విజయరాంపురంలో కల్వర్టు కింద ఉన్న పూడికను తొలగిస్తున్న సర్పంచి బూరి మధుసూదనరావు
సాక్షి, విజయనగరం : శ్లాబు కల్వర్టు కింద మురుగునీరు నిల్వ ఉండకుండా పూడికను తొలగిస్తున్నది గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడో, వేతనదారుడో అనుకుంటే పొరపాటే. శ్లాబు కల్వర్టు కింద మురుగునీరు నిల్వ ఉండకుండా అడ్డుకున్న చెత్తను తొలగిస్తున్నది విజయరాంపురం (బూరిపేట) పంచాయతీకి సర్పంచిగా ఎన్నికైన బూరి మధుసూదనరావు. వీధి కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా గురువారం తానే స్వయంగా కల్వర్టులో దిగి పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి గ్రామస్తులతో శభాష్ అనిపించుకున్నారీయన.
గ్రామస్తులంతా సర్పంచిని స్ఫూర్తిగా తీసుకొని ఎవరి ఇంటి వద్ద ఉన్న కాలువలను నిత్యం శుభ్రం చేసుకుంటే దోమలు వ్యాప్తిని అరకట్టి, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు కదా. మరెందుకు ఆలస్యం నడుం బిగిద్దామంటోంది ఆ గ్రామంలోని యువత.
– తెర్లాం
Comments
Please login to add a commentAdd a comment