శ్రమ పాఠం!
శ్రమ పాఠం!
Published Sat, Jul 1 2017 11:02 PM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM
బురదలో కాలు పెట్టాలంటే వెనకడుగు వేస్తాం. మురుగు నీరు కనిపిస్తే పక్కకు తప్పుకుంటాం. కంపు వాసన వస్తే.. ముక్కు మూసుకుని పరుగు తీస్తాం. అలాంటిది.. ‘కంపు’రం పుట్టించే మురుగు మధ్య సాగుతున్న పోరాటం ఆవేదనా భరితమే. చుట్టుపక్క పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోలేని సోమరులకు వీరి జీవనం ఓ పాఠం. పీకల్లోతు బురద.. చిమ్మచీకటి అలుముకున్న సొంరంగాలు.. తొనుకుబెనుకు లేకుండా శ్రమించే శ్రామికులకు ‘సాక్షి’ సలాం.
- జిల్లా కేంద్రంలోని కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపునకు కాకినాడకు చెందిన 30 మంది కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీల్లో వీరు పడుతున్న శ్రమను చూసి నగర ప్రజలు ఆవేదనా భరిత హృదయాలతో అక్కడి నుంచి భారంగా ముందుకు కదులుతున్నారు.
ఫొటోలు: జి.వీరేష్
Advertisement