suffocation death
-
రూ.10 అడిగితే ప్రాణం తీశాడు
ఛత్రా(జార్ఖండ్): కేవలం రూ.10 అడిగిన కుమారుడి పట్ల తండ్రి కాలయముడైన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఉన్న తండ్రి.. కుమారుడిని ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఛత్రా జిల్లాలోని వశిష్ట్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరేలీబర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్టేషన్ ఇన్చార్జ్ గులామ్ సర్వర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 48 ఏళ్ల బిలేశ్ భుయాన్ తన భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు కుమార్‌తో కలిసి జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం తొమ్మిదిగంటలకే భుయాన్, అతని భార్య ఇద్ద రూ పూటుగా తాగి ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. అదే సమయంలో ఓ పది రూపాయలు ఇవ్వు నాన్నా అంటూ బాలుడు పప్పు కోరాడు. అప్పటికే కోపంతో ఉన్న భుయాన్ మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. తీవ్ర ఆవేశంతో కుమారుడిని ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అదే సమయానికి ఇటుక బట్టీలో పనిచేసే కూతురు పని ముగించుకుని ఇంటికి వచ్చింది. తమ్ముడి మరణం చూసి పొరుగువారిని కేకలేసి పిలిచింది. విషయం తెల్సుకున్న పోలీసులు వెంటనే తండ్రిని అరెస్ట్‌చేశారు. -
సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరుపులు.. కాసేపటికే ముగ్గురూ..
గాంధీనగర్: సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి అందులోకి దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడాక ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గుజరాత్ భరూచ్ జిల్లాలోని దహేజ్‌లో జరిగింది. ఈ ముగ్గురు కార్మికులు స్థానిక పంచాయతీ కార్యాలయంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్లి చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులను గల్సిన్‌భాయ్ మునియా(30), పరేశ్ కతారా(31), అనిల్ పర్మార్(24)గా గుర్తించారు. వీరంతా దహేజ్ వాసులే కావడం గమనార్హం. సెప్టిక్‌ట్యాంకులోకి దిగిన వెంటనే తమకు ఊపిరాడటం లేదు సాయం చేయాలని ముగ్గురు కార్మికులు అరుపులు, కేకలు పెట్టినట్లు పోలీసులు వివరించారు. అక్కడున్నవారు వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ముగ్గురు కార్మికులను బయటకు తీశారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వీరు చనిపోయారని తెలిపారు. సెప్టిక్ ట్యాంక్‌లో విషవాయువు పీల్చడం వల్లే కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ముగ్గురూ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే సెప్టిక్ ట్యాంకులోకి దిగినట్లు స్థానికులు వెల్లడించారు. గుజరాత్లో పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం రెండు వారాల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 23న రాజ్‌కోట్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో గత రెండేళ్లలో మొత్తం 11 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం ఆందోళన కల్గిస్తోంది. చదవండి: హైదరాబాద్‌లో కాల్పులు.. ఒకరి మృతి -
బాత్రూమ్లో గీజర్ నుంచి గ్యాస్ లీకై నవ వధువు మృతి
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్లో గీజర్ నుంచి లీక్ అయిన గ్యాస్ పీల్చుకొని ఊపిరాడక నవ వధువు మృత్యువాతపడింది. వివరాలు.. ఇటీవల వివాహం అయిన వధువు స్నానం చేసేందుకు అత్తవారింట్లోని బాత్రూమ్లోకి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ యువతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్రూమ్ డోర్ తట్టి చూడగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాత్రూమ్ తలుపులు పగలగొట్టగా.. ఓ మూలన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్ గీజర్‌లో నుంచి వెలువడిన కార్బర్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే వధువు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమని.. పీల్చిన కొద్ది నిమిషాల్లోనే ఊపిరాకడ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గ్యాస్ గీజర్‌ను ఉపయోగించిన ప్రతిసారి దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది ప్రాణాంతకమైనది. వీటిని బాత్రూమ్లో ఏర్పాటు చేసుకోకుండా ఉంటేనే మంచింది. వెంటిలేషన్ బాగా ఉండే ప్రదేశాల్లోనే ఫిట్ చేయాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ గీజర్ల నిర్వహణ ఖర్చు ఎలక్ట్రిక్ గీజర్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే దేశంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంట్లో గ్యాస్ గీజర్లను ఉపయోగించడం ప్రమాదకరమనే విషయం తెలిసిందే. ఇవి విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ పీల్చిన కొద్ది నిమిషాల్లోనే కళ్లు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయిదు నిమిషాలు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడం వల్ల తల తిరగడం.. అంతకంటే ఎక్కువ సమయం పీలిస్తే స్పృహ కోల్పోయి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది. శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల పాటు యాంటీ సీజర్ మందులతో చికిత్స చేయవచ్చు. గ్యాస్ సీజర్‌ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. 1. బాత్రూమ్, వంటగది వంటి మూసివేసిన ప్రదేశాలలో గ్యాస్ గీజర్‌ను ఎప్పుడూ ఇన్స్టాల్ చేయవద్దు. 2. ఒకవేళ బాత్రూమ్, కిచెన్ వంటి ప్రదేశాల్లో వీటిని అమర్చినట్లయితే తగినంత వెంటిలేషన్ ఉండాలి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. 3. గ్యాస్ గీజర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఏదైనా లీకేజీ లేదా మరేదైనా సమస్య ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి. 4. గ్యాస్ గీజర్‌ను రోజంతా వినియోగించడం మంచిది కాదు. నిరంతరాయంగా టిని వినియోగిస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువసార్లు ఉపయోగించాల్సి వస్తే వినియోగించే ముందు తగినంత గ్యాస్ ఉండాలి. 5. బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లే ముందే గ్యాస్ గీజర్‌ను స్విచ్ ఆఫ్ చేయడం మంచింది.. దీంతో స్నానం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండదు. 6. కార్భన్ మోనాక్సైడ్ రంగు, రుచి లేని కారణంగా గీజర్‌లో గ్యాస్ లీకవడాన్ని గుర్తించడం అంత సులభం కాదు. వీటిని పీలుస్తున్న విషయం కూడా మనకు తెలియదు. 7. గ్యాస్ గీజర్‌లో లీకేజీ ఉంటే, దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు బయటకు వస్తుంది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. 8. కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదకరమైనది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. ఇది పీల్చిన తర్వాత నిమిషాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. 9. గ్యాస్ గీజర్ కారణంగా ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే, బాధితుడిని వీలైనంత త్వరగా బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లాలి. దీని వల్ల అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. తరువాత ఆసుపత్రికి తరలించాలి. -
ఘోరం: గాఢ నిద్రలో ఉండగా అగ్నిప్రమాదం...మహిళ మృతి
గురుగ్రామ్: గాఢ నిద్రలో ఉండగా తొమ్మిదో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఊపిరాడక 65 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఈ ఘటన గురుగ్రామ్‌లోని ఎంజీ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్ సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఎస్సెల్ టవర్లోని ఓర్లోవ్ కోర్ట్2లో ఓ ఫ్లాట్‌లోని తొమ్మిదో అంతస్తులో తెల్లవారుజామున 3.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఆ ఫ్లాట్‌లో నివశిస్తున్న కుటుంబ సభ్యులు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఐతే పొగతో ఫ్లాట్ అంత కమ్మేయడంతో మెలుకువ వచ్చిన వినయ్ కుమారి, ఆమె తండ్రి వెంటనే సెక్యూరిటీ గార్డుకి, అగ్నిమాపక సిబ్బందికి వెంటనే ఫిర్యాదు చేశారు. దీంతో సమయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వినయ్ కుమారిని, ఆమె తండ్రిని మొదటగా రక్షించారు. ఐతే ఆమె తల్లి పుష్ప గుప్తా మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో ఆమె తల్లి పుప్ప గుప్తాను రక్షించేందుకు అగ్రిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించారు. ఐతే ఆమె అప్పటికే ఫ్లాట్ అంతా నిండిపోయిన పొగ కారణంతో ఊపిరాడక బాతురూం వద్ద ఉన్న బాల్కనీలో స్ప్రుహ తప్పి పడిపోవడంతో రెస్క్యూ సిబ్బందికి గుర్తించడం ఆలస్యమైంది. దీంతో ఆమెను వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆమె ఊపిరాడక చనిపోయినట్లు వైద్యలు ధృవీకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, ఎల్ఈడీ బల్బుతో మొదలై మొత్తం ఫ్లాట్ అంతా మంటలు వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: కొంపముంచిన ఫైర్ హెయిర్ కట్... నిప్పుతో చెలగాటం వద్దు!) -
ముగ్గురిని మింగిన బావి పూడ్చివేత
సాక్షి, సిర్పూర్: కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కారెం మహేష్, గాదిరెడ్డి రాకేష్, మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలంలోని శికిరం గ్రామానికి చెందిన సొక్కల శ్రీనివాస్‌లు బావిలో దిగి ఊపిరాడక బుధవారం మృతి చెందారు. ఆరుగంటల పాటు అధికారులు శ్రమించి జేసీబీ, ప్రోక్లియిన్‌లతో బావి చూట్టు తవ్వకాలు జరిపారు. బావిలో ఆక్సిజన్ నింపి బావిలోకి దిగి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం బావి చుట్టూ తవ్విన మట్టిని జేసీబీల సహాయంతో పూడ్చివేశారు. రాత్రి కావడంతో పూర్తిగా పూడ్చివేత పనులు నిర్వహించలేదు. బావిని పూర్తిగా పూడ్చివేస్తామని అధికారులు తెలిపారు. కంటతడి పెట్టిన ముత్తంపేట ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బంధువులు బావిలో దిగి మృతి చెందడంతో గ్రామంలోని యువకులు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బావిలో దిగి ముగ్గురు మృతి చెందిన వార్త మండలంలో సంచలనం రేపడంతో గురువారం ఉదయం యువకుల అంత్యక్రియల్లో మండలంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి వారి మృతదేహాలకు నివాళ్లు అర్పించారు. ఇద్దరు యువకుల మృతదేహాలకు ఒకేసారి గ్రామంలో చివరి అంతిమ యాత్ర నిర్వహించడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. అందరితో కలిసి మెలిసి ఉండే యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు బోరునా విలపించారు. -
చికెన్ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి
లక్ష్మణచాంద: ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ కు చెందిన పెద్దలింగన్న (57) భోజనం చేస్తుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మృతిచెందాడు. లింగన్న గ్రామంలోనే పశువుల కాపారిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం పశువులకు కాపాలాగా వెళ్లాల్సి ఉందని తొందర తొందరగా భోజనం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయూడు. లింగన్నకు భార్య, ఓ కొడుకు ఉన్నారు.