
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఉన్న రోహింగ్యా ముస్లింలను స్క్రీనింగ్ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. వీరిలో అధికులు ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాలొన్నారని తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యాలు తబ్లిగీ జమాత్ తర్వాత హరియాణా ఇజ్తెమాకు కూడా వెళ్లినట్లు సమాచారం ఉందని తెలిపింది. ఢిల్లీలోని శ్రమ్ విహార్, షహీన్ భాగ్ రోహింగ్యాలు తబ్లిగీకి హాజరైన తర్వాత తిరిగి తమ శిబిరాలకు రాలేదని వెల్లడించింది. రోహింగ్యా ముస్లింలను గుర్తించి స్క్రీనింగ్ చేయాలని, వారితో కలిసిన వారిని క్వారైంటన్‌లో ఉంచాలని ఆదేశించింది. కాగా, దేశంలో కోవిడ్-19 సోకి ఇప్పటివరకు 452 మంది చనిపోయారు. మొత్తం 13,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ఆ రోహింగ్యాలు ఎక్కడ?)
Comments
Please login to add a commentAdd a comment