గురుగ్రామ్: గాఢ నిద్రలో ఉండగా తొమ్మిదో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఊపిరాడక 65 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఈ ఘటన గురుగ్రామ్‌లోని ఎంజీ రోడ్డులోని ఒక అపార్ట్‌మెంట్ సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఎస్సెల్ టవర్‌లోని ఓర్లోవ్ కోర్ట్2లో ఓ ఫ్లాట్‌లోని తొమ్మిదో అంతస్తులో తెల్లవారుజామున 3.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఆ ఫ్లాట్‌లో నివశిస్తున్న కుటుంబ సభ్యులు మంచి గాఢ నిద్రలో ఉన్నారు.
ఐతే పొగతో ఫ్లాట్ అంత కమ్మేయడంతో మెలుకువ వచ్చిన వినయ్ కుమారి, ఆమె తండ్రి వెంటనే సెక్యూరిటీ గార్డుకి, అగ్నిమాపక సిబ్బందికి వెంటనే ఫిర్యాదు చేశారు. దీంతో సమయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వినయ్ కుమారిని, ఆమె తండ్రిని మొదటగా రక్షించారు. ఐతే ఆమె తల్లి పుష్ప గుప్తా మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో ఆమె తల్లి పుప్ప గుప్తాను రక్షించేందుకు అగ్రిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించారు.
ఐతే ఆమె అప్పటికే ఫ్లాట్ అంతా నిండిపోయిన పొగ కారణంతో ఊపిరాడక బాతురూం వద్ద ఉన్న బాల్కనీలో స్ప్రుహ తప్పి పడిపోవడంతో రెస్క్యూ సిబ్బందికి గుర్తించడం ఆలస్యమైంది. దీంతో ఆమెను వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆమె ఊపిరాడక చనిపోయినట్లు వైద్యలు ధృవీకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, ఎల్‌ఈడీ బల్బుతో మొదలై మొత్తం ఫ్లాట్ అంతా మంటలు వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు.
(చదవండి: కొంపముంచిన ఫైర్ హెయిర్ కట్... నిప్పుతో చెలగాటం వద్దు!)
Comments
Please login to add a commentAdd a comment