కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన గురువారం సమావేశమైన అత్యున్నత స్థాయి కమిటీ ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాలకు జాతీయ విపత్తు సహాయక నిధి(ఎన్డీఆర్‌ఎఫ్) నుంచి నిధుల మంజూరుకు ఆ మోదం తెలిపింది.
ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు మంజూరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన గురువారం సమావేశమైన అత్యున్నత స్థాయి కమిటీ ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాలకు జాతీయ విపత్తు సహాయక నిధి(ఎన్డీఆర్‌ఎఫ్) నుంచి నిధుల మంజూరుకు ఆ మోదం తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో కరువు, ప్రకృతి విపత్తులపై కేంద్ర బృందం ఇచ్చిన నివేదికల మేరకు మొత్తంగా రూ.5,020.64 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. 4,979 కోట్ల మేర ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులతోపాటు జాతీయ గ్రామీణ తాగునీటి పథకంకు సంబంధించి రూ.40.67 కోట్లు ఉన్నాయి. ఏపీకి రూ.584.21కోట్లు,తెలంగాణకు రూ.314.22 కోట్లు ఈ కమిటీ మంజూరుచేసింది.