సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్‌లో ఊచకోతకు గురైన రోహింగ్యా ముస్లింలకు భారత ప్రభుత్వం చేయూతగా నిలిచింది. గత ఏడాది మయన్మార్ ప్రభుత్వం, సైన్యం చేతిలో ఊచకోతకు గురైన రోహింగ్యాలు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే. బంగ్లాలో ఉంటున్న రోహింగ్యా ముస్లింలకు భారత ప్రభుత్వం తరుఫున నిత్యవసర వస్తువులను సోమవారం బంగ్లాకు పంపింది. పదిలక్షల లీటర్లకుపైగా కిరోసిన్, ఇరవై వేల కిరోసిన్ స్టవ్‌లు, ఇతర నిత్యవసర వస్తువులు రోహింగ్యాలకు చేరినట్లు బంగ్లాదేశ్‌లో భారత హై కమిషనర్ హర్ష వర్ధన్ వెల్లడించారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాల బలోపేతంలో భాగంగా భారత విదేశాంగ ప్రతినిధులు వాటిని పంపినట్లు ఆయన తెలిపారు. కాగా మయన్మార్ సైన్యం రోహింగ్యాలపై దమనకాండ తరువాత అత్యధికంగా బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో సుమారు ఐదు లక్షల వరకు రోహింగ్యాలు నివాసముంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది
Comments
Please login to add a commentAdd a comment