ఇంకా అలాగే..
తొలగని గాలివాన కష్టాలు
అంధకారంలో పలు కాలనీలు
సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో తలెత్తిన పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. జీహెచ్‌ఎంసీ ప్రధాన రహదారులకు ప్రాధాన్యమిచ్చి పనులు చేసినప్పటికీ, కాలనీలు, బస్తీలు, సబ్‌లైన్లలో కూలిన చెట్లను ఇంకా తొలగించలేదు. ఆయా విభాగాల మధ్య సమన్వయలేమి వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కూలిన చెట్లు తొలగిస్తే కానీ తాము విద్యుత్ లైన్లు బాగుచేయలేమని విద్యుత్‌శాఖ సిబ్బంది వెనుదిరుగుతున్నారు.
కూలిన భారీ చెట్ల తరలింపు పనులు బైలైన్లలో ఇంకా పూర్తికాలేదు. దాంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం వచ్చిన గాలివాన వల్ల ఏర్పడ్డ ఇబ్బందులపై శుక్ర, శనివారాల్లో జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు 564 ఫిర్యాదులు అందాయి. వాటిలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తదితరమైనవి ఉన్నాయి. కాగా, మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాజేంద్రనగర్‌లోని ఇబ్రహీంబాగ్‌లో ప్రజలు ఆదివారం స్థానిక సబ్‌స్టేష న్ ముందు ఆందోళనకు దిగారు.
అందిన ఫిర్యాదుల్లో ప్రధానమైనవి..
కూలిన చెట్లు : 266
విద్యుత్‌లేని ప్రాంతాలు : 176
కూలిన విద్యుత్ స్తంభాలు : 47
డ్రైనేజి సమస్య ఉన్న ప్రాంతాలు : 16