
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జనగాం: కళ్లు తెరిచి వారం రోజులు కూడా కాలేదు. కానీ నిండు నూరేళ్లు నిండిపోయాయి.. కాదు కాదు నింపేశారు. ఎవరు చేశారో తెలీదు కాని ఈ ప్రపంచంలోకి వచ్చిన వారం రోజులకే ఆ పసిప్రాణాన్ని మురికి కాలువలో కలిపేశారు.
వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లాలో మరో దారుణం జరిగింది. కళ్లు తెరిచి వారం రోజులు కాకుండానే రోజుల వయసున్న పసిపాప మృతదేహం మురికి కాలువలో కనిపించింది. పాప చేతికి ఉన్న ట్యాగ్‌పై నవనీత, నర్సింహులు అనే పేర్లు ఉన్నాయి. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment