Rohingya Refugees
-
‘మా అతిపెద్ద సమస్య అదే.. భారత్ పరిష్కరించగలదు’
ఢాకా: రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి అతిపెద్ద సమస్యగా మారారని పేర్కొన్నారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. వారిని తిరిగి స్వదేశానికి పంపించేందుకు అంతర్జాతీయ సమాజాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. లక్షలాది మంది శరణార్థులు దేశంలో ఉండటం వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించటంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని నమ్ముతున్నట్లు చెప్పారు హసీనా. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘రోహింగ్యాల సమస్య అతిపెద్ద భారమని మాకు తెలుసు. భారత్ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో చర్చలు జరుపుతున్నాం. వారిని తిరిగి పంపించేందుకు వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. మానవీయ కోణంలోనే వారికి ఆశ్రయం కల్పించాం. కొవిడ్ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించాం. కానీ, వారు ఏన్నాళ్లుంటారు. అందుకే వారిని క్యాంపులో ఉంచాం. అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు మత్తు పదార్థాలు, మహిళల అక్రమ రవాణలకు పాల్పడుతున్నారు. వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే మాకు, మయన్మార్‌కు అంత మంచిది. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్, యూఎన్వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నాం. కానీ, భారత్ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను’ అని షేక్ హసీనా పేర్కొన్నారు. తీస్తా నది జలాల పంపకాల అంశలో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సమన్వయంపై ప్రశ్నించగా.. తీస్తా నది విషయంలో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. భారత ప్రధాని కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తమ విద్యార్థులు పలువురిని భారత్ స్వస్థలాలకు చేర్చిందన్నారు. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ మైత్రి రూపంలో సహాయపడిందని గుర్తు చేసుకొన్నారు. హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్‌లో అధికారిక పర్యటన జరపనున్నారు. ఇదీ చదవండి: ‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’..బంపరాఫర్ ఇచ్చిన ప్రభుత్వం! -
రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: రోహింగ్యా శరణార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటనపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయన ప్రకటనను తోసిపుచ్చింది. రోహింగ్యాలకు అటువంటి హామీలేమీ లేవని తేల్చి చెప్పింది. రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని తెలిపింది. న్యూఢిల్లీలోని బక్కర్‌వాలాలో రోహింగ్యా శరణార్థులకు ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను అందించడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. అక్రమ విదేశీ శరణార్థులైన వారికి ఎలాంటి సౌకర్యాలు ప్రకటించలేదని స్పష్టం చేసింది. India has always welcomed those who have sought refuge in the country. In a landmark decision all #Rohingya #Refugees will be shifted to EWS flats in Bakkarwala area of Delhi. They will be provided basic amenities, UNHCR IDs & round-the-clock @DelhiPolice protection. @PMOIndia pic.twitter.com/E5ShkHOxqE — Hardeep Singh Puri (@HardeepSPuri) August 17, 2022 కాగా, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థులకు పక్కా ఇళ్లు, భద్రత కల్పిస్తామని గృహ, పట్టణ వ్యవహరాలశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. వారిని ఔటర్ ఢిల్లీలోని బక్కర్‌వాలాలోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) అర్ట్‌మెంట్‌లకు తరలిస్తామని పేర్కొన్నారు. అలాగే వారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే, ఆయన ప్రకటనపై స్పందించిన కేంద్రం, అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిపింది. చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు With respect to news reports in certain sections of media regarding Rohingya illegal foreigners, it is clarified that Ministry of Home Affairs (MHA) has not given any directions to provide EWS flats to Rohingya illegal migrants at Bakkarwala in New Delhi. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) August 17, 2022 ‘రోహింగ్యాలను కొత్త ప్రదేశానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇప్పటికే విదేశాంగ శాఖ ద్వారా సంబంధిత దేశంతో వారి బహిష్కరణ విషయాన్ని చర్చిస్తున్నందున.. రోహింగ్యాలు ప్రస్తుతం ఉన్న మదన్‌పూర్ ఖాదర్, కాళింది కుంజ్ ప్రదేశాల్లో కొనసాగేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. చట్టప్రకారం రోహింగ్యా శరణార్థులను బహిష్కరించే వరకు డిటెన్షన్ సెంటర్లో( నిర్బంధ కేంద్రం) ఉంచుతాం. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం శరణార్థులు ఉన్న ప్రదేశాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించలేదు.. వెంటనే ఆ పనిచేయాలని ఆదేశించాం.’ అని హోం మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. Rohingya Illegal Foreigners Press release-https://t.co/eDjb9JK1u1 pic.twitter.com/uKduPd1hRR — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 17, 2022 -
ఫేస్‌బుక్‌కు భారీ షాక్.. 10 లక్షల కోట్లకు దావా
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌కు భారీ షాక్ తగిలింది. రొహింగ్యా శరణార్థులు కొందరు మెటా(ఇంతకు ముందు ఫేస్బుక్) కంపెనీ ఫ్లాట్‌ఫామ్ మీద దావా వేశారు. అదీ తమ జీవితాలు నాశనం అయ్యాయని 150 బిలియన్ డాలర్ల భారీ పరిహారం కోరుతూ!. యూకే, యూఎస్‌లోని డజను కొద్దీ రొహింగ్యా శరణార్థులు.. ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా దావా వేశారు. మయన్మార్‌లో తమకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం ఫేస్బుక్ ఫ్లాట్‌ఫామ్ వేదికగానే నడిచిందని, ఆ ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఫేస్బుక్ ఘోరంగా విఫలం అయ్యిందని, పైగా తమ వర్గానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించిందనేది వాళ్ల ప్రధాన ఆరోపణ. అందుకే నష్టపరిహారం కింద మెటా కంపెనీ నుంచి 150 బిలియన్డాలర్లు(దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు పైనే) కోరుతున్నారు. యూకేకు చెందిన లీగల్ కంపెనీలు ఎడెల్సన్ పీసీ, ఫీల్డ్స్ పీఎల్‌ఎల్‌సీలు ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా ‘రొహింగ్యాల జీవితాల్ని నాశనం చేశారంటూ’ శాన్ ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా)లో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అంతేకాదు లండన్‌లోని ఫేస్బుక్ కార్యాలయానికి నోటీసులు సైతం అందించారు. ఈ మేరకు 2013లో రొహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారమైన కొన్ని ఫేస్బుక్ ప్రచారాలను కోర్టుకు సమర్పించింది. ►మయన్మార్‌లో ఫేస్‌బుక్‌కు 2 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. సమాచారాల షేరింగ్ ద్వారానే విపరీతమైన ఆదాయం వెనకేసుకుంది ఫేస్బుక్ అక్కడ. ►2017, ఆగష్టులో మిలిటరీ ఆక్రమణ సమయంలో చెలరేగిన హింస కారణంగా లెక్కకందని మరణాలు, అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. ఊళ్లకు ఊళ్లే తగలబడిపోయాయి. సుమారు ఏడున్నర లక్షల మంది రొహింగ్యాలు దేశం విడిచిపారిపోయారు. దీనింతటికి ఫేస్బుక్ ద్వారా జరిగిన ప్రచారమేనన్నది ప్రధాన ఆరోపణ. ►ఇక 2018లో ఐరాస మానవ హక్కుల దర్యాప్తు బృందం.. హింసకు ఫేస్బుక్ ద్వారా జరిగిన ప్రచారమేనని తేల్చి చెప్పారు. ►ఓ అంతర్జాతీయ మీడియా హౌజ్ చేపట్టిన దర్యాప్తులోనూ వెయ్యికిపైగా పోస్టులు, కామెంట్లు, రొహింగ్యాల మీద దాడుల ఫొటోలు బయటపడ్డాయి. ►ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు.. ఆ ప్రాంతంలో జరిగిన నేరారోపణలపై ఒక కేసు దాఖలు చేసింది. ఈ సెప్టెంబర్‌లో అమెరికా ఫెడరల్ కోర్టు.. రొహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఫేస్బుక్ అకౌంట్ల(ఆ తర్వాత ఫేస్బుక్వాటిని మూసేసింది) వివరాలను సమర్పించాలని కోరింది. ►ఈ ఏడాదిలో ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హ్యూగెన్.. అంతర్గత డాక్యుమెంట్లు లీక్ చేయడంతో పాటు పలు దేశాల్లో(మయన్మార్ విద్వేషపూరిత, హానికారక సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించింది కూడా. ►మయన్మార్ మిలిటరీ కూడా ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లతో రొహింగ్యాలకు వ్యతిరేకంగా సమాచారాన్ని వైరల్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ దావాపై ఫేస్బుక్ స్పందించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, 2018లోనే తమ వైఫల్యంపై ఒక ప్రకటన విడుదల చేసింది. మయన్మార్‌లో తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో, వ్యతిరేక ప్రసంగాల్ని అడ్డుకోవడంలో కొంచెం నిదానించిన మాట వాస్తమేనని పేర్కొంది. అంతేకాదు మయన్మార్ మిలిటరీని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుంచి నిషేధించడం కూడా కొంచెం ఆలస్యం అయ్యిందని పేర్కొంది. ►అమెరికా ఇంటర్నెట్ చట్టం సెక్షన్ 230 ప్రకారం.. యూజర్ పోస్ట్ చేసే కంటెంట్ మీద మాత్రమే ఫేస్‌బుక్‌కు నియంత్రణ ఉంటుంది. మూడో వ్యక్తి చేసే కంటెంట్‌ను నియంత్రణ చేయలేదు. అయితే ఇది బర్మీస్ చట్టాలకు(ఫారిన్ చట్టాలకు) అన్వయిస్తుందా? ఫేస్బుక్ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? రొహింగ్యాలకు అనుకూలంగా ముందుకు వెళ్తుందా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!. చదవండి: సోషల్ మీడియాను మించిన డేంజర్! -
వారికి ‘కరోనా’ స్క్రీనింగ్ చేయండి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఉన్న రోహింగ్యా ముస్లింలను స్క్రీనింగ్ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. వీరిలో అధికులు ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాలొన్నారని తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యాలు తబ్లిగీ జమాత్ తర్వాత హరియాణా ఇజ్తెమాకు కూడా వెళ్లినట్లు సమాచారం ఉందని తెలిపింది. ఢిల్లీలోని శ్రమ్ విహార్, షహీన్ భాగ్ రోహింగ్యాలు తబ్లిగీకి హాజరైన తర్వాత తిరిగి తమ శిబిరాలకు రాలేదని వెల్లడించింది. రోహింగ్యా ముస్లింలను గుర్తించి స్క్రీనింగ్ చేయాలని, వారితో కలిసిన వారిని క్వారైంటన్లో ఉంచాలని ఆదేశించింది. కాగా, దేశంలో కోవిడ్-19 సోకి ఇప్పటివరకు 452 మంది చనిపోయారు. మొత్తం 13,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ఆ రోహింగ్యాలు ఎక్కడ?) తబ్లిగీ కేసులు అనడంపై అభ్యంతరం -
రోహింగ్యాలు: జాంబియా బాటలో మాల్దీవులు..
మాలే/మాల్దీవులు: మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అమల్ క్లూనీ రోహింగ్యాల తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు వినిపించనున్నారు. రోహింగ్యాలకు అండగా నిలిచిన మాల్దీవులు ప్రభుత్వం ఈ మేరకు అమల్ క్లూనీని సంప్రదించినట్లు పేర్కొంది. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలు తమ దేశ పౌరులు కాదని, వారంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన తెగ అంటూ ఆ దేశం వారికి పౌరసత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికంగా రోహింగ్యాలపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో రోహింగ్యాలు వలసబాట పట్టి... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. రోహింగ్యాలకు మద్దతుగా... పశ్చిమాఫ్రికా దేశం జాంబియా గతేడాది నవంబరులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మయన్మార్‌లో జరుగుతున్న ఊచకోతను ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా కోర్టు మయన్మార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.(భారత్ మా మాతృదేశం అవుతుందనుకున్నాం : రోహింగ్యాలు) ఈ క్రమంలో తాజాగా మాల్దీవులు సైతం మయన్మార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయం గురించి మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ మాట్లాడుతూ... ‘‘ రోహింగ్యా ప్రజల పట్ల జరుగుతున్న అకృత్యాలకు మయన్మార్ జవాబుదారీగా ఉండాలి. రోహింగ్యాలకు రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవులు మద్దతు తెలుపుతోంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ 14వ సదస్సులో... ఈ మేరకు నిర్ణయం తీసుకుంది’’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమల్ క్లూనీని తమ న్యాయవాదిగా నియమించుకున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయంపై స్పందించిన అమల్ క్లూనీ.. ‘‘అంతర్జాతీయ న్యాయస్థానంలో మాల్దీవులుకు ప్రాతినిథ్యం వహించాలని నన్ను సంప్రదించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రోహింగ్యాల పట్ల మయన్మార్ వ్యవహరించిన తీరుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. రోహింగ్యా బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను’’ అని పేర్కొన్నారు. కాగా అమల్ క్లూనీ గతంలో మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తరఫున వాదించి.. గెలిచారు. ఆయనకు అన్యాయంగా జైలు శిక్ష విధించారని అంతర్జాతీయ న్యాయస్థానంలో నిరూపించారు. కాగా మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు యంగూన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించగా.. వారికి అమల్ క్లూనీ అండగా నిలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్ తరఫున కూడా అమల్ క్లూనీ వాదించారు.(‘ఆ జర్నలిస్టులకు క్షమాభిక్ష పెట్టాలి’) -
భారత్ మా మాతృదేశం అవుతుందనుకున్నాం : రోహింగ్యాలు
సాక్షి, ఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదాల్చడంతో మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. మయన్మార్‌లో హింస నేపథ్యంలో కట్టుబట్టలతో ఇక్కడికి వలస వచ్చామని, ఇప్పుడు ఇక్కడ కూడా స్థానం లేదంటే మేం ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు. దేశ రాజధానిలోని క్యాంపుల్లో తలదాచుకుంటున్న రోహింగ్యా ముస్లింలను మీడియా పలకరించింది. 18 ఏళ్ల రహీమా మాట్లాడుతూ.. ‘ఆరు సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు వలస వచ్చాం. ఇద్దరు సోదరులతో కలిసి దారుణ పరిస్థితుల నుంచి బయటపడ్డాం. ఇక్కడ ప్రతీరోజు ఉదయం లేచినప్పుడు బతికే ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేవాళ్లం. భారత్‌లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మమ్మల్ని వెనక్కి పంపేస్తామంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే మేం చావును కొనితెచ్చుకున్నట్టే’నని వివరించింది. భారతదేశంలో రోహింగ్యాల సంఖ్య దాదాపు 40 వేలు ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు తలదాచుకున్నారు. వీరంతా ఐక్యరాజ్యసమితి ద్వారా జారీ చేయబడిన శరణార్థి కార్డులు కలిగి ఉన్నారు. 22 ఏళ్ల సలాం మాట్లాడుతూ.. ‘ఒక రోజు ఆర్మీవాళ్లు మా ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులందరినీ చంపేశారు. తర్వాత చంపేది నిన్నేనంటూ బెదిరించారు. ఈ ఘటనతో మా ఊళ్లో ఉన్న 35 మందితో కలిసి కట్టుబట్టలతో బంగ్లాదేశ్‌కి వచ్చాం. అక్కడ నాలుగు నెలలపాటు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ ఇండియాకు వచ్చాం. మాకు మయన్మార్‌కు తిరిగి వెళ్లాలని లేదు. అక్కడికి వెళ్తే మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. కానీ, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మమ్మల్ని బలవంతంగా వెళ్లగొట్టేలా కనిపిస్తున్నాయం’టూ వివరించాడు. ఈ నెల ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రోహింగ్యాలను ప్రపంచంలోనే తమకంటూ దేశం లేని అతిపెద్ద మైనార్టీ తెగగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. మరో రోహింగ్యా కుల్సుమ్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేక దేశమంటూ లేని మేము మళ్లీ అక్కడికి(మయన్మార్) వెళ్తే అది మాకు చాలా ప్రమాదకరం. ఇండియా నాకు, నా పిల్లలకు సురక్షితంగా ఉంది. మమ్మల్ని తిరిగి పంపిస్తారనే ఆలోచనే చాలా భయంకరంగా అనిపిస్తోంద’ని వెల్లడించాడు. కాగా, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలు తమ దేశ పౌరులు కాదని, వారంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన తెగ అంటూ ఆ దేశం వారికి పౌరసత్వం నిరాకరించింది. ఈ నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న హింసాత్మక పరిస్థితుల వల్ల రోహింగ్యాలు వలస బాట పట్టారు. -
భారత్ మానవ హక్కులను కాలరాస్తోందా
సాక్షి, న్యూఢిల్లీ : ఏడుగురు రోహింగ్యా ముస్లింలను భారత ప్రభుత్వం గురువారం నాడు మయన్మార్‌కు పంపించిన విషయం తెల్సిందే. వారు 2012లో భారత్‌లో అక్రమంగా ప్రవేశించి అరెస్టయ్యారు. అప్పటి నుంచి వారు అస్సాం జైల్లోనే ఉన్నారు. వారిని వెనక్కి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంత మంది మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో వారిని గురువారం మయన్మార్‌కు సాగనంపారు. మయన్మార్‌లో 2012 నుంచే కల్లోల పరిస్థితులు నెలకొని ఉండగా, 2016లో మైనారిటీలయిన రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకంగా అక్కడ మారణ హోమం ప్రారంభమైంది. ఆ జాతిని సమూలంగా నిర్మూలించేందుకు మయన్మార్ సైన్యం నడుంగట్టింది. పర్యవసానంగా వేలాది కుటుంబాలను హత్య చేశారు. వందలాది గ్రామాలను తగులబెట్టారు. మహిళలు, పిల్లలపై సామూహికంగా హత్యలు జరిపారు. ఇక ఆ దేశంలో తలదాచుకునేందుకు కూడా చోటు లేక దాదాపు 9 లక్షల మంది రోహింగ్యాలు ఇరుగు, పొరుగు దేశాల వైపు పరుగులు తీశారు. ఈ దారణ మారణ కాండను ఐక్యరాజ్య సమితితోపాటు పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. శాంతి భద్రతల పరిస్థితిని చక్కదిద్దాలని, రోహింగ్యాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని మయన్మార్ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అప్పటి వరకు తాత్కాలికంగానైనా సరే రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని ఇరుగు పొరుగు దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీ సంఖ్యలో పరుగెత్తుకొచ్చిన రోహింగ్యాలను అటు బంగ్లా, ఇటు భారత దేశం సరిహద్దుల్లోనే నిలిపి వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏడుగురు రోహింగ్యాలను భారత ప్రభుత్వం వెనక్కి పంపించింది. మాతృ దేశంలో మారణ హోమం కొనసాగుతున్నప్పుడు వారిని అక్కడికి పంపించడం కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం ‘రిఫౌల్‌మెంట్’ను ఉల్లంఘించడమే. ఓ దేశంలో జాతుల మధ్య హింసాకాండ కొనసాగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాందిశీకులను లేదా శరణార్థులను ఆ దేశానికి పంపించకూడదన్నదే ‘రిఫౌల్‌మెంట్’ ఒప్పందం. ఈ అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ కూడా సంతకం చేసింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి హెచ్చరికలను పట్టించుకోకుండా రోహింగ్యా ముస్లింలను పంపించాలని భారత ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంది. అస్సాంలో అసలైన భారతీయ పౌరులను గుర్తించడంలో భాగంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను వేరు చేసేందుకు కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేందుకు బిల్లును తీసుకొచ్చిన (ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది) భారత ప్రభుత్వం రోహింగ్యాలను వెనక్కి పంపించడానికి కారణం వారు ముస్లింలు కావడమేనా...! చదవండి: రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’ -
రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘బంగ్లాదేశ్ వలసదారులు చెద పురుగులు. వందకోట్ల మంది చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించారు. వారంతా చెదపురుగుల్లా దేశాన్ని తింటున్నారు. ఢిల్లీలో అక్రమ వలసదారుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా, లేదా? వారిని బయటకు విసిరి పడేయాలా, వద్దా?’ అంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఢిల్లీ, రాజస్థాన్‌లో జరిగిన పలు పార్టీ ర్యాలీల్లో ఆవేశంగా మాట్లాడారు. భారత దేశంలో నేటి జనాభా దాదాపు 127 కోట్లు. వారిలో వంద కోట్ల మంది వలసదారులే అయితే మిగతా 27 కోట్ల మంది మాత్రమే అసలైన భారతీయులా? రోహింగ్యాల సమస్యకు అదే కారణం... ఆ విషయాన్ని పక్కన పెడితే ఓ జాతిని ఇతర జాతీయులపైకి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అలా రెచ్చగొట్టిన పర్యవసానంగానే నేడు రోహింగ్యా ముస్లింల సంక్షోభ సమస్య అటు మయన్మార్‌ను, ఇటు భారత్, బంగ్లాదేశ్‌లను వేధిస్తోంది. బౌద్ధ జాతీయవాద ఉద్యమానికి చెందిన బౌద్ధ మత గురువు ఆషిన్ విరత్తు, రోహింగ్య ముస్లింలను చీడ పురుగులు, పిచ్చి కుక్కలని పదే పదే పిలవడం వల్ల, మనం బలహీనులమైతే రేపు మనదేశమంతా ముస్లింలే ఉంటారంటూ మయన్మార్ హిందువులను రెచ్చ గొట్టిన ఫలితంగా ఆ దేశంలో హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఇరువర్గాలకు చెందిన వారు వేల సంఖ్యలో మరణించారు. చివరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లక్షలాది మంది రోహింగ్య ముస్లింలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి, దాదాపు లక్ష మంది భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. ఇటీవల కొంత మంది దేశాధినేతలు ఇలాంటి అమానుష, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే గ్రీస్, ఇజ్రాయెల్, అమెరికా, హంగరి, ఉక్రెయిన్, నైజీరియా దేశాల్లో అల్లర్లు చెలరేగి వేలాది మంది మరణించారు. ఓ జాతి మరో జాతి పట్ల మానవతా దృక్పథాన్ని ప్రదర్శించకుండా అమానవీయంగా వ్యవహరించడంతో దార్వన్, కాంబోడియాల్లో జాతుల సంఘర్షణలు భగ్గుమన్నాయి. బాల్కన్ యుద్ధాలు అందుకే జరిగాయి. అలాగే రువాండలోని తుత్సీలను దూహించడం వల్ల వాళ్లకు, హుతూస్కు మధ్య జాతి సంఘర్షణలు చెలరేగుతున్నాయి. 1994లో తుత్సీలను బొద్దింకలంటూ రువాండ రేడియో విమర్శించడం జాతి వైషమ్యాలకు బీజం వేసిందని ‘డేంజరస్ స్పీచ్ ప్రాజెక్ట్’ను ఏర్పాటు చేసిన సుసాన్ బెనేష్ తెలిపారు. 15 లక్షల మంది మృతి.. ఆర్మేనియా మారణకాండ అందుకే జరిగింది. ‘అర్మేనియన్లు టర్కీలోని ముస్లిం సొసైటీకి సోకిన ఇన్ఫెక్షన్. ఆశ్రయమిచ్చిన దేశ ప్రజల ఎముకల మూలుగులను తొలుచుకుతింటున్న పరాన్నభుక్కులు’ అని ఓ వర్గం వారు రెచ్చగొట్టడంతో ఇరువర్గాల మధ్య ఈ మారణ హోమం చెలరేగింది. 2015, ఏప్రిల్ నెలలో ప్రారంభమై రెండేళ్లపాటు కొనసాగిన ఈ మారణ హోమంలో 15 లక్షల మంది ప్రజలు మరణించారు. మారణ హోమం సందర్భంగా దొంగతనాలు, దోపిడీలే కాకుండా విచ్ఛల విడిగా మహిళలపై అత్యాచారాలు కొనసాగాయి. ఎన్నికలు ముగిసే వరకు అమిత్‌షా తీరు అదేనా..? ఇలాంటి మారణహోమాలు ఒక్కసారి చేసే ప్రసంగాల వల్ల తలెత్తుతాయన్నద కాదు. పదే పదే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల జరుగుతాయి. అమిత్ షా తీరు చూస్తుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు ముగిసే వరకు ఇలాగే మాట్లాడేటట్లు కనిపిస్తున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక్క రోజు ముందు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మాట్లాడుతూ ‘లెవలింగ్ ది గ్రౌండ్’ అంటూ ఆవేశంగా ఇచ్చిన ప్రసంగం ఒక వర్గాన్ని ఎంతో రెచ్చగొట్టింది. -
రోహింగ్యాలకు భారత్ చేయూత..!
సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్‌లో ఊచకోతకు గురైన రోహింగ్యా ముస్లింలకు భారత ప్రభుత్వం చేయూతగా నిలిచింది. గత ఏడాది మయన్మార్ ప్రభుత్వం, సైన్యం చేతిలో ఊచకోతకు గురైన రోహింగ్యాలు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే. బంగ్లాలో ఉంటున్న రోహింగ్యా ముస్లింలకు భారత ప్రభుత్వం తరుఫున నిత్యవసర వస్తువులను సోమవారం బంగ్లాకు పంపింది. పదిలక్షల లీటర్లకుపైగా కిరోసిన్, ఇరవై వేల కిరోసిన్ స్టవ్‌లు, ఇతర నిత్యవసర వస్తువులు రోహింగ్యాలకు చేరినట్లు బంగ్లాదేశ్‌లో భారత హై కమిషనర్ హర్ష వర్ధన్ వెల్లడించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాల బలోపేతంలో భాగంగా భారత విదేశాంగ ప్రతినిధులు వాటిని పంపినట్లు ఆయన తెలిపారు. కాగా మయన్మార్ సైన్యం రోహింగ్యాలపై దమనకాండ తరువాత అత్యధికంగా బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో సుమారు ఐదు లక్షల వరకు రోహింగ్యాలు నివాసముంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది -
హీరోయిన్‌పై విరుచుకుపడ్డ బీజేపీ నేత
లక్నో : రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రియాంక చోప్రాను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా కథనం ప్రకారం..‘రోహింగ్యాల నిజ స్వరూపం ప్రియాంక వంటి వాళ్లకు తెలియకపోవచ్చు. ఆమె అసలు వాళ్లను కలవడానికి వెళ్లాల్సింది కాదు. రోహింగ్యా ముస్లింలకు ఇక్కడ(భారత్‌లో) చోటు లేదు. అలాగే వాళ్లకు సానుకూలంగా మాట్లాడే వారికి కూడా ఇక్కడ స్థానం లేదు. రోహింగ్యాల పట్ల సానుభూతి చూపడానికి ఢాకా వెళ్లిన ప్రియాంక, ఆమె లాంటి మరెవరైనా ఈ దేశాన్ని(భారత్) విడిచి వెళ్లాల్సి ఉంటుందంటూ’ వినయ్ కతియార్ వ్యాఖ్యానించారు. యూనిసెఫ్ బాలల హక్కుల రాయబారిగా పనిచేస్తున్న ప్రియాంక.. బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్ బజార్లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ‘ఒక చిన్నారి ఎక్కడ నుంచి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. కానీ భవిష్యత్తు పట్ల నమ్మకం లేని జీవితం మాత్రం ఏ చిన్నారికి ఉండవద్దు. ప్రపంచం వారి పట్ల శ్రద్ధ చూపాలి. దయచేసి చిన్నారులకు మీ మద్దతును అందివ్వండి’ అనే మెసేజ్ పెట్టారు. అయితే ప్రియాంక చేసిన పనిని కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. ముస్లింలను పరామర్శించడమేమిటని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. -
రోహింగ్యా శిబిరానికి నేనే నిప్పు పెట్టా!
సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా శిబిరం అగ్ని ప్రమాద ఘటనలో దిగ్భ్రాంతికి గురి చేసే విషయం వెలుగు చూశాయి. అది ప్రమాదం కాదని.. శిబిరానికి తానే నిప్పు పెట్టానంటూ బీజేపీ యువ విభాగం నేత మనీష్ చండేలా ప్రకటించటం కలకలం రేపింది. దీంతో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. మనీష్‌పై ఫిర్యాదు చేశారు. అసలేం జరిగింది... నైరుతి ఢిల్లీలోని సరితా విహార్ ప్రాంతంలో ఉన్న ఓ శిబిరంలో 50 రోహింగ్యా కుటుంబాలు(సుమారు 240 మంది) ఆశ్రయం పొందుతున్నాయి. ఇది రాజధానిలోని ఏకైక రోహింగ్యా శిబిరం. ఏప్రిల్ 15 ఆదివారం తెల్లవారుజామున ఈ శిబిరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. బట్టలు, పత్రాలు మరియు ఇతర వస్తువులు అన్ని కాలిపోయాయి. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు దీనిని అగ్ని ప్రమాదంగానే భావించారు. చండేలా ట్వీట్లు... ఈ ఘటనపై స్పందిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత మనీష్ చండేలా తన ట్వీటర్లో చేసిన ట్వీట్ దుమారం రేపింది. ‘అవును.. ఆ పని చేసింది మేమే. ఇంకా చేస్తాం. రోహింగ్యాలు భారత్ వదిలి వెళ్లాల్సిందే’ అంటూ చండేలా ట్వీట్ చేశాడు. ఆపై ‘శభాష్.. మా హీరోలు మంచి పని చేశారు, ‘అవును.. రోహింగ్యా ఉగ్రవాదుల ఇళ్లను తగలబెట్టింది మేమే’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు. క్షణాల్లో ఇవి వైరల్ కావటంతో ఏఐఎంఎంఎంతోపాటు పలు సంఘాల నుంచి బెదిరింపులు, విమర్శలు వచ్చాయి. దీంతో వెంటనే చండేలా ఆ ట్వీట్లను తొలగించాడు. అయితే అప్పటికే ఆ ట్వీట్ల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. ‘మనీశ్ చండేలా అతని అనుచరులు రోహింగ్యా శిబిరాన్ని తగలబెట్టారు. పైగా ఆ విషయాన్ని గర్వంగా ట్వీటర్లో ప్రకటించాడు. ఢిల్లీ పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ కూడా తమ సభ్యుడి నిర్వాకంపై స్పందించలేదు’ అని ట్వీట్ చేశారు. My criminal complaint against Manish Chandela of BJYM who proudly boasted on social media that he & his associates burnt down the Rohingya camp. No action yet by @DelhiPolice to register case & arrest him & no action by BJP to remove him from party. State of rule of law under BJP pic.twitter.com/aVd8LDSCUO — Prashant Bhushan (@pbhushan1) 19 April 2018 -
ప్లాస్టిక్ డబ్బాలతో బతుకు పోరాటం
షా పొరిర్ ద్వీప్ : 13 ఏళ్ల నబీ హుస్సేన్. పుట్టిన ఊరు తప్ప బయటి ప్రపంచం గురించి ఏం తెలీదు. అలాంటి బాలుడు ఒక్కడే ఓ పెద్ద నదిని దాటి పొరుగు దేశానికి వలస వెళ్లాడు. అలాగని అతనికి ఈత రాదు. ఓ ప్లాస్టిక్ డబ్బా సాయంతో బతుకు జీవుడా అంటూ 2.5 మైళ్లు దాటి ప్రాణాలు రక్షించుకున్నాడు. మయన్మార్‌లో నబీ లాంటి వ్యక్తులు ఎంతో మంది ఇలా తెగించి దేశం ఒడ్డు దాటి పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కి వలస వెళ్తున్నారు. ఇలా సుమారు ఒకవారంలోనే ముప్ఫై మందికి పైగా ఇలా ఖాళీ ఆయిల్ డబ్బాల ద్వారా నఫ్ నదీ ద్వారం గుండా దేశం దాటారని బంగ్లా అధికారులు చెబుతున్నారు. వీరంతా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన షా పొరిర్ ద్వీపం(బంగ్లాదేశ్ ఆధీనంలో ఉంది)కి చేరుకున్నారు. నబీ హుస్సేన్ ఫోటో నది గుండా వచ్చే సమయంలో దేవుడా.. ఇదే నా చివరి రోజు కాకూడదు అని ప్రార్థించా. అని నబీ మీడియాకు చెబుతున్నాడు. నబీ పెద్దగా చదువుకోలేదు. దీంతో తల్లిదండ్రులు అతన్ని కూలీపనులకు పంపటం ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడి దారుణ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుటికైనా నబీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే అతన్ని తల్లిదండ్రులు బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఇలా ఒక్క నబీ తల్లిదండ్రులే కాదు.. అక్కడ ఉన్న వందల మంది తల్లిదండ్రులు తమ పిల్లను నఫా గుండా బంగ్లాదేశ్‌కు దగ్గరుండి మరీ పంపిస్తున్నారు. నాలుగు రోజులు నిద్ర, ఆకలి, దాహం(అది సముద్ర ముఖ ద్వారం దగ్గరగా ఉండటంతో ఉప్పు నీరుగా మారిపోయింది) అన్నింటిని చంపేసుకుని వారు షా పొరిర్కు చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వారి విషయంలో ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. భద్రతా సిబ్బంది అదుపులో మయన్మార్ యువత... అసలు సమస్యేంటి? కాగా, శతాబ్దాల నుంచి మయన్మార్‌లో తాము నివసిస్తున్నామని చెప్పుకుంటున్న రోహింగ్యా ముస్లింల ప్రాణాలకు ఇప్పుడు అక్కడ భద్రత లేకుండా పోయింది. రెండు నెలల క్రితం రోహింగ్యా చోరబాటుదారుల దాడి ఆరోపణలతో ఎదురుదాడి ప్రారంభించిన మయన్మార్ సైనికులు, వారికి జత కలిసిన బౌద్ధ సంఘాలు ఊచకోతకు పాల్పడ్డారు. రోహింగ్యాలపై ఉగ్రవాద ముద్ర వేసి వారిని దారుణంగా హతమార్చటం, మహిళలపై అత్యాచారాలు, వారి ఆస్తుల విధ్వంసంలాంటివి చేయటం ప్రారంభించారు. దీంతో భయకంపితులైన 6 లక్షల మంది రోహింగ్యాలు పొరుగు దేశాల వైపు పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మయన్మార్ ప్రభుత్వం కూడా వారి హక్కుల రక్షణ విషయంలో చేతులెత్తేయగా.. అందుకే ఐక్యరాజ్య సమితి మాత్రం వారికి ఆశ్రయం కల్పించాలంటూ వివిధ దేశాలకు(భారత్ సహా) విజ్ఞప్తి చేస్తోంది. -
బంగ్లాకు 5.82 లక్షల మంది రోహింగ్యాలు
జెనీవా: ఆగస్టు 25 నుంచి ఇప్పటివరకు 5,82,000 మంది రోహింగ్యా శరణార్థులు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు వలసవచ్చినట్లు ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. వీరిలో ఈ వారాంతంలో 45 వేల మంది వచ్చారని తెలిపింది. ఇంకా కొన్ని వేల మంది రోహింగ్యాలు ఆశ్రయం కోసం సరిహద్దు ప్రాంతాల వద్ద వేచి చూస్తున్నారని పేర్కొంది. వీరిలో పలువురి జాడ తెలియరాలేదని వెల్లడించింది. వలస వెళ్లి గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం కంటే వారి ఇళ్లలో ఉండేందుకే రోహింగ్యాలు మొగ్గు చూపుతున్నారని, చివరికి భద్రతా దళాల దాడులకు బలవుతున్నారని ఐరాస శరణార్థుల ఏజెన్సీ ప్రతినిధి ఆండ్రూజ్ మెహెసిక్ తెలిపారు. దుర్భల పరిస్థితుల మధ్య వారు కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. -
రోహింగ్యాల సమస్య తీవ్రమైంది
న్యూఢిల్లీ: రోహింగ్యా శరణార్థుల సమస్య అత్యంత విస్తృతమైనదని, లోతైనదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి సున్నితమైన సమస్యల పరిష్కారంలో జాతి ప్రయోజనాలు, మానవ హక్కులను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటంలో కేంద్రం పాత్ర చాలా కీలకమని అభిప్రాయపడింది. జాతి భద్రత, ఆర్థిక అంశాలు, మానవత్వం వంటి కీలకాంశాలు ముడిపడిఉన్న ఈ కేసులో జాతి ప్రయోజనాలు, మానవ హక్కుల మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. రోహింగ్యాలను వెంటనే పంపించే నిర్ణయం తీసుకోకూడదని కేంద్రానికి సూచించింది. కోర్టు లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇస్తే దీని ప్రభావం అంతర్జాతీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిరిగి పంపించి వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నవంబర్ 21 నుంచి సమగ్ర విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. ఈ మధ్యలో ఏమైనా అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయనిపిస్తే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చంది. ‘అంతర్జాతీయంగా ఈ సమస్య ప్రభావం చూపుతోంది. ఈ విషయంలో మన పాత్రను తెలుసుకోవాలి’ అని‡ మెహతా తెలిపారు. తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి ‘అందరు రోహింగ్యాలు (ముస్లింలు అయినా.. హిందువులైనా) ఉగ్రవాదులు కాదు. అలాంటప్పుడు వారిపై కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదు’ అని పిటిషనర్ల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ఫాలీ ఎస్ నారీమన్ కోర్టుకు తెలిపారు. అయితే, మానవహక్కులను కాపాడే విషయంలో ఏమాత్రం సందేహం లేదని.. కానీ దేశ భద్రత, జాతి ప్రయోజనాల అంశాలనూ దృష్టిలో ఉంచుకోవాలని కోర్టు సూచించింది. ‘చిన్నారులు, మహిళలకు ఏమీ తెలియదు. రాజ్యాంగ బద్ధ సంస్థగా దీన్ని మేం విస్మరించలేం. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని మరిచిపోదని అనుకుంటున్నాం. వారిని పంపించేయొద్దు. ఏమైనా తప్పు (జాతి భద్రతకు సంబంధించి) జరిగినట్లు తెలిస్తే చర్యలు తీసుకోండి’ అని ప్రభుత్వానికి ధర్మాసనం తెలిపింది. -
రోహింగ్యాల పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే
సాక్షి,న్యూఢిల్లీ: తమను తిరిగి మయన్మార్ పంపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోహింగ్యా ముస్లింలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 13న విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ అంశం మానవీయ కోణానికి సంబంధించినది కావడంతో తాము కేవలం చట్ట నిబంధనలకే వాదనలు అనుమతిస్తామని, ఇరు పార్టీలు భావోద్వేగాల ఆధారంగా వాదనలకు దిగరాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టంచేసింది. ఈ అంశాన్ని పరస్పర గౌరవంతో విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కోర్టుకు సహకరించేందుకు ఇరు పార్టీలు సంబంధిత పత్రాలు, అంతర్జాతీయ సమావేశాల వివరాలను తమకు అందించాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్ కోరింది. అంతకుముందు పిటిషనర్ రోహింగ్యా శరణార్ధుల తరపున సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ వైఖరితో విభేదించారు. వ్యక్తి హక్కులకు ఆర్టికల్ 32 కింద రాజ్యాంగం భద్రత కల్పిస్తున్న క్రమంలో ఈ పిటిషన్ విచారణార్హమైనదని పేర్కొన్నారు. అయితే ఈ అంశంలో భిన్నపార్శ్వాలున్న క్రమంలో దీనిపై సమగ్ర విచారణ అవసరమని, వేర్వేరుగా విచారించడాన్ని ప్రభుత్వం సమ్మతించదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. -
చిట్టగాంగ్ చేరుకున్న ఐఎన్ఎస్ ఘరియాల్
విశాఖ సిటీ: రోహింగ్యా శరణార్థుల కోసం వివిధ పదార్థాలను తీసుకెళ్లిన ఐఎన్ఎస్ ఘరియాల్ చిట్టగాంగ్ చేరుకుంది. ఈ నెల 24న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ఐఎన్ఎస్ ఘరియాల్ నౌక ద్వారా సుమారు 900 టన్నుల మెటీరియల్‌ను కేంద్ర ప్రభుత్వం తరలించింది. సుమారు 70 వేల మందికి సరిపడా రేషన్ సరుకులు, వస్త్రాలు, దోమ తెరల్ని ఐఎన్ఎస్ ఘరియాల్‌లో లోడ్ చేశారు. ఈ నౌక గురువారం చిట్టగాంగ్ చేరుకుంది. అక్కడ హార్బర్లో ఘరియాల్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం నౌక ద్వారా తీసుకొచ్చిన సామగ్రిని చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎండీ జిల్లూర్ రహ్మాన్ చౌధురికి భారత హైకమిషనర్ హర్షవర్ధన్ శ్రింగ్లా అందజేశారు. -
రోహింగ్యాల రిక్వెస్ట్ ను పట్టించుకుంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యాలు శరణార్థులు కారని.. ముమ్మాటికీ అక్రమ వలసదారులేనని భారత ప్రభుత్వం నేపథ్యంలో వాళ్ల భవితవ్యంపై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందా? అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కేంద్రం ఆరోపణలను రోహింగ్యాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో రోహింగ్యాల తరపున అఫిడవిట్ దాఖలు అయ్యింది. ‘ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐ, ఐసిస్‌లతో రోహింగ్యాలకు ఎలాంటి సంబంధాలు లేవు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్న కేంద్రం అందుకు సరైన సాక్ష్యాలను చూపించలేకపోతుంది’ అంటూ అఫిడవిట్లో పేర్కొన్నారు. తమను కూడా టిబెటన్, లంక శరణార్థలుగా గుర్తించి.. భారత్ లోనే ఆశ్రయం కల్పించాలని రోహింగ్యాలు కోరుతున్నారు. తమను దేశం నుంచి పంపించి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరారు. శరణార్థులకు, వలసవాదులకు ఉన్న తేడాలను గుర్తించాలని రోహింగ్యాలు కేంద్రానికి సూచించారు. ప్రాణ భయంతో మరో దేశానికి ఆశ్రయించేవారిని శరణార్థులుగా.. ఉపాధి కల్పన వెళ్లేవారిని వలసవాదులుగా పేర్కొంటారన్న విషయాన్ని గుర్తించాలని న్యాయస్థానానికి వారు విజ్ఞప్తి చేశారు. 40,000 మంది రోహింగ్యాల తరపున ఇప్పటికే సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదనను కోర్టు అక్టోబర్ 3కి వాయిదా వేసింది. అయితే అదే రోజు బాలల హక్కుల ప్యానెల్‌కు సంబంధించి ఓ పిటిషన్‌పై వాదనలు ఉండటంతో రోహింగ్యాల అంశం చర్చకు వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఇప్పటివరకు రోహింగ్యాలు ఎవరూ శరణార్థులుగా ఉండేందుకు దరఖాస్తు చేసుకోలేదు అని, అందుకే వాళ్లను వెనక్కి పంపనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులుగా పేర్కొంటూ రోహింగ్యాలతో జాతీయ భద్రతకు ముప్పు అంటూ కేంద్రం కూడా అఫిడవిట్దాఖలు చేసింది. -
వారు శరణార్థులు కాదు
రోహింగ్యాలు అక్రమ వలసదారులే: రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: రోహింగ్యాలు శరణార్థులు కారని, వారు అక్రమ వలసదారులని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. రోహింగ్యాలు దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారని, వారిని తప్పనిసరిగా వెనక్కి పంపించేయాలన్నారు. గురువారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నిర్వహించిన సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగించారు. రోహింగ్యాలను తమ దేశం తీసుకెళ్లేందుకు మయన్మార్ సిద్ధంగా ఉందని, అయినా మనదేశం నుంచి వారిని వెనక్కి పంపించే ప్రయత్నాలను కొందరు వ్యతిరేకించడం తగదని చెప్పారు. ‘రోహింగ్యాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ తమ వైఖరిని అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టుకు సమర్పించింది. వారు అక్రమ వలసదారులు. శరణార్థులు కారు. వారిని వెనక్కి పంపిస్తాం. శరణార్థి హోదా పొందా లంటే ఒక నిర్దిష్టమైన ప్రక్రియను అనుసరిం చాలి. కానీ వీరు దానిని అనుసరించలేదు’ అని చెప్పారు. రోహింగ్యాలు ఎవరికీ భారత్‌లో ఆశ్రయం కల్పించే అవకాశం లేదని, ఎందుకంటే వారు అక్రమ వలసదారులని స్పష్టం చేశారు. వీరిని వెనక్కి పంపే అంశంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడంలేదని చెప్పారు. ఇతర దేశాల్లోని ప్రజల గురించి ఆలోచించే కంటే ముందు దేశంలోని ప్రజల మానవ హక్కుల గురించి ఆలోచించడం మంచిదని హితవు పలికారు. మానవతా దృక్పథంతోనే..: ఎన్హెచ్ఆర్సీ రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై ఎన్హెచ్ఆర్సీ స్పంది స్తూ..రోహింగ్యాల అంశాన్ని మానవతా దృక్పథంతోనే పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పింది. అయితే రోహింగ్యాలు అక్రమ వలసదారులని, వారిని వెనక్కి పంపిస్తామన్న ప్రభుత్వ విధానంపై తాము స్పందించబో మంది. ‘రోహింగ్యాల అంశాన్ని మానవతా దృక్పథంతోనే పరిగణనలోకి తీసుకున్నాం. ప్రభుత్వ వైఖరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు స్పష్టం చేశారు. -
రోహింగ్యాల కోసం సౌదీ రాజు భారీ వితరణ
వాషింగ్టన్ : రోహింగ్యా ముస్లిం శరణార్థుల సహాయార్థం సౌదీ అరేబియా రాజు సల్మాన్ భారీ వితరణ ప్రకటించారు. 15 మిలియన్ డాలర్ల సహాయం చేస్తున్నట్లు తెలిపారు. సౌదీ నుంచి ఓ ప్రత్యేక బృందం బంగ్లాదేశ్‌కు వెళ్తుందని, అక్కడ శరణార్థుల పరిస్థితిని అంచనా వేసి, వారి కావాల్సిన అవసరాలు తీర్చుతామని, మానవతా దృక్పథంతో వారికి సహాయం చేస్తామని రాజు సల్మాన్ ప్రతినిథి అజీజ్ అల్ రబీయా చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా ప్రతినిధుల సభలో అమెరికా, భాగస్వామ్య జీసీసీ దేశాల మధ్య అమెరికా-అరబ్ సంబంధాలపై నేషనల్ కౌన్సిల్ సభ్యులతో జరిగిన సమావేశం తరువాత అల్ రబీయా ఈ ప్రకటన చేశారు. 5లక్షల మంది శరణార్థులు: అరకాన్ రోహింగియా సాల్వేషన్ ఆర్మీ తీవ్రవాదులు భద్రతా సిబ్బంది చెక్పోస్టులపై జరిపిన దాడుల్లో 12 మంది మయన్మార్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడులకు రోహింగ్యా ముస్లింలే కారణంగా భావించి సైన్యం వారిపై చర్యలు చేపట్టింది. సైన్యం జరిపిన కాల్పుల్లో సుమారు వేయి మంది ప్రాణాలు కోల్పోగా..చాలా మంది మయన్మార్‌ను వదిలి పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌కు బతుకుజీవుడా అంటూ వలసపోయారు. సుమారు 5 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వచ్చినట్లు లెక్క తేలింది. -
అక్కడికి వెళ్లడం కంటే ఇక్కడే చచ్చిపోతాం!
