gallantry medals
-
29 మంది ఏపీ అధికారులకు పోలీస్ పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ దేశంలో మొత్తం 954 మంది అధికారులకు సోమవారం పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఒకరిని రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం, 229 మందిని పోలీస్ శౌర్య పతకాలు, 82 మందిని రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందిని ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 1 రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం, 10 ప్రతిభా పోలీస్ పతకాలు, 18 పోలీస్ శౌర్య పతకాలు లభించాయి. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను రాష్ట్రానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) శంఖబ్రత బాగ్చి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపికైనవారు.. 1. దాడిరెడ్డి మురళీధర్‌రెడ్డి, సీఐ, కర్నూల్ టౌన్ 2. సింగులూరి వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు 3. కొండపు ఆనందరెడ్డి, డీసీపీ, విశాఖపట్నం సిటీ 4. సుంకర మునిస్వామి, ఆర్ఐ, మంగళగిరి 5. బెండి కాశీపతి, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, విశాఖపట్నం 6. జమ్మలమడుగు నిసార్ అహ్మద్ బాషా, ఏఎస్ఐ 7. బెహార నాగభూషణరావు, ఏఎస్ఐ 8. కన్నూజు వాసు, ఇన్స్పెక్టర్, గుంటూరు 9. మంద సత్యనారాయణ, ఏఎస్ఐ 10. తోట బ్రహ్మయ్య, డీఎస్పీ రాష్ట్రం నుంచి పోలీస్ శౌర్య పతకాలకు ఎంపికైనవారు.. 1. కనపాకల హేమసుందరరావు (ఏఏసీ) 2. మార్పు సుదర్శనరావు (ఎస్సీ) 3. జక్కు దేముడు (జేసీ) 4. పొన్నాడ లవకుమార్ (ఏఏసీ) 5. చిక్కంగౌరి వెంకట రామచంద్రరావు (ఎస్సీ) 6. ముర సత్యనారాయణరావు (జేసీ) 7. మట్టపర్తి సుబ్రహ్మణ్యం (జేసీ) 8. శంఖబతుల వీరవెంకట సత్యనారాయణ (జేసీ) 9. ప్రగడ పోశయ్య (జేసీ) 10. ఏడిగగండ్లూరు అశోక్ కుమార్ (అడిషనల్ ఎస్పీ) 11. పైల పార్వతీశం (ఎస్సీ) 12. గొర్లి రమణబాబు (జేసీ) 13. షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్) 14. గుల్లిపల్లి నాగేంద్ర (జేసీ) 15. కోమట్ల రామచంద్రారెడ్డి (జేసీ) 16. దాసరి సురేష్ బాబు (జేసీ) 17. ఏపూరి మధుసూదన్‌రావు (జేసీ) 18. పాళ్యం మహేశ్వరరెడ్డి (ఏఏసీ) -
954 మందికి పోలీసు పతకాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 63 మంది ఎంపిక
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను.ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG), 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు(PPM), 642 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 55 మంది పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్ నుంచి 27, ఛత్తీస్‌గఢ్ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం(PPMG) ఒకరిని వరించింది. సీఆర్పీఎఫ్ అధికారి లౌక్రక్‌పామ్ ఇబోంచా సింగ్‌కు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఏపీ నుంచి 29 మందికి ఈ పతకాలు దక్కాయి. 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. ఇక తెలంగాణ నుంచి 34 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. 22 మందికి పోలీస్ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. కాగా స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది. తెలంగాణ నుంచి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు పొందిన ఇద్దరు వీరే ►అదనపు డీజీ విజయ్ కుమార్, ►ఎస్పీ మదాడి రమణ కుమార్ తెలంగాణకు చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు ►ఎస్పీ భాస్కరన్, ఇన్ స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్సై బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కాన్ స్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు. గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కాన్స్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్. తెలంగాణ నుంచి పోలీస్ సేవా పతకాలు లభించిన పది మంది పోలీస్‌ల వివరాలు : ►బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ,ఖైరతాబాద్. ►మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు, అదనపు ఎస్పీ. ►ఆత్మకూరి వెంకటేశ్వరి, అదనపు ఎస్పీ. ►ఆందోజు సత్యనారాయణ, ఆర్ఎస్ఐ. ►కక్కెర్ల శ్రీనివాస్, ఆర్ఎస్ఐ. ►మహంకాళి మధు, ఆర్ఎస్ఐ. ►అజెల్ల శ్రీనివాస రావు, ఆర్ఐ. ►రసమోని వెంకటయ్య, సీనియర్ కమాండో. ►అరవేటి భాను ప్రసాద్ రావు, ఇన్ స్పెక్టర్,హైదరాబాద్. ►సాయన వెంకట్వార్లు, ఏఎస్ఐ. -
పాకిస్తాన్లో ‘భగత్ సింగ్’ మంటలు
లాహోర్: స్వతంత్రం కోసం పోరాడిన సర్దార్ భగత్ సింగ్‌కు పాకిస్తాన్‌లోని అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అయిన ‘నిషాన్ ఏ హైదర్’తో సత్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆయనను 86 ఏళ్ల కింద ఉరి తీసిన లాహోర్‌లోని షాదమన్ చౌక్‌లో భగత్‌సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది. ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఖురేషీ మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఒక యూత్ ఐకాన్ అని, నేటి యువతకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. స్వతంత్రం కోసం భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని, ఆత్మత్యాగాన్ని అందరం గుర్తించాలని ఖురేషి తాజాగా మరోసారి పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వానికి లేఖ రాశారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా సైతం భగత్ సింగ్ త్యాగానికి నివాళి అర్పించాలన్న వ్యాఖ్యలను లేఖలో పొందుపరిచారు. సర్దార్ భగత్ సింగ్.. నిజమైన స్వతంత్ర యోధుడు. అతనికి పాకిస్తాన్ అత్యుతన్న గాలంటరీ మెడల్‌తో సత్కరించాలని ఖురేషీ స్పష్టం చేశారు. స్వతంత్రం కోసం చిన్నతనంలోనే బ్రిటీష్‌తో భగత్ చేసిన పోరాటం అసామాన్యం అని కొనియాడారు. నాటి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న భగత్ సింగ్‌ను, ఆన మిత్రులు అయిన సుఖ్‌దేవ్, రాజ్ గురులను 1931 మార్చి 23న లాహోర్ ఉరితీశారు. నిషాన్ ఏ హైదర్ అంటే: పాకిస్తాన్ సైన్యంలో అత్యంత ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే నిషాన్ ఏ హైదర్. ఈ పదానికి సింహబలుడు అని అర్థం. హఫీజ్ సయీద్ వ్యతిరేకత: సర్దార్ భగత్ సింగ్‌కు అత్యున్న సైనిక పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్‌పై ముంబై దాడుల సూత్రధారి, జమాతే ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక షాదమన్ చౌక్ పేరు మార్పుపైనా వ్యతిరేకత ప్రకటించారు. ఇటువంటి చర్యలు పాకిస్తాన్ పైర సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని హఫీజ్ సయీద్ పేర్కొన్నారు. -
బుర్హాన్ ను మట్టుబెట్టిన వీరులకు పతకాలు
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో తీవ్రవాది బుర్హాన్ వనీని ఎన్ కౌంటర్ చేసిన ఘటనలో పాల్గొన్న రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు పోలీసు వీరులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శౌర్య పతకాలు అందజేసింది. మేజర్ సందీప్‌తో పాటు కెప్టెన్ మానిక్ శర్మ, నాయక్ అరవింద్ సింగ్ చౌహన్ లు పతకాలు అందుకున్న వారిలో ఉన్నారు. 2016 జులై 8న మేజర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించారు. బుర్హాన్ వనీ మరణానంతరం కశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్లు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. -
‘సర్జికల్’ యోధులకు శౌర్యపతకాలు
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడి చేసిన జవాన్లకు కేంద్రం రిపబ్లిక్ డే సందర్భంగా శౌర్యపతకాలు ప్రకటించింది. దాడిలో పాల్గొన్న 4వ, 9వ పారామిటలరీలకు చెందిన 19 మంది సైనికులను కీర్తిచక్ర, యుధ్ సేవా తదితర మెడళ్లు వరించాయి. దాడిలో పటాలాలకు సారథ్యం వహించిన మేజర్ రోహిత్ సూరి(4వ పారా)కి శాంతిసమయంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్యపతకమైన కీర్తిచక్రను, ఈ దళాల కమాండింగ్ అధికారులైన కపిల్ యాదవ్, హర్‌ప్రీత్ సంధులకు యుధ్సేవాను ప్రకటించారు. ఈ పటాలాల్లోని ఐదుగురికి శౌర్యచక్రలు, 13 మం దికి సేనా మెడల్స్ దక్కాయి. కాగా, గూర్ఖా రైఫిల్స్ హవల్దార్ ప్రేమ్ బహదూర్ రేస్మి మగర్‌కు మరణానంతరం కీర్తి చక్రను, పాండురంగ్ మహదేవ్, నాయక్ విజయ్ కుమార్ తదితరులకు మరణానంతరం సేనా మెడల్స్‌ను ప్రకటించారు. వివిధ దళాల సైనికులకు 398 శౌర్య, ఇతర రక్షణ పతకాలు అందించేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆర్మీ తూర్పు కమాండ్ సారథి మేజర్ ప్రవీణ్ బక్షి, ఆర్మీ చీఫ్ పదవికి బిపిన్ రావత్‌తో పోటీపడిన దక్షిణ కమాండ్ సారథి మేజర్ పీఎం హరీజ్‌లకు పరమ్ విశిష్ట సేవాల మెడళ్లు దక్కాయి. -
శౌర్య తెలంగాణ
కేంద్రం ప్రకటించిన పతకాల్లో రాష్ట్రం రికార్డు కానిస్టేబుల్ శ్రీనివాసులుకు ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర ► రాష్ట్రపతి శౌర్య పోలీసు పతకాలు 2, ‘శౌర్య’ పతకాలు 24 ► ‘అత్యుత్తమ’ పతకాలు 11, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం 1 ► నల్లగొండకు చెందిన ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుకు మరణానంతరం అవార్డులు ► దేశవ్యాప్తంగా 170 మందికి ‘శౌర్య’ మెడల్ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే అవార్డుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే అధికారులకు ఇచ్చే శౌర్య పతకాల్లో అత్యధికం కైవసం చేసుకుంది. తెలంగాణ నిఘా విభాగానికి చెందిన కానిస్టేబుల్ కె.శ్రీనివాసులుకు ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర పతకం లభించింది. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించే భద్రతా దళాల సిబ్బందికి కేంద్రం ఈ అవార్డు ఇస్తుంది. అత్యంత అరుదుగా మాత్రమే పోలీసు విభాగానికి ఇస్తుంది. కేంద్రం ఆదివారం రాష్ట్రపతి పోలీసు పతకాలతోపాటు అశోక్చక్ర, శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. దేశం మొత్తమ్మీద ఒకరికి అశోక్చక్ర లభించగా.. శౌర్యచక్ర పతకాలు 14 మందిని వరించాయి. అందులో శ్రీనివాసులు ఒక్కరే పోలీసు విభాగానికి చెందిన వారు కావడం విశేషం. మిగిలిన 13 మంది భద్రతా దళానికి చెందిన వారే. రాష్ట్ర చరిత్రలో (ఉమ్మడి ఏపీ సహా) కానిస్టేబుల్ స్థాయి వ్యక్తికి ఇంతటి మహోన్నత పథకం లభించిడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో ఉగ్రవాది ఆలం జెబ్ అఫ్రిదిని పట్టుకునేందుకు శ్రీనివాసులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఉగ్రవాది కత్తితో పొడవడంతో ప్రాణపాయస్థితిలో బయటపడ్డాడు. ఇక మొత్తంగా రాష్ట్రానికి రాష్ర్టపతి శౌర్య పోలీస్ పతకాలు 2, శౌర్య పోలీసు పతకాలు 24, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 1, అత్యుత్తమ సేవా పతకాలు 11 లభించాయి. నల్లగొండ జిల్లాకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ దూదేకుల సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుకు మరణానంతరం రాష్ర్టపతి శౌర్య పోలీస్ పతకాలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా మొత్తం 170 మంది అధికారులకు రాష్ట్రపతి, పోలీసు శౌర్య పతకాలను ప్రకటించగా.. అందులో 26 పతకాలు తెలంగాణ పోలీసు విభాగానికే వచ్చాయి. అవార్డుల చరిత్రతో ఓ రాష్ట్ర పోలీసు విభాగానికి ఒకేసారి ఇన్ని రావడం రికార్డు అని అధికారులు పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా ఏడుగురు అధికారులు రాష్ట్రపతి పోలీసు శౌర్య పురస్కారానికి ఎంపిక కాగా అందులో రెండు పురస్కారాలు రాష్ట్రానికే వచ్చాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 2, అత్యుత్తమ సేవా పతకాలు 14 లభించాయి. శౌర్యచక్ర 1. కె.శ్రీనివాసులు (కానిస్టేబుల్, నిఘా విభాగం) రాష్ట్రపతి శౌర్య పోలీస్ పతకాలు 1. దూదేకుల సిద్దయ్య (సబ్ ఇన్స్పెక్టర్, నల్లగొండ) 2. నాగరాజు (కానిస్టేబుల్, నల్లగొండ) రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం 1 రాజీవ్ రతన్, డిజి, ఫైర్ సర్వీసెస్ శౌర్య పోలీస్ పతకాలు 1.ఎం. చంద్రశేఖర్, ఏసీపీ 2.కె. రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ 3.సయ్యద్ అబ్దుల్ కరీం, హెడ్ కానిస్టేబుల్ 4.మహ్మద్ ముజీబ్, హెడ్ కానిస్టేబుల్ 5.మహ్మద్ తాజ్ పాషా, కానిస్టేబుల్ 6.ఎస్.రాజవర్ధన రెడ్డి, కానిస్టేబుల్ 7.మహ్మద్ ముషరఫ్ బాబా, కానిస్టేబుల్ 8.డాక్టర్ టి.ప్రభాకర రావు, ఎస్పీ 9.ఎన్.అనిల్ కుమార్, కానిస్టేబుల్ 10.వేమాద్రి రమేశ్, కానిస్టేబుల్ 11.కొనతం మధుసూధన్, కానిస్టేబుల్ 12.తోడేటి శివ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ 13.ముత్తినేని శ్రీను, కానిస్టేబుల్ 14.అన్నారెడ్డి చిన్న బాల గంగిరెడ్డి, ఇన్స్పెక్టర్ 15.ఎల్. జానకిరాం, కానిస్టేబుల్ 16.రాజేశ్ కుమార్, ఎస్పీ 17.మాద దయానందరెడ్డి, డీఎస్పీ 18.సిహెచ్ ఆర్వి.ఫణీందర్, ఇన్స్పెక్టర్ 19.జి.సత్యనారాయణ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 20.సోనిలాల్ అమృత్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ 21.సయ్యద్ సర్వర్ పాషా, హెడ్ కానిస్టేబుల్ 22.గొలనకొండ నరేందర్, కానిస్టేబుల్ 23.మహ్మద్ ఖాదిర్, కానిస్టేబుల్ 24. వేముల భాస్కర్, ఇన్స్పెక్టర్ అత్యుత్తమ సేవా పోలీస్ పతకాలు 1.వై. శ్రీనివాస రావు, కమాండెంట్, 7వ బెటాలియన్, టీఎస్ఎస్పి, నిజామాబాద్ 2.చింతకుంటల నరోత్తమ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ, మెదక్ 3.కృష్ణస్వామి నటరాజన్ బాలాజీ, అసిస్టెంట్ కమాండెంట్, ఖమ్మం 4.పి.మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ, హైదరాబాద్ 5.షేక్ మహ్మద్ నిజాముద్దీన్, ఏసీపీ, హైదరాబాద్ 6. ఎ.బాలకోటి, డీఎస్పీ, మహబూబ్‌నగర్ 7.ఎ.వి.సత్యనారాయణ, ఇన్స్పెక్టర్, హైదరాబాద్ 8.డి.వీరంగయ్య, ఏఎస్ఐ, హైదరాబాద్ 9.వి.పాండురంగారావు, ఏఎస్ఐ, హైదరాబాద్ 10.మహ్మద్ అబ్దుల్ నయీమ్,హెడ్ కానిస్టేబుల్, హైదరాబాద్ 11. డి.బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్, హైదరాబాద్ పోలీసు శాఖకు అభినందనలు: సీఎం తెలంగాణ పోలీస్ యంత్రాంగం కనబరిచిన ప్రతిభను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పోలీసు పతకాల్లో తెలంగాణ పోలీసులు అత్యధిక పతకాలు సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసు శాఖకు మనస్ఫూర్తిగా అభినందించారు. సంఘ వ్యతిరేక శక్తుల ఆటకట్టించటంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో తెలంగాణ పోలీసులు పోషిస్తున్న పాత్ర పట్ల జాతి యావత్తూ గర్విస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల కృషిని గుర్తించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు పొందిన పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. గత రెండేళ్లలో ఉగ్రవాద నిర్మూలన కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్యలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయన్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టిన 10 మందికి పతకాలు.. గతేడాది నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సిమీ ఉగ్రవాదులను జిల్లా పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల పోరాట పటిమను గుర్తించిన కేంద్రం రాష్ట్రపతి అవార్డులకు ఎంపిక చేసింది. అప్పటి జిల్లా ఎస్పీతో పాటు ఒక ఇన్స్పెక్టర్, ఆరుగురు కానిస్టేబుళ్లకు, వీర మరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజులకు ఈ అవార్డులను ప్రకటించింది. -
గురుదాస్‌పూర్ దాడి: పోలీసులకు సాహస పతకాలు
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన ఎస్పీ బల్జీత్ సింగ్, సాహసోపేతంగా పోరాడిన మరో ఇద్దరు పోలీసులకు అత్యున్నత పోలీసు మెడల్స్ ఇవ్వనున్నారు. ఇన్స్పెక్టర్ బల్బీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ తారా సింగ్ ఈ దాడి జరిగిన సమయంలో పోలీసు స్టేషన్లో ఉన్నారు. వాళ్లు ఉగ్రవాదులను అణిచేయడంలో మంచి సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దాంతో వారికి కూడా పతకాలు ప్రకటించారు. బల్జీత్ సింగ్‌కు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని ప్రకటించారు. బల్జీత్ సింగ్ తండ్రి కూడా కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన లష్కరే తాయిబా లేదా జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఓ బస్సు మీద కూడా కాల్పులు జరిపి, తర్వాత దీనానగర్ పోలీసు స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. ఈ దాడిలో ముగ్గురు పౌరులు, బల్జీత్ సింగ్, ముగ్గురు హోం గార్డులు మరణించారు. -
13 మందికి సీఎం శౌర్య పతకాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి శౌర్య పతకానికి పోలీసు శాఖ నుంచి 13 మంది ఎంపికయ్యారు. కె.శివప్రసాద్(ఎస్ఐ, వెంకటాపురం, ఖమ్మం జిల్లా) కామరాజు(ఆర్ఎస్ఐ, ఖమ్మం) నోముల వెంకటేష్(ఎస్ఐ, కోహిర్, మెదక్ జిల్లా), పి.భాస్కర్(హెచ్‌సీ, ఇంటెలిజెన్స్), సక్రా నాయక్ గుగులోత్(ఏఏసీ, గ్రేహౌండ్స్), గోపి నరేంద్రప్రసాద్(ఏఏసీ, గ్రేహౌండ్స్) ఎ.భాస్కర్(ఏఏసీ, గ్రేహౌండ్స్)తోపాటు గ్రేహౌండ్స్‌లో జాయింట్ కమాండర్లు వీరస్వామి సోలం, సీహెచ్ శ్యాంబాబు, డి.శేఖర్, కూన రాము, కె చంద్రశేఖర్, కె.రాజ్‌కుమార్ ముఖ్యమంత్రి శౌర్యపతకానికి ఎంపికయ్యారు. పోలీసు కఠిన సేవా పతకానికి 30 మంది, పోలీసు ఉత్తమ సేవా పతకానికి 38 మంది, పోలీసు సేవా పతకానికి 142 మంది ఎంపికయ్యారు. అగ్నిమాపక, అత్యవసర సర్వీసుల శాఖలో ఉత్తమ సేవా పతకానికి నలుగురు, సేవా పతకానికి 25 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో మహోన్నత సేవా పతకానికి అదనపు ఎస్పీ కె.మహేంద్రపాత్రుడు, ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 10 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)లో ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 13 మంది ఎంపికయ్యారు. పోలీసు పతకాలు పొందిన వారు షేక్ సిరాజుద్దీన్ (డీఐజీ, ఏపీఎస్పీ), ఉక్కలం రామ్మోహన్ (అదనపు ఎస్పీ, సైబర్ క్రైం), మహ్మద్ తహరాలి (ఏసీపీ, ఫలక్‌నుమా), జె.కోటేశ్వరరావు (అసిస్టెంట్ డెరైక్టర్, అప్పా), సి.సన్నీ (అదనపు ఎస్పీ, ఆక్టోపస్), ఎస్.సయ్యద్‌భాషా (సీఎస్‌వో, డీజీపీ కార్యాలయం), ఎస్.ఎం.రత్న (డీఎస్పీ, సీఐడీ), టి.శంకరరెడ్డి (ఏసీపీ, హైదరాబాద్), జె.భాస్కరరెడ్డి (డీఎస్పీ, నెల్లూరు రేంజ్), జి.నరసింహారెడ్డి (డీఎస్పీ, సీఐ సెల్), కె.ఆనందరెడ్డి (సీఐ, ఎస్ఐబీ), వై.రామకృష్ణ (సీఐ, జీకే వీధి, విశాఖ జిల్లా), సీహెచ్ఆర్వీ ఫణిధర్ (ఇన్స్పెక్టర్, సీఐ సెల్), కె.రవీందర్‌రెడ్డి (ఇన్స్పెక్టర్, సీఐ సెల్) జి.గోవిందరావు (ఎస్ఐ, కోటఊరుట్ల, విశాఖ జిల్లా), పి.రమేష్ (ఎస్ఐ, నాథవరం, విశాఖ జిల్లా), కె.నాగరాజు (ఎస్ఐ, ఖమ్మం రూరల్), పి.నరసింహారెడ్డి (సీకే దిన్నె, వైఎస్ఆర్ జిల్లా), కె.చంద్రశేఖర్ (ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ, హైదరాబాద్), పి.జితేందర్‌ప్రసాద్ (ఎస్ఐ, ఇంటెలిజెన్స్), ఐ.ఆర్.చంద్రశేఖరరావు (ఏఆర్ఎస్ఐ, ఎస్ఐబీ), ఎం.నరసింగరావు (ఏఎస్ఐ, సీఐ సెల్), ఎం.వెంకటేశ్వరరావు (హెచ్‌సీ, ఎస్ఐబీ), సయ్యద్ అఖీల్(హెచ్‌సీ, సీఐ సెల్), సి.వెంకటరమణ (సీనియర్ కమాండో, గ్రేహౌండ్స్) ఎం.తిరుపతిరావు (ఏఆర్‌హెచ్‌సీ, విశాఖ జిల్లా), శీను చింతా (సీనియర్ కమాండో, గ్రేహౌండ్స్) జి.కోదండ (హెచ్‌సీ, ఎస్ఐబీ), ఖాజా మొహినుద్దీన్ (హెచ్‌సీ, సీఐ సెల్), మహ్మద్ ముజీబ్ (హెచ్‌సీ, సీఐ సెల్), మహ్మద్ అక్తర్ పాషా(హెచ్‌సీ, సీఐ సెల్), బి.శ్రీనివాసరావు (జూనియర్ కమాండో, గ్రేహౌండ్స్), ఎస్.వి.భాస్కరరావు (ఏఆర్పీసీ, విశాఖ జిల్లా), కె.లక్ష్మీరమేష్ (జూనియర్ కమాండో, గ్రేహౌండ్స్). అటవీ శాఖ నుంచి పతకాలు అందుకున్న వారు ఎస్.మన్నయ్య (ఎఫ్ఆర్వో, ఆదిలాబాద్ జిల్లా), ఎం.జ్యోతి (ఎఫ్ఎస్వో, వాల్మీకిపురం, మదనపల్లి రేంజ్), ఎన్.బాలకృష్ణారెడ్డి (ఎఫ్ఎస్వో, శ్రీకాళహస్తి రేంజ్), విధి నిర్వహణలో మరణించిన ఆర్.గంగయ్య (కామారెడ్డి డివిజన్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్) తరఫున ఆయన సతీమణి హేమలత.