ మారుమూల జరిగిన మామూలు దుర్ఘటన ఎంతమాత్రం కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన డీఎల్ఎఫ్ కాపిటల్ గ్రీన్స్ రెసిడెన్షియల్ ఫేస్–2 సెక్షన్ (మోతీ నగర్)లో జరిగింది. చనిపోయిన కార్మికులంతా హౌజ్ కీపింగ్ సిబ్బందిని సరఫరా చేసే జేఎల్ఎల్ సంస్థకు చెందిన వారు. వారిలో ఒక కార్మికుడు ఇంతవరకు ఒక్కసారి కూడా పారిశుద్ధ్యం పనిచేసి ఎరగడని అతని సోదరి తెలియజేసింది. మరణించిన మిగతా నలుగురి కార్మికులకు కూడా మురుగునీరును శుభ్రం చేసిన అనుభవం అంతగా లేదని కాలనీవాసులు చెబుతున్నారు. పైగా పారిశుద్ధ్యం పనిలోకి దిగే ముందు వారు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. గత ఐదేళ్ల కాలంలో ఢిల్లీలో 2,403 మంది పారిశుద్ధ్య కార్మికులు ఇలా మరణించారంటే పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్లకు కార్మికుల ప్రాణాల పట్ల ఉన్న పట్టింపు ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. అనుసరించాల్సిన మార్గదర్శకాలు డ్రైనేజీ చాంబర్ల వద్ద, సెప్టిక్ ట్యాంకుల్లో, మాన్హోల్స్ వద్ద యాంత్రిక వెంటీ లేటర్లు ఏర్పాటు చేయాలి. కార్మికుల ప్రాణాలకు పూర్తి భద్రత ఉన్నట్లు వారికి సైట్ మేనేజర్లు కచ్చితంగా సర్టిఫికెట్ జారీ చేయాలి. అయినప్పటికీ ప్రమాదం సంభవించి ప్రాణాలు పోయినా, గాయపడిన వారికి పూర్తి నష్టపరిహారం సైట్ మేనేజర్లు, యజమానులే చెల్లించాలి. సుశిక్షితులైన కార్మికులను మాత్రమే ఈ పనిలోకి తీసుకోవాలి. వారికి భద్రత కల్పించే యూనిఫామ్, తగిన కళ్లజోళ్లు, ప్రాణవాయువు సిలిండర్లు కల్పించాలి. వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు స్థానిక మున్సిపాలిటీలు మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. శుభ్రం చేయాల్సిన ట్యాంక్ నుంచి విష వాయువులు వెలువడుతున్నాయా, లేదా అంశాన్ని నిర్ధారించేందుకు కచ్చితంగా ఓ నిపుణుడు పనివేళలో అక్కడే ఉండాలి. కాగితాలు అంటించి సెఫ్టిక్ ట్యాంకుల్లో పడేయడం ద్వారా విషవాయువులను తెలుసుకోవచ్చు. అవి త్వరగా మండుతాయి. థానేలోని మీరా భయాండర్ మున్సిపాలిటీలో ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మరణించడంతో స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 2013, జూలైలో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన ప్రమాదం ఘటనలో ఇందులో ఏ ఒక్కటి పాటించలేదు. అయినప్పటికీ పోలీసు అధికారులు సూపర్ వైజర్‌ను మాత్రమే అరెస్ట్ చేశారు. ఉద్యోగులను సరఫరా చేసిన కాంట్రాక్టర్‌ను, డీఎల్ఎఫ్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచించినట్లు వారి నుంచి నష్ట పరిహారం వసూలు చేయడంతోపాటు వారిని చట్టపరంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు కూడా తీసుకరావాలి. -
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నలుగురు మృతి
-
విచిత్ర కొలువులు!