తిరిగి పంపించేస్తామన్న కేంద్రం తీరుపై రోహింగ్యాల ఆవేదన న్యూఢిల్లీ: బర్మాలో మేం ప్రశాంతంగా పడుకున్న రోజు ఒక్కటి కూడా లేదు. ఎప్పుడైనా ఆర్మీ వచ్చి విరుచుకుపడేది.. ఇక్కడ చెత్తకుప్ప పక్కన నివసిస్తున్నా రాత్రి ఎలా గడుస్తుందన్న ఆందోళన మాకు లేదు.. దక్షిణ ఢిల్లీ షహీన్‌బాగ్‌లో చెత్తకుప్ప పక్కన నివసిస్తున్న నూర్ ఆలం మాట ఇది. ఇక్కడ 74 రోహింగ్యా కుటుంబాలు శరణార్థులుగా జీవిస్తున్నాయి. 12మంది కుటుంబసభ్యులతో బతుకు వెళ్లదీస్తున్న నూర్ ఆలం.. ఇక్కడ పేదరికంలో ఉన్నా ఆనందంగానే ఉన్నామని చెప్తున్నారు. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యా తిరుగుబాటుదారులకు, ఆర్మీకి మధ్య ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధాన్ని తప్పించుకొని.. ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగుదేశాలకు వలస వచ్చిన వేలాదిమంది రోహింగ్యాలలో నూర్ ఆలం ఒకరు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన కిరాతకమైన తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌ను తప్పించుకొని నూర్ ఆలం బర్మాను వీడారు. ఈ రక్తపాతంలో ఆయన దూరపు కుటుంబసభ్యులంతా మృతిచెందారు. 15రోజులపాటు నడిచి బంగ్లాదేశ్ చేరుకొని.. అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవేశించారు. 'తూటా నుంచి ఎవరైతే తప్పించుకున్నారో వారే బర్మా నుంచి బయటపడ్డారు' అని నూర్ ఆలం గుర్తుచేసుకుంటారు. తాజాగా రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యాలకు, ఆర్మీకి మధ్య ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో రోహింగ్యాలను దేశంలోకి అనుమతించకూడదని, దేశంలోని 40వేల మంది శరణార్థులను తిరిగి మయన్మార్ పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. రోహింగ్యాలను తిరిగి స్వదేశానికి పంపిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై నూర్ ఆలం ఆవేదన వ్యక్తం చేశారు. 'మయన్మార్ తిరిగి వెళ్లేందుకు మాకు అభ్యంతరం లేదు. కానీ మాకో పరిష్కారం కావాలి. అది మా దేశం. మా ఇల్లు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం కంటే ఇక్కడ చావడమే ఉత్తమం' అని 41 ఏళ్ల ఆయన అన్నారు. రోహింగ్యాలను తిరిగి పంపించేయాలని కేంద్రం భావిస్తున్నప్పటికీ అది వీలుపడే అవకాశం కనిపించడం లేదు. మయన్మార్ సర్కారు రోహింగ్యాలను అసలు తమ పౌరులుగానే గుర్తించకపోవడంతో వారిని తిరిగి స్వదేశంలోకి అనుమతిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మయన్మార్‌లో రోహింగ్యాల రోదన..! -
మయన్మార్‌లో మారణకాండ
► కొత్తగా బంగ్లాకు 87 వేల మంది రోహింగ్యా శరణార్థులు ► సిద్ధంగా మరో 20వేల మంది కాక్స్‌బజార్/న్యూఢిల్లీ: మయన్మార్‌లో చెలరేగిన హింస కారణంగా గత పది రోజుల్లోనే దాదాపు 87,000 మంది రోహింగ్యా ముస్లింలు రఖైన్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి మరో 20 వేల మంది సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింస వల్ల ఈ వలసలు మరింతగా పెరిగే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది.భారీ వర్షాలకు నిలువనీడ లేక బంగ్లా ప్రభుత్వం ఏర్పరచిన శిబిరాల సమీపంలోనే రోహింగ్యాలు అందరూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ హింసలో 86 మంది హిందువులు మృతి చెందడంతో దాదాపు 500 మంది హిందువులు రోహింగ్యాలతో కలసి బంగ్లాదేశ్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్ సైన్యం దాడుల నేపథ్యంలో పదుల సంఖ్యలో రోహింగ్యాలు బుల్లెట్ గాయాలతో కాక్స్బజార్లోని సదర్ హాస్పిటల్లో చేరినట్లు వైద్యాధికారి షాహిన్ అబ్దుర్ రెహ్మన్ చౌధురీ తెలిపారు. బ్రిటిష్ వారి హయాంలో అప్పటి అవిభక్త బెంగాల్ నుంచి వెళ్లి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో స్థిరపడ్డ రోహింగ్యా ముస్లింలను పౌరులుగా గుర్తించడానికి మయన్మార్ పాలకులు నిరాకరిస్తూనే వచ్చారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 4 లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలాఉండగా, భారత్‌లో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిప్పిపంపే విషయంలో తమ అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. రోహింగ్యాలను తిప్పిపంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సవాల్ చేశారు. -
ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఉన్నా కూడా...
న్యూఢిల్లీ: రొహింగ్య ముస్లిం ప్రజల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ చొరబాటుదారులుగా పేర్కొంటూ సుమారు 40,000 మందిని తక్షణమే దేశం నుంచి పంపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ కసరత్తులు ప్రారంభించగా, రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గట్టర్స్ భారత ప్రతినిధులతో చర్చిస్తున్నారు. మయన్మార్ కు చెందిన రొహింగ్య ప్రజలు అక్కడ జరుగుతున్న దాడుల నేపథ్యంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్, భారత్ లకు వలసలగా వెళ్తున్నారు. వారి కోసం రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించి ఆశ్రయం కల్పించింది. భారత్ లో సుమారు 16,500 మంది పౌరులకు గుర్తింపు కార్డులను కూడా మంజూరు చేసింది. అయితే హోంశాఖ సహోయమంత్రి కిరెన్ రిజ్జూ మాత్రం అవి చెల్లవని తేల్చేశారు. "శరణార్థుల విషయంలో ఐక్యరాజ్య సమితి చొరవను మేము అడ్డుకోబోం. అలాగని అక్రమచొరబాటుదారులను ఇక్కడ జీవించేందుకు ఒప్పుకోలేం. అలాగని వాళ్లనేం బంగాళాఖాతంలో పడేయట్లేదు. చట్టం ప్రకారమే తిరిగి వాళ్లను స్వదేశానికి పంపించేస్తాం. ఇప్పటికే మయన్మార్, బంగ్లాదేశ్ లతో సంపద్రింపులు చేపట్టాం" అని రిజ్జూ పేర్కొన్నారు. మయన్మార్ రఖీనే రాష్ట్రంలో స్థిరపడిన రొహింగ్య ముస్లిం ప్రజలపై గత కొన్నేళ్లుగా చొరబాటుదారుల ముద్ర వేయటమే కాదు, అల్లర్లకు కారణమౌతున్నారని పేర్కొంటూ సైన్యం వారిపై దాడులకు పాల్పడుతోంది. రొహింగ్య యువకులను కాల్చి చంపటం, మహిళలపై అకృత్యాలు పెరిగిపోవటంతో వారంతా పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. గత అక్టోబర్‌లో సుమారు 75,000 మంది బంగ్లాదేశ్ లోకి ప్రవేశించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే అక్కడ రక్షణ కరువైందన్న ప్రజలను తిరిగి అదే ప్రాంతానికి పంపటం సరికాదన్న అభిప్రాయం ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేస్తోంది.