తెలంగాణ, ఏపీల కొట్లాట ఆపండి! | Rajnath Singh Asks Home Secretary to Stop Infighting Between Andhra Pradesh, Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీల కొట్లాట ఆపండి!

Published Wed, Jul 2 2014 2:20 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

తెలంగాణ, ఏపీల కొట్లాట ఆపండి! - Sakshi

తెలంగాణ, ఏపీల కొట్లాట ఆపండి!

* సీఎస్‌లతో సమావేశం ఏర్పాటుచేయండి
* కేంద్ర హోం కార్యదర్శికి రాజ్‌నాథ్ ఆదేశాలు
 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరుగుతున్న కొట్లాటను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాలను సమన్వయపరిచేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం కేంద్ర హోం కార్యదర్శి అనిల్‌గోస్వామిని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో భేదాభిప్రాయాలు చోటుచేసుకుంటున్నాయని సమాచారం అందిన నేపథ్యంలో జోక్యం చేసుకునేందుకు కేంద్రం ఉపక్రమించింది.

ముఖ్యంగా తాగు, సాగునీరు, విద్యుత్తు సరఫరా, ఉద్యోగుల పంపిణీ, పురపాలన సంబంధిత అంశాల్లో జగడాలు వస్తున్నాయని కేంద్రం గ్రహించింది. ఈ నేపథ్యంలో వీటిని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సాధ్యమైనంత త్వరగా ఒక సమావేశం ఏర్పాటుచేయాలని హోంమంత్రి ఆదేశించారు. ఈ సమావేశం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకునేలా, ప్రస్తుత జగడాలు పెద్దవికాకుండా చూడాలని, ఆయా అంశాలపై రెండు రాష్ట్రాల నేతలు రెచ్చగొట్టుకునే ధోరణి పెరిగిపోకుండా నివారించాలని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement