తెలంగాణకు మొదటి నుంచి బీజీపీ మద్దతు ఉందని అంబర్ పేట బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ : తెలంగాణకు మొదటి నుంచి బీజీపీ మద్దతు ఉందని అంబర్ పేట బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తో కలిసి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. భేటీ అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరామన్నారు.
తెలంగాణకు కేంద్రం సహకారం ఉంటుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారని ఆయన తెలిపారు. పోలవరం ముంపు మండలాలు తెలంగాణలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మారిస్తే రెండు రాష్ట్రాలకు మంచిదని రాజ్నాథ్ సింగ్ చెప్పినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. తమ విజ్ఞప్తులకు రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.