ప్రతీకాత్మక చిత్రం
గాంధీనగర్ : గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లోని సెప్టిక్‌ట్యాంక్‌ను క్లీన్ చేస్తుండగా.. ఆ హోటల్‌కు సంబంధించి ముగ్గురు సిబ్బందితో పాటు మరో నలుగురు కార్మికులు చనిపోయారు. అందులో అజయ్ వాసవ్(24), విజయ్ చౌహాన్(22), సహదేవ్ వాసవ(22)లను హోటల్ సిబ్బందిగా గుర్తించగా.. మిగిలిన నలుగురు పారిశుద్ద్య కార్మికులు ధబోయ్ ప్రాంతంలోని థువావికి చెందినవారుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై ధబోయ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే హోటల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. ఏదైనా గ్యాస్ లీకై మరణించి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment