29 మంది ఏపీ అధికారులకు పోలీస్‌ పతకాలు  | Police medals for 29 Andhra Pradesh Police officers | Sakshi
Sakshi News home page

29 మంది ఏపీ అధికారులకు పోలీస్‌ పతకాలు 

Aug 15 2023 5:40 AM | Updated on Aug 15 2023 5:40 AM

Police medals for 29 Andhra Pradesh Police officers - Sakshi

శంఖబ్రత బాగ్చీ

సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ దేశంలో మొత్తం 954 మంది అధికారులకు సోమవారం పోలీస్‌ పతకాలను ప్రకటించింది. వీరిలో ఒకరిని రాష్ట్రపతి పోలీస్‌ శౌర్య పతకం, 229 మందిని పోలీస్‌ శౌర్య పతకాలు, 82 మందిని రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 642 మందిని ప్రతిభా పోలీస్‌ పతకాలకు ఎంపిక చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు 1 రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకం, 10 ప్రతిభా పోలీస్‌ పతకాలు, 18 పోలీస్‌ శౌర్య పతకాలు లభించాయి. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను రాష్ట్రానికి చెందిన అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏడీజీపీ) శంఖబ్రత బాగ్చి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకానికి ఎంపికయ్యారు.  

రాష్ట్రం నుంచి ప్రతిభా పోలీస్‌ పతకాలకు ఎంపికైనవారు.. 
1. దాడిరెడ్డి మురళీధర్‌రెడ్డి, సీఐ, కర్నూల్‌ టౌన్‌ 
2. సింగులూరి వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు 
3. కొండపు ఆనందరెడ్డి, డీసీపీ, విశాఖపట్నం సిటీ 
4. సుంకర మునిస్వామి, ఆర్‌ఐ, మంగళగిరి 
5. బెండి కాశీపతి, అసిస్టెంట్‌ రిజర్వ్‌ 
సబ్‌ ఇన్‌స్పె­క్టర్, విశాఖపట్నం 
6. జమ్మలమడుగు నిసార్‌ అహ్మద్‌ బాషా, ఏఎస్‌ఐ 
7. బెహార నాగభూషణరావు, ఏఎస్‌ఐ 
8. కన్నూజు వాసు, ఇన్‌స్పెక్టర్, గుంటూరు 
9. మంద సత్యనారాయణ, ఏఎస్‌ఐ 
10. తోట బ్రహ్మయ్య, డీఎస్పీ  
రాష్ట్రం నుంచి పోలీస్‌ శౌర్య 
పతకాలకు ఎంపికైనవారు.. 
1. కనపాకల హేమసుందరరావు (ఏఏసీ) 
2. మార్పు సుదర్శనరావు (ఎస్‌సీ) 
3. జక్కు దేముడు (జేసీ) 
4. పొన్నాడ లవకుమార్‌ (ఏఏసీ) 
5. చిక్కంగౌరి వెంకట రామచంద్రరావు (ఎస్‌సీ) 
6. ముర సత్యనారాయణరావు (జేసీ) 
7. మట్టపర్తి సుబ్రహ్మణ్యం (జేసీ) 
8. శంఖబతుల వీరవెంకట సత్యనారాయణ (జేసీ) 
9. ప్రగడ పోశయ్య (జేసీ) 
10. ఏడిగగండ్లూరు అశోక్‌ కుమార్‌
     (అడిషనల్‌ ఎస్పీ) 
11. పైల పార్వతీశం (ఎస్‌సీ) 
12. గొర్లి రమణబాబు (జేసీ) 
13. షేక్‌ సర్దార్‌ ఘనీ (ఇన్‌స్పెక్టర్‌) 
14. గుల్లిపల్లి నాగేంద్ర (జేసీ) 
15. కోమట్ల రామచంద్రారెడ్డి (జేసీ) 
16. దాసరి సురేష్‌ బాబు (జేసీ) 
17. ఏపూరి మధుసూదన్‌రావు (జేసీ) 
18. పాళ్యం మహేశ్వరరెడ్డి (ఏఏసీ)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement