'విభజన చట్టం ప్రకారమే సంస్థల విభజన' | dividing will be done based on Reorganisation act, says rajnath singh | Sakshi
Sakshi News home page

'విభజన చట్టం ప్రకారమే సంస్థల విభజన'

Published Tue, Apr 11 2017 2:45 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

'విభజన చట్టం ప్రకారమే సంస్థల విభజన' - Sakshi

'విభజన చట్టం ప్రకారమే సంస్థల విభజన'

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టం పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థలను చట్ట ప్రకారమే విభజిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. పదో షెడ్యూల్‌లో 142 ప్రభుత్వ రంగ సంస్థల విభజనలో తెలంగాణకు న్యాయం చేయాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ను టీఆర్‌ఎస్‌ ఎంపీలు కోరారు. ఈ మేరకు పార్టీ లోకసభా పక్షనేత జితేందర్‌రెడ్డి ఆధ్వర్యం లో ఎంపీలు కె.కవిత, బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్‌ సోమవారం రాజ్‌నాథ్‌ను పార్లమెంటులో కలసి విజ్ఞప్తి చేశారు.  ఏపీ విభజన చట్ట ప్రకారమే సంస్థల విభజన జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement