
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను.ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG), 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు(PPM), 642 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది.
పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 55 మంది పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్ నుంచి 27, ఛత్తీస్‌గఢ్ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం(PPMG) ఒకరిని వరించింది. సీఆర్పీఎఫ్ అధికారి లౌక్రక్‌పామ్ ఇబోంచా సింగ్‌కు ఈ పురస్కారం అందుకోనున్నారు.
ఏపీ నుంచి 29 మందికి ఈ పతకాలు దక్కాయి. 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. ఇక తెలంగాణ నుంచి 34 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. 22 మందికి పోలీస్ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. కాగా స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది.
తెలంగాణ నుంచి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు పొందిన ఇద్దరు వీరే
►అదనపు డీజీ విజయ్ కుమార్,
►ఎస్పీ మదాడి రమణ కుమార్
తెలంగాణకు చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు
►ఎస్పీ భాస్కరన్, ఇన్ స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్సై బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కాన్ స్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు. గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కాన్‌స్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్.
తెలంగాణ నుంచి పోలీస్ సేవా పతకాలు లభించిన పది మంది పోలీస్‌ల వివరాలు :
►బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ,ఖైరతాబాద్.
►మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు, అదనపు ఎస్పీ.
►ఆత్మకూరి వెంకటేశ్వరి, అదనపు ఎస్పీ.
►ఆందోజు సత్యనారాయణ, ఆర్ఎస్ఐ.
►కక్కెర్ల శ్రీనివాస్, ఆర్ఎస్ఐ.
►మహంకాళి మధు, ఆర్ఎస్ఐ.
►అజెల్ల శ్రీనివాస రావు, ఆర్ఐ.
►రసమోని వెంకటయ్య, సీనియర్ కమాండో.
►అరవేటి భాను ప్రసాద్ రావు, ఇన్ స్పెక్టర్,హైదరాబాద్.
►సాయన వెంకట్వార్లు, ఏఎస్ఐ.
Comments
Please login to add a commentAdd a comment