చిన్నారిని మింగిన మురికి కాల్వ
ఒక్కగానొక్క కుమార్తె. ఈనెల 1వ తేదీన మూడో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ ఆనందం మరిచిపోకముందే చిన్నారి లోకం విడిచింది.
– మురుగు నీరు వెళ్లకుండా అడ్డేసిన వ్యక్తి
– ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
– కాల్వలో అధికంగా నీరు ఉండటంతో చిన్నారి మృతికి కారణం
ఎమ్మిగనూరు రూరల్: ఒక్కగానొక్క కుమార్తె. ఈనెల 1వ తేదీన మూడో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ ఆనందం మరిచిపోకముందే చిన్నారి లోకం విడిచింది. చిన్నారి ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న మురికి కాల్వ పడి మతి చెందిన సంఘటన ఎమ్మిగనూరులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక సంజీవయ్య నగర్‌కు చెందిన నాగరాజు, సుధ దంపతులకు పల్లవి(3) ఒక్కగానొక్క కుమార్తె. భార్త కార్పెంటర్ పనికి వెళ్లగా భార్య కుమార్తె కోసం ఇంటి వద్దనే ఉండిపోయింది. ఆమె ఇంటిలో పని చేస్తుండగా చిన్నారి ఆడుకునేందుకు బయటకు వచ్చింది. కొద్దిసేపటికి పనికి వెళ్లిన నాగరాజు ఇంటికి చేరుకున్నాడు. కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లలో గాలించినా లేకపోవడంతో అనుమానంతో ఇంటి ముందు ఉన్న మురికి కాల్వలో చూశాడు. కుమార్తెకు వేసిన గౌను కనిపించడంతో కాలువలో దిగి చూడగా అప్పటికే చిన్నారి మతి చెందింది. కుమార్తె మతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే పాప ప్రాణం తీసింది:
నాగరాజు ఇంటి మీదుగా వెళ్తున్న మురికి కాల్వ నీరు ముందుకు వెళ్లకుండా ఓ వ్యక్తి తన స్థలంలో రెండు రోజుల క్రితం అడ్డుకట్ట వేశాడు. దీంతో నీరంతా కాల్వలోనే నిలిచిపోయింది. విషయాన్ని స్థానికులు మున్సిపల్, ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో చిన్నారి మతికి కారణమైంది. తమ బిడ్డ మతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని చిన్నారి తల్లిదండ్రులు విలపిస్తున్నారు.