తెలంగాణ సర్వేపై కేంద్ర హోం శాఖ ఆరా | Union Home Ministry ask Telangana Survey details | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్వేపై కేంద్ర హోం శాఖ ఆరా

Aug 13 2014 12:47 PM | Updated on Aug 11 2018 7:54 PM

తెలంగాణ సర్వేపై కేంద్ర హోం శాఖ ఆరా - Sakshi

తెలంగాణ సర్వేపై కేంద్ర హోం శాఖ ఆరా

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది.

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. సర్వే వివరాలు తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఒకే రోజు సర్వే నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వానికి పలువురు ఎంపీల ఫిర్యాదు చేశారు. సర్వే రోజున అందరూ ఇంటి వద్దే ఉండాలని చెప్పడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్రానికి ఎంపీలు తెలిపారు. దీంతో కేంద్ర హోంశాఖ సర్వే వివరాలు కోరింది.

ఈనెల 19న ప్రజల సమగ్ర వివరాలు సేకరించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంటివద్ద లేని వారి వివరాలు నమోదు చేయబోయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement