
బుర్హాన్ ను మట్టుబెట్టిన వీరులకు పతకాలు
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాది బుర్హాన్ వనీని ఎన్ కౌంటర్ చేసిన ఘటనలో పాల్గొన్న రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు పోలీసు వీరులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శౌర్య పతకాలు అందజేసింది. మేజర్ సందీప్‌తో పాటు కెప్టెన్ మానిక్ శర్మ, నాయక్ అరవింద్ సింగ్ చౌహన్ లు పతకాలు అందుకున్న వారిలో ఉన్నారు. 2016 జులై 8న మేజర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించారు. బుర్హాన్ వనీ మరణానంతరం కశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్లు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.