‘కూటి కోసం కోటి’ విద్యలు అన్నారు పెద్దలు.. అదే సూత్రం ఆధారంగా ఈ ప్రపంచంలోని ఉన్న అందరూ ఏదో ఒక పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరూ ఒకే రకమైన ఉద్యోగం చెయ్యరు, చెయ్యలేరు. కానీ, అన్ని రకాల పనులు జరిగితేనే ఈ ప్రపంచం మనుగడ సాధిస్తుంది. కొందరికి సులభమైన ఉద్యోగం దొరుకుతుంది. మరికొందరికి చాలా కష్టపడాల్సిన ఉద్యోగం రావచ్చు. మరికొందరు మీరు ఇంతకముందెప్పుడూ వినని ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. అలాంటి భిన్నమైన ఉద్యోగాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..! వాసనను గుర్తు పట్టడం రుచికరమైన భోజనం వండుతున్నా.. కుళ్లిన దుర్గంధం వెలువడ్డా..మన ముక్కు వెంటనే గుర్తిస్తుంది. ఇలాంటి వాసనలను కూడా గుర్తుపట్టే ఉద్యోగం కూడా ఉంటుందని మీకు తెలుసా? ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువే. కంపెనీలు అధిక మొత్తంలో వేతనాలు ఇచ్చి మరీ వీరిని ఉద్యోగంలోకి తీసుకుంటాయి. కంపెనీల ఉత్పత్తులను వాసనలు చూసి వాటిపై అభిప్రాయాన్ని చెప్పడం వీరి ప్రధాన విధి. టూత్‌పేస్ట్, ఔషధాలు, షాంపులు తదితర ఉత్పత్తుల్లో సువాసనలు కంపెనీలు జోడిస్తాయి. ఈ ఉద్యోగులు వాటి వాసన చూసి తగు మోతాదులో ఉందా? లేదా? అన్నది కంపెనీలకు వివరించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం చేయ్యాలంటే రసాయనిక శాస్త్రంపై తగిన పట్టు ఉండాలి. కంపెనీ దీర్ఘకాల ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకోని వీరు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. క్రైం జరిగిన ప్రదేశాన్ని శుభ్రపరిచడం హత్య జరిగిన ప్రదేశాలను చూస్తేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. కానీ అలాంటి ప్రదేశాలను శుభ్రపరిచే ఉద్యోగులు కూడా ఉంటారు. హత్యా ప్రదేశాలు, పరిశ్రమలలో ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలలో వాటిని శుభ్రపర్చడం వీరి ప్రధాన విధి. వీరంతా ఆ స్థలంలో ఉన్న రక్తం ఆనవాళ్లు, శవాలను తొలగిస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో హత్య జరిగి రోజులు లేదా నెలలు గడిచి శరీరం కుళ్లిపోయినా కూడా శవాలను తొలగించి ఆ ప్రదేశాలను శుభ్రపర్చాల్సి ఉంటుంది. తీవ్రమైన దుర్వాసన వస్తున్నా కూడా వీరు తమ విధిని నిర్వర్తిస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ఉద్యోగులు ఇనెఫెక్షన్ల బారిన పడి అనారోగ్యానికి గురౌతుంటారు. తీవ్ర భయానక పరిస్థితులు ఉండే క్రైం జరిగిన ప్రదేశాలను శుభ్రపర్చాలంటే మానసిక స్థైర్యం, రసాయన శాస్త్రంలో తగినంత జ్ఞానం కలిగి ఉండాలి. వోల్కనాలజిస్ట్ అగ్నిపర్వతాల మీద పరిశోధనలు చేసేవారిని వోల్కనాలజిస్టులు అంటారు. భయంకరమైన అగ్నిపర్వతాల వద్ద వీరు పనిచేయాల్సి ఉంటుంది. చల్లారిపోయిన అగ్నిపర్వతాలను వీరు పరిశోధిస్తారు. అందులో నుంచి వెలువడిన వివిధ వాయు, ఘన పదార్థాలను వీరు శోధిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. చెప్పాలంటే ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఉద్యోగం. అగ్నిపర్వతాల నుంచి ఆకస్మికంగా విషవాయువులు వెలువడుతుంటాయి. వాటిని పొరబాటున పీల్చినా క్షణాల్లో ప్రాణాలు పోతాయి. కానీ, సవాళ్లంటే ఇష్టపడే వ్యక్తులు ఈ ఉద్యోగాలు చేయడానికి ముందుకు రావడం విశేషం. ఇక్కడ వచ్చే ధ్వనులు, వెలువడే వివిధ వాయువులు, అగ్నిపర్వతం పేలడానికి గల కారణాలను తెలుసుకొనేందుకు వీరు పరిశోధన జరుపుతారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ నిండితే క్లీనర్స్ ద్వారా దాన్ని శుభ్రపరుస్తాం. అన్ని ఉద్యోగాల్లా దీన్ని కూడా తమ వృత్తిగా భావించి ఉద్యోగాలు చేస్తుంటారు. తీవ్రమైన దుర్గంధంతో కూడిన చెత్తను సెప్టిక్ ట్యాంక్‌నుంచి వీరు తొలగిస్తారు. అవసరమైతే వీరు సెప్టిక్ ట్యాంకులోకి దిగి పనిచేయాల్సి ఉంటుంది.ఈ పనిచేస్తున్నప్పుడు అనేక ఇ¯ŒSఫెక్షన్లు వచ్చి అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో సెప్టిక్ ట్యాంక్‌లో విడుదలయ్యే వివిధ రకాల గ్యాస్‌ల వల్ల అందులోకి దిగినవారు మరణించే పరిస్థితులు కూడా నెలకొంటాయి. ( సాక్షి స్కూల్ ఎడిషన్